Shoaib Akhtar On Pakistan Team: పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) ఊహించని షాక్ ఇచ్చారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇచ్చిన పదవి ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో అందరూ వెధవలే ఉన్నారని… ఆ జట్టుకు పని చేయలేదని తేల్చి చెప్పారు. ఒక్కడు కూడా మాట వినడని…. అలాంటి దుర్మార్గులకు కోచ్ గా పని చేయాలా? తనకు ఈ తలనొప్పి వద్దంటూ తేల్చి చెప్పారు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా సిరీస్ లు కోల్పోతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టును కాపాడేందుకు షోయబ్ అక్తర్ వద్దకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వచ్చింది. వెంటనే పాకిస్తాన్ కోచ్ గా బాధ్యతలు తీసుకోవాలని మొహ్సిన్ నఖ్వీ ఇంటికి వెళ్లి షోయబ్ అక్తర్ ను బతిలాడాడు. పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్, కోచ్, మెంటార్ ఇందులో నీకు నచ్చిన పదవి తీసుకో… కానీ పాకిస్తాన్ క్రికెట్ జట్టును కాపాడాలని షోయబ్ అక్తర్ ను వేడుకున్నారు. అయితే ఈ ఆఫర్ నేపథ్యంలో రెండు రోజుల పాటు ఆలోచించిన షోయబ్ అక్తర్.. రిజెక్ట్ చేస్తూ షాకింగ్ ప్రకటన చేశారు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లో ( Pakistan Cricket Board) కీలక పదవి రాబోతుందన్న వార్తలపై స్వయంగా షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో అందరూ దుర్మార్గులే ఉన్నారని బాంబు పేల్చారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొత్తం అవినీతి మయం అయిందని ఆరోపణలు చేశారు. అలాంటి బోర్డులో పనిచేయడం తనకు ఇష్టం లేదని వెల్లడించారు. గతంలో తన తల్లి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి పదవులు ఇచ్చిన తీసుకోవద్దని తన తల్లి వెల్లడించినట్లు స్పష్టం చేశారు షోయబ్ అక్తర్. తన తల్లి చెప్పిన మాటల ప్రకారం… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి వచ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ తరుణంలోనే PCB ఆఫర్ పై షోయబ్ అక్తర్ చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.