Tips For Dandruff: చలికాలంలో చుండ్రు అనేది సాధారణ సమస్య. చాలా మంది ఈ సీజన్‌లో ఏదో ఒక రోజు చుండ్రు సమస్యను ఎదుర్కుంటూనే ఉంటారు. కొన్నిసార్లు చుండ్రు సమస్య తాత్కాలికం, కానీ కొంత మందికి చుండ్రు పెరగడం వల్ల జుట్టు రాలే సమస్య కూడా పెరుగుతుంది. అంతే కాకుండా చుండ్రు కారణంగా జుట్టు బలహీనంగా మారుతుంది. ఈ సమయంలోనే ఖరీదైన షాంపూలతో పాటు ఆయిల్స్ కూడా వాడుతుంటారు. కానీ వీటి వల్ల పెద్దగా ఫలితం ఉండదు. అంతే కాకుండా డబ్బు కూడా ఖర్చవుతుంది.
చుండ్రును తగ్గించుకోవడానికి కొన్ని రకాల హోం రెమెడీస్ ఉపయోగించాలి. వీటితో చుండ్రను ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే తగ్గించుకోవచ్చు.
చుండ్రు వదిలించుకోవడానికి మార్గాలు:
పెరుగు: పెరుగులో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ను తొలగించడంలో సహాయపడతాయి. పెరుగును మీ జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టుకు అవసరమైన పోషణ కూడా లభిస్తుంది.
నిమ్మరసం: నిమ్మరసం జుట్టు యొక్క pHని సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. నీళ్లలో నిమ్మరసం మిక్స్ చేసి జుట్టుకు పట్టించి 15-20 నిమిషాల తలస్నానం చేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా కూడా ఉంటుంది.
అలోవెరా: కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి చుండ్రుతో సంబంధం ఉన్న దురద మరియు ఎరుపును తగ్గిస్తాయి. అలోవెరా జెల్‌ని మీ జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేయండి.
బేకింగ్ సోడా: బేకింగ్ సోడా జుట్టు యొక్క ఆమ్లతను తగ్గిస్తుంది. అంతే కాకుండా చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ను నాశనం చేస్తుంది. షాంపూతో తలస్నానం చేసే ముందు, బేకింగ్ సోడాను మీ జుట్టుకు పట్టించి, ఆపై శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కొబ్బరి నూనె: కొబ్బరి నూనె జుట్టును తేమగా చేస్తుంది. అంతే కాకుండా చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనెను మీ జుట్టుకు అప్లై చేసి తేలికగా మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం వాష్ చేయండి.
కొన్ని ఇతర సూచనలు:
జుట్టును క్రమం తప్పకుండా వాష్ చేయండి: వారానికి కనీసం రెండుసార్లు తలస్నానం చేయడం వల్ల చుండ్రు పెరగకుండా ఉంటుంది. అంతే కాకుండా జుట్టు కూడా రాలదు.
సరైన షాంపూని ఉపయోగించండి: చుండ్రు కోసం తయారు చేసిన షాంపూని ఉపయోగించండి. ఇలా వాడటం వల్ల చుండ్రు సమస్యను వీలైనంత వరకు తగ్గించుకోవచ్చు.
Also Read: బట్టతలపై కూడా జుట్టు రావాలంటే.. వీటిని పక్కా వాడాల్సిందే !
నూనె రాయండి: వారానికోసారి జుట్టుకు నూనె రాసి తేలికగా మసాజ్ చేయండి.
ఒత్తిడిని తగ్గించుకోండి: యోగా, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.