E-Paper
Advertisement

పనికి రాని పెయింటింగ్‌ను రూ.2,800కి కొన్నాడు.. కట్ చేస్తే కోటీశ్వరుడయ్యాడు, అదెలా?

పనికి రాని పెయింటింగ్‌ను రూ.2,800కి కొన్నాడు.. కట్ చేస్తే కోటీశ్వరుడయ్యాడు, అదెలా?
Advertisement

Gertrude Abercrombie:అదృష్టం ఒకసారి తలుపు తడితే వెంటనే తీయాలి.అలా కాకుండా మెల్లిగా తీద్దామని ఆలస్యం చేస్తే దురదృష్టం తలుపు తీసేదాకా తడుతుంది అన్నారు పెద్దలు.కానీ అమెరికాలో ఓ వ్యక్తి డోర్ దగ్గర కాపలా ఉన్నాడేమో ,అలా అదృష్ట లక్ష్మి తలుపు తట్టిన వెంబడే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఓపెన్ చేసి సాదరంగా లక్ష్మి దేవిని ఆహ్వానించాడు.

అసలు విషయం ఏంటి అంటారా …అమెరికాలోని మిచిగాన్‌లోని కలమజూలో ఓ ఎస్టేట్ సేల్ జరుగుతుంది.అక్కడ ఉన్న పాత వినైల్ రికార్డులు కొనాలని అక్కడికి ఓ కలెక్టర్ అక్కడికి వెళ్లాడు.అయితే ఆ కలెక్టర్ కి అక్కడ ఓ పెయింటింగ్ కనిపించింది.. పెయింటింగ్‌ను అటూ ఇటూ చూసిన అతడు దాన్ని వెనక్కి తిప్పి చూడగా అబెర్‌క్రాంబీ(Abercrombie) అనే పేరు కనిపించింది. దీంతో ఈ పెయింటింగ్ వెనుక ఏదో కథ ఉందని అనుకున్నాడు.

Advertisement

కేవలం 30 డాలర్లకే

ఇక దాన్ని వదులుకోవడం ఇష్టం లేని ఆ కలెక్టర్ ఆ పెయింటింగ్‌ను కేవలం 30 డాలర్లకే కొనేశాడు.ఇక ఇంటికి తెచ్చుకున్న ఆ కలెక్టర్ ఆ పెయింటింగ్‌ ఏంటా అని ఆరాలు తీసే పనిలో పడ్డాడు. ఆ క్రమంలో అది ప్రముఖ చికాగో ఆర్టిస్ట్ గెర్ట్రూడ్ అబెర్‌క్రాంబీ 1951లో వేసిన ‘Alderman Merriam’s Shells’ అనే పెయింటింగ్ అని తెలిసింది. అంతేకాదు.. ఈ పెయింటింగ్ దాదాపు 70 ఏళ్లుగా బయట ప్రపంచానికి కనిపించలేదని కూడా తెలిసింది.

Advertisement

ఆ పెయింటింగ్‌కు పెద్ద చరిత్రే

ఇక కలెక్టర్ ఆరా తీస్తున్న సమయంలో ఆ పెయింటింగ్‌కు పెద్ద చరిత్రే ఉన్నట్టు తెలిసింది. 1952లో గెర్ట్రూడ్ అబెర్‌క్రాంబీ ఈ చిత్రాన్ని తనకి ట్రీట్మెంట్ చేసినందుకు గిఫ్ట్ గా డాక్టర్ జాన్ టీ. రేనాల్డ్స్‌కు ఇచ్చారని అసలు విషయం తెల్సింది.ఇక అప్పటి నుంచి అది రేనాల్డ్స్ కుటుంబం దగ్గరే ఉంది. సంవత్సరాలు గడిచిపోయాయి. పెయింటింగ్ విలువ గురించి పెద్దగా ఎవరికీ తెలియకుండానే అది వారి వద్దనే ఉండిపోయింది.

అయితే 1952-53 సమయంలో ఈ పెయింటింగ్ న్యూయార్క్, చికాగో, మిల్వాకీ, ఇవాన్‌స్టన్‌లలో జరిగిన ప్రదర్శనల్లో ఈ పెయింటింగ్ దర్శనమిచ్చింది.ఆ తర్వాత మాత్రం బయట ఎక్కడా కనిపించలేదు. ఇలా దశాబ్దాల పాటు కనిపించకుండా పోయిన ఈ పెయింటింగ్ ఇదిగో ఇలా అనుకోకుండా మిచిగాన్‌లోని ఓ ఎస్టేట్ సేల్‌లో కలెక్టర్ గారి కళ్ళల్లో పడింది.

