Tips For Glowing Skin: అందంగా కనిపించాలని ఎవరి మాత్రం ఉండదు చెప్పండి. ముఖ్యంగా అమ్మాయిలు గ్లోయింగ్ స్కిన్ కోసం రకరకాల ఫేస్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇదిలా ఉంటే.. రసాయనాలు కలిపి తయారు చేసిన ఈ ప్రొడక్ట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే.. కొన్ని రకాల స్కిన్ కేర్ టిప్స్ తప్పకుండా పాటించాలి. వీటిని ట్రై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు మచ్చలు కూడా దూరం అవుతాయి.
గ్లోయింగ్ స్కిన్ కోసం టిప్స్:
చర్మాన్ని తేమగా ఉంచుకోండి:
ముఖం అందంగా కనిపించాలంటే.. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు క్రమం తప్పకుండా ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేయండి. దీనిని తరచుగా వాడటం వల్ల ముడతల సమస్య తగ్గుతుంది. అంతే కాకుండా చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. మీరు మీ చర్మాన్ని తేమగా ఉంచుకుంటే.. మీ ముఖం ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటుంది.
సన్‌స్క్రీన్ వాడండి:
సూర్యుడి హానికరమైన కిరణాలు మీ చర్మానికి చాలా హాని కలిస్తాయి. సూర్య కిరణాలు మీ చర్మంపై ముడతలు పడటానికి కూడా కారణమవుతాయి. దీని కారణంగా మీ ముఖం క్రమంగా నల్లబడటం ప్రారంభమవుతుంది. ముడతలను నివారించడానికి, అంతే కాకుండా ముఖ కాంతిని కాపాడుకోవడానికి.. మీరు ప్రతి రోజు తప్పకుండా సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి. బయటకు వెళ్ళినప్పుడు సన్‌స్క్రీన్ అప్లై చేయడం అస్సలు మరచిపోకూడవు. ప్రతి 4 గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్ వాడటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇది మీ చర్మం సూర్య కిరణాల బారిన పడకుండా నిరోధిస్తుంది. అంతే కాకుండా మీ చర్మం యొక్క సహజ రంగు మారకుండా కాపాడుతుంది.
ఫేస్ మసాజ్ చేయండి:
ముఖానికి మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఇది ముడతలను తగ్గిస్తుంది. ముఖానికి సహజమైన మెరుపును అందిస్తుంది. వారానికి కనీసం రెండుసార్లు మీ ముఖాన్ని మసాజ్ చేయడం చాలా ముఖ్యం. కొబ్బరి నూనెతో కూడా మీరు ముఖానికి చేయవచ్చు.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం:
మీ ముఖానికి సహజమై మెరుపును తీసుకురావాలనుకుంటే.. మీ రోజువారీ ఆహారంలో తగినంత పోషకాలు ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం మీరు నారింజ, నిమ్మ, బాదం, ఆకుపచ్చ కూరగాయలతో పాటు విటమిన్ సి , విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం అవసరం. అవి చర్మాన్ని పోషిస్తాయి. అంతే కాకుండా ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.
Also Read: జుట్టు సమస్యలేవైనా.. వీటిని వాడితే చాలు
ఈ విషయాలను గుర్తుంచుకోండి:
ప్రతిరోజూ మీ ముఖాన్ని నీటితో బాగా శుభ్రం చేసుకోండి.
మీరు మీ ముఖానికి ఏదైనా క్రీమ్ ఉపయోగిస్తుంటే.. చర్మం దెబ్బతినకుండా ఉండటానికి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయండి.
మీ ముఖంపై మెరుపును కాపాడుకోవడానికి మీరు హోం రెమెడీస్ కూడా ట్రై చేయవచ్చు.
మీ ముఖం ప్రకాశవంతంగా ఉండటానికి తగినంతగా నిద్ర అవసరం. సరైన మొత్తంలో నీరు కూడా తాగండి. ఎక్కువ నూనె , మసాలాలు తినకుండా ఉండండి. క్రమం తప్పకుండా యోగా , వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మీరు మీ ముఖం యొక్క కాంతిని కాపాడుకోవచ్చు. అంతే కాకుండా మీ ముఖంపై ముడతలను కూడా తగ్గించుకోవచ్చు.