BigTV English

Caffeine-Dreams: ఏంటీ.. టీ, కాఫీలు మానేస్తే అలాంటి కలలు వస్తాయా? పరిశోధనల్లో ఏం తేలిందంటే?

Caffeine-Dreams:  ఏంటీ.. టీ, కాఫీలు మానేస్తే అలాంటి కలలు వస్తాయా? పరిశోధనల్లో ఏం తేలిందంటే?

Caffeine-Dreams:

కెఫిన్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా కాఫీ, టీలు వీలైనంత వరకు తగ్గించాలని సూచిస్తున్నారు. ప్రత్యక్ష రుజువు లేనప్పటికీ, కెఫిన్ అనేది నిద్రతో పాటు కలల మీద కూడా ఎఫెక్ట్ చూసినట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. కెఫిన్ తీసుకోవడం తగ్గించే వారిలో కలలు మరింత స్పష్టంగా, వివరంగా వస్తున్నట్లు భావిస్తున్నారు. ఆస్ట్రేలియాCQ యూనివర్సిటీకి చెందిన షార్లెట్ గుప్తా,  ఆస్ట్రేలియన్ కాథలిక్ విశ్వవిద్యాలయానికి చెందిన కారిస్సా గార్డినర్ ఈ విషయం గురించి కీలక అంశాలు వెల్లడించారు. కెఫిన్ తీసుకోవడం తగ్గించడం వల్ల స్పష్టమైన, కొన్నిసార్లు భయానక కలలు వస్తున్నట్లు చెప్పారు. కెఫిన్ తగ్గించిన కొద్ది రోజుల్లోనే ఈ అనుభవం ఎదురవుతున్నట్లు తేలిందన్నారు. ఇంతకీ ఈ వాదనలో నిజం ఎంత? సైన్స్ ఏం చెప్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


 కెఫిన్ నిద్రను ఎలా ప్రభావితం చేస్తుంది?

కెఫిన్ అనేది ఒక స్టిమ్యులెంట్. ఇది మనుషుల్ని నిద్ర నుంచి మేల్కొని ఉండేలా చేస్తుంది. మెదడులో అడెనోసిన్ అనే రసాయనాన్ని నిరోధించడం ద్వారా నిద్రను కంట్రోల్ చేస్తుంది. మనిషి మేల్కొని ఉన్నప్పుడు అడెనోసిన్ సాధారణంగా పగటిపూట మెదడులో పేరుకుపోతుంది. నిద్రపోతున్నప్పుడు అడెనోసిన్ నెమ్మదిగా మాయం అవుతుంది. కెఫిన్ ఉన్నప్పుడు, అడెనోసిన్ సిగ్నల్‌ ను అడ్డుకుంటుంది. సరిగా నిద్ర పట్టదు. కెఫిన్ తగ్గిపోయినప్పుడు, నిద్రపోవాలనే కోరిక మనుషులలో సాధారణంగా పెరుగుతుంది. కెఫిన్ ఎంత ఎక్కువగా తీసుకుంటే, నిద్ర అనేది అంత తక్కువగా పడుతుంది. కెఫిన్‌ను తగ్గించడం వల్ల నిద్ర చక్కగా పట్టి కలలు స్పష్టంగా వస్తాయంటున్నారు పరిశోధకులు.

తక్కువ కెఫిన్ తో స్పష్టమైన కలలు ఎలా?   

టీ, కాఫీలు తగ్గించడం వల్ల రాత్రులలో నిద్ర చక్కగా పడుతుంది. ఫలితంగా కలలు మరింత స్పష్టంగా, వివరంగా వస్తాయి. కెఫీన్ తీసుకోవడం వల్ల రాత్రిపూట నిద్ర మీద ఎఫెక్ట్ పడుతుంది. కెఫీన్ తగ్గడం వల్ల ఆటోమేటిక్ గా నిద్ర చక్కగా పడుతుంది. ఫలితంగా చక్కటి కలలు వస్తాయి.  శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు నిద్రలో ఒక దశలో మెదడు చాలా చురుకుగా ఉంటుంది. ఇది కలలతో సంబంధం ఉన్న నిద్ర దశ కూడా. ఈ సమయంలో మెదడు స్పష్టమైన కలలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో, తక్కువ కెఫీన్ తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత పెరిగి కలలు స్పష్టంగా కనేందుకు వీలవుతుంది.  కెఫీన్ మానేసిన తర్వాత ప్రతి ఒక్కరూ అకస్మాత్తుగా స్పష్టమైన కలలను చూడరు. ఈ ప్రభావం కొన్ని రోజులు లేదంటే వారాల తర్వాత కనిపిస్తుంది. కెఫిన్ తీసుకోవడం తగ్గించడం వల్ల స్పష్టమైన కలలు వస్తాయని చెప్పడానికి పెద్దగా ఆధారాలు లేవు. కానీ, దానికి సంబంధం ఉండవచ్చు. కెఫిన్ మన నిద్రను ప్రభావితం చేస్తుంది. నిద్ర మన కలలను ప్రభావితం చేస్తుందంటున్నారు పరిశోధకులు.


Read Also: కొట్టేయడం నా హాబీ.. చోరీ కేసులో మహిళ సర్పంచ్ అరెస్ట్, ఆమె చెప్పింది వింటే ఫ్యూజులు ఔట్!

Related News

Stone Baby: 82 ఏళ్ల బామ్మ కడుపులో స్టోన్ బేబీ.. వైద్య చరిత్రలో అరుదైన కేసు ఇది!

Kissing Bug: కిస్సింగ్ బగ్.. అమెరికాను వణికిస్తున్న ఈ కీటకం.. ఏం చేస్తుందో తెలుసా?

Brain Eating Amoeba: కేరళలో మెదడు తినేసే అమీబా.. 8 రోజుల్లో నలుగురు మృతి

Afternoon sleeping effects: మధ్యాహ్నం పూట తినగానే పడుకుంటే ఏం జరుగుతుంది?

Weight Loss: జిమ్‌కు వెళ్లలేదు, డైటింగ్ చెయ్యలేదు.. ఏకంగా 40 కిలోలు తగ్గాడు.. అదెలా?

×