Green Cloths During Surgery: ఆసుపత్రులలో డాక్టర్లు ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులు ధరించడం చూస్తూ ఉంటాం. ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు వైద్యులు ఆకుపచ్చ దుస్తులను ధరిస్తారు. వైద్యులు ఆపరేషన్ల సమయంలో ఎరుపు, పసుపు లేదా మరే ఇతర రంగు దుస్తులను కాకుండా ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులను మాత్రమే ఎందుకు ధరిస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ?
ఆపరేషన్ సమయంలో వైద్యులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తారు ?
డాక్టర్ల దుస్తులు గతంలో వైద్యులతో సహా ఆసుపత్రి సిబ్బంది అందరూ తెల్లటి దుస్తులు ధరించేవారట. కానీ 1914 సంవత్సరంలో ఒక వైద్యుడు ఈ సాంప్రదాయ దుస్తులను ఆకుపచ్చ రంగులోకి మార్చాడు. అప్పటి నుండి ఇది ఒక ట్రెండ్‌గా మారింది. ఆకుపచ్చ రంగు దుస్తులే కాకుండా కొంతమంది వైద్యులు ప్రస్తుతం నీలిరంగు దుస్తులను కూడా ధరించడం మనం చేస్తుంటాం.
డాక్టర్లు వేసుకునే దుస్తులతో పాటు ఆసుప్రతిలోని కర్టెన్లు కూడా ఆకుపచ్చ లేదా నీలి రంగులోనే ఉంటాయి. ఇదే కాకుండా ఆసుపత్రి సిబ్బంది వేసుకునే బట్టలతో పాటు మాస్కులు కూడా ఇవే రంగుల్లో ఉంటాయి. మరి ఆకుపచ్చ రంగు దుస్తులను డాక్టర్లు వేసుకోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.