E-Paper
Advertisement

వైభ‌వ్ కు కాదు, నీకు జోల పాట పాడే టైం ద‌గ్గ‌ర ప‌డింది..సైమ్ సెల‌బ్రేష‌న్స్ పై క‌మ్రాన్ సీరియ‌స్

వైభ‌వ్ కు కాదు, నీకు జోల పాట పాడే టైం ద‌గ్గ‌ర ప‌డింది..సైమ్ సెల‌బ్రేష‌న్స్ పై క‌మ్రాన్ సీరియ‌స్
Advertisement

Kamran Akmal Slams Sam Ayub Celebration: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని ర్యాగింగ్ చేశాడు పాకిస్తాన్ క్రికెటర్ సైమ్ అయూబ్. వికెట్ తీసిన ఆనందంలో నువ్వు పిల్ల బచ్చావురా అంటూ జోల పాట పాడాడు. అయితే ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) సీరియస్ అయ్యారు. 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీను ర్యాగింగ్ చేయడానికి సిగ్గు లేదా? నీది ఒక బతుకేనా అంటూ ఫైర్ అయ్యారు. వైభ‌వ్ కు కాదు, నీకు జోల పాట పాడే టైం ద‌గ్గ‌ర ప‌డిందని సైమ్ అయూబ్ సెల‌బ్రేష‌న్స్ పై (Kamran Akmal Slams Sam Ayub Celebration) క‌మ్రాన్ అక్మ‌ల్ సీరియ‌స్ అయ్యారు. 15 ఏళ్ల వైభ‌వ్ కాళ్లు మొక్కినా, నా పాపం పోదురా ? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దీంతో క‌మ్రాన్ అక్మ‌ల్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

వైభ‌వ్ కు కాదు, నీకు జోల పాట పాడే టైం ద‌గ్గ‌ర ప‌డింది

వైభవ్ ను ఉద్దేశించి సైమ్ అయూబ్ చేసిన సెలబ్రేషన్స్ పై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సైమ్ అయూబ్ ఇలాంటి చిల్లర పనులు చేస్తాడని తాను అనుకోలేదని మండిపడ్డారు. ఈ లుచ్చా పనులు మానేసి.. క్రికెట్ పైన దృష్టి పెట్టాలని చురకలు అంటించారు. ఇలాంటి దుర్మార్గపు సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో అందంగా కనిపిస్తాయి.. కానీ అవతలి మనిషిని బాధిస్తాయని స్పష్టం చేశారు. మైదానంలో క్రికెట్ మాత్రమే ఆడాలని.. ఇలాంటి చిల్లర సెలబ్రేషన్స్ చేసుకొని పాకిస్తాన్ పరువు తీయకూడదని కౌంటర్ ఇచ్చారు కమ్రాన్ అక్మల్.

Advertisement

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

15 ఏళ్ల కుర్రాడిని బాధించి నువ్వేం సాధించావు? అంటూ నిలదీశారు. అందరికన్నా చిన్న కుర్రాడు వైభవ్… అలాంటోడిని ఎంకరేజ్ చేయాలి తప్ప, ఇలా హింసించకూడదని ఫైర్ అయ్యారు. 15 ఏళ్ల కుర్రాడు అయినప్పటికీ కూడా నీకంటే వాడే బాగా ఆడుతున్నాడని వ్యాఖ్యానించారు. ముందు నీ ప్రదర్శన పై దృష్టి పెట్టు.. పక్కోడి గురించి అస్సలు ఆలోచించకని కౌంటర్ ఇచ్చారు. భారత్ చేతిలో పదే పదే పాకిస్తాన్ ఓడిపోతుంది… ఇలాంటి నేపథ్యంలో ఇలా చిల్లర వేషాలు వేస్తే మాత్రం, నీ కెరీర్ నాశనం అవుతుందని హెచ్చరించారు. ఈ త‌రుణంలోనే సైమ్ అయూబ్ చేసిన సెలబ్రేషన్స్ పై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ అయ్యాయి.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

 

 

Related News

ద‌మ్ముంటే నా బౌలింగ్ లో సిక్సులు కొట్టురా…అమీర్ జంగూతో సిరాజ్ గొడ‌వ‌

పాకిస్తాన్ క్రికెట్ లో అందరూ దద్దమ్మలే…PCB ఆఫ‌ర్ పై షోయ‌బ్ అక్త‌ర్ సంచ‌ల‌నం

6 సిక్సర్లు కొడతానని…బుమ్రా బౌలింగ్‌లో మూతి పళ్ళు రాలగొట్టుకున్న ఫర్హాన్

సింధు జలాలు ఇస్తాం కానీ, క్యాచ్‌లు వదిలేసేయ్…సైమ్ అయూబ్‌ను ఆడుకున్న ఫ్యాన్స్

ఫైనల్స్‌లో టీమిండియాకు ముచ్చెమటలు పట్టించిన 24 ఏళ్ల కుర్రాడు.. ఇంతకు ఎవరీ హసన్ నవాజ్ ?

ఏం కర్మ రా బాబు…టీమిండియా చేతిలో ప్రతీసారి ఓడిపోయి తలదించుకోవాల్సిందేనా ?

అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఊచకోత…పాకిస్తాన్ ఘోర ఓటమి, టీమిండియాకు గోల్డ్ మెడల్

Big Stories

Advertisement
×