 పెయింటింగ్స్‌లో ఇలాంటి గవ్వల డిజైన్

పెయింటింగ్‌ చూస్తే అందులో నల్లటి బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రపు గవ్వలు కనిపిస్తాయి. ఒక గవ్వ ఏకంగా నల్లటి ఖాళీ ప్రదేశంలో తేలుతున్నట్టుగా కనిపిస్తుంది. గవ్వలను అందులో చూపించిన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.ఇక ఈ పెయింటింగ్ లో కనిపించే పగిలిన గవ్వ ఆకారం కూడా చాలా స్పెషల్ అని చెబుతుంటారు. తర్వాత గెర్ట్రూడ్ అబెర్‌క్రాంబీ వేసిన పలు పెయింటింగ్స్‌లో ఇలాంటి గవ్వల డిజైన్ కనిపించడం విశేషం.

ఇక వేలానికి Baumgartner Fine Art Restoration అనే చికాగోకు చెందిన సంస్థ ఈ పెయింటింగ్‌కు రిపేర్, రీస్టోరేషన్ పనులు చేసింది. ఆ తర్వాత న్యూయార్క్‌లోని Freeman’s వేలం సంస్థ ఈ పెయింటింగ్‌ను వేలానికి పెట్టింది.

భారత కరెన్సీలో సుమారు రూ.13 కోట్లు 

మొదట ఈ పెయింటింగ్‌కు 15 వేల డాలర్ల నుంచి 2.5 లక్షల డాలర్ల వరకు ధర రావచ్చని అంచనా వేశారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.14.45 లక్షల నుంచి రూ.2.41 కోట్ల వరకు రావచ్చని భావించారు. కానీ వేలంలో మాత్రం ఊహించని రేంజ్‌లో ధర పలికడం విశేషం.

చివరకు ఈ పెయింటింగ్ వందా రెండు వందలు కాదు ఏకంగా 1,352,600 డాలర్లకు అమ్ముడైంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.13 కోట్లన్న మాట. దీంతో గెర్ట్రూడ్ అబెర్‌క్రాంబీ పెయింటింగ్‌కు కొత్త వరల్డ్ ఆక్షన్ రికార్డు కూడా నమోదైంది.

నక్క తొక్కారనే అనుకోవాలి

గెర్ట్రూడ్ అబెర్‌క్రాంబీ విషయానికి వస్తే ఆవిడ చికాగోలో మంచి పేరు ఉన్న ఆర్టిస్ట్. ఆమె పెయింటింగ్స్‌లో సాధారణంగా కనిపించని వస్తువులు, డార్క్ బ్యాక్‌గ్రౌండ్స్, స్యూరియల్ టచ్ కనిపిస్తుంటాయి. కళతో పాటు మ్యూజిక్ రంగంతోనూ ఆమెకు మంచి అనుబంధం కూడా ఉంది . 1977లో ఆమె చనిపోయినా.. ఇప్పటికీ ఆమె పెయింటింగ్స్‌కు మంచి డిమాండ్ ఉందంటే ఆవిడ తన కళలో ఎంత నిష్ణాతులో అర్థం చేసుకోవచ్చు.

ALSO READ:   :రూ.5,999కే వాషింగ్ మెషీన్..ఆఫర్ అంటే ఇలా ఉండాలి!

ఏది ఏమైనా పెయింటింగ్ కొనడానికి వెళ్లకుండా కేవలం వినైల్ రికార్డుల కోసం వెళ్లిన వ్యక్తి ఉండబట్టలేక రూ.2,800 పెట్టి కొన్న పెయింటింగ్ చివరకు రూ.13 కోట్లకు అమ్ముడవడం అంటే ఆయన గారు ఉదయాన్నే లేచి నక్క తొక్కారనే అనుకోవాలి.

Tags

Related News

58 ఏళ్ల నా భర్తతో పెళ్లికి 16 ఏళ్ల కన్నె పిల్ల కావాలి.. వింత కండిషన్లతో భార్య పత్రికా ప్రకటన

ఇంట్లో వరండా స్థలం చిన్నగా ఉందా? నో టెన్షన్ అందమైన మినీ గార్డెన్ పెంచడానికి ఈజీ టిప్స్

హార్ట్ పేషెంట్లు రాత్రి ఏ పొజిషన్‌లో పడుకోవాలి? సరైన నిద్ర భంగిమలు ఇవే

ప్రెజర్ కుక్కర్‌లో ఈ 5 వంటలు అసలు చేయకూడదు.. ఈ ఫుడ్స్‌తో జాగ్రత్త

పెళ్లికి ముందు మీకు కాబోయే భర్త సంపాదన గురించి అడిగితే తప్పా? ఓపెన్‌గా చర్చించాల్సిన విషయాలివే

ఒంటరితనం మీ తలరాత కాదు.. మీ అలవాటే, సైకాలజీ చెప్పే చేదు నిజాలివే!

ఇంట్లో ఈ దిశను ఖాళీగా ఉంచితేనే లక్ష్మీదేవి కొలువుంటుందా? వాస్తు ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×