Tips For Hair Fall: ప్రస్తుతం చాలా మంది బట్టతల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి బయట పడటానికి షాంపూలతో పాటు హెయిర్ ఆయిల్స్ కూడా వాడుతుంటారు. కానీ వీటికి బదులుగా కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు బాగా పెరుగుతుంది కూడా.
జుట్టు ఒత్తుగా , దట్టంగా ఉన్నప్పుడు చాలా అందంగా కనిపిస్తాము. కానీ సరైన ఆహారం, జీవనశైలి , హార్మోన్ల అసమతుల్యత కారణంగా జుట్టు పల్చబడటం ప్రారంభమవుతుంది. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలవుతుంది.జుట్టును మళ్లీ ఒత్తుగా, దట్టంగా మార్చడానికి కొన్ని హోం రెమెడీస్ ఉపయోగపడతాయి. మరి ఎలాంటి హోం రెమెడీస్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయనే విషయాను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతి గింజలు:
జుట్టు పల్చబడటం అనే సమస్యతో మీరు కూడా ఇబ్బంది పడుతుంటే.. మెంతి గింజలను ఉపయోగించండి. దీని కోసం మీరు కావలసినన్ని మెంతి గింజలను తీసుకుని నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించి అరగంట సేపు ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని రోజులు క్రమం తప్పకుండా చేస్తే దాని ప్రభావం మీకే కనిపిస్తుంది. మెంతి గింజల్లో ఉండే పోషకాలు జుట్టుకు పోషణను అందిస్తాయి.
గుడ్లు ఉపయోగించండి:
గుడ్లు జుట్టును మందంగా చేయడానికి ఉపయోగపడతాయి. మీ జుట్టు పెరుగుదలకు గుడ్లను ఉపయోగించడం ప్రారంభించండి. ఇందులో ఉండే ప్రొటీన్లు , పోషకాలు జుట్టు ఆకృతిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. దీని కోసం మీరు వారానికి రెండుసార్లు గుడ్డును 20 నిమిషాలు అప్లై చేయాలి. మీరు కొన్ని రోజుల్లోనే దీని ప్రభావాలను చూడటం ప్రారంభిస్తారు.
కలబందను జుట్టుకు అప్లై చేయండి:
కలబందను అప్లై చేయడం ద్వారా జుట్టు ఒత్తుగా తయారవుతుంది. దీని కోసం మీరు వేళ్ల సహాయంతో తలకు అలోవెరా జెల్‌ను అప్లై చేయాలి. సుమారు 30 నిమిషాల తర్వాత నీటితో వాష్ చేయాలి. మీరు ఈ పనిని వారానికి రెండుసార్లు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా జుట్టు రాలకుండా ఉంటుంది. అంతే కాకుండా జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది.
ఉసిరి, నిమ్మరసం:
మీరు ఉసిరి పౌడర్ తో పాటు, నిమ్మరసాన్ని పేస్ట్ రూపంలో తయారు చేసి మీ జుట్టుకు పట్టించాలి. ఇందులో ఉండే విటమిన్ సి వంటి అనేక పోషకాలు జుట్టుకు పోషణను అందిస్తాయి. ఆ పేస్ట్‌ని జుట్టుకు పట్టించి ఆరిపోయే వరకు కాసేపు అలాగే ఉంచి తర్వాత నీళ్లతో వాష్ చేయాలి.
Also Read: ఎంతటి తెల్లజుట్టు అయినా.. ఇలా చేస్తే క్షణాల్లోనే నల్లగా మారడం ఖాయం
కొబ్బరి నూనె, కరివేపాకు:
కొబ్బరి నూనెతో పాటు కరివేపాకుతో జుట్టు ఒత్తుగా తయారవుతుంది. ఇందుకోసం కొబ్బరినూనెలో కొన్ని కరివేపాకులను మిక్స్ చేసి వేడి చేయాలి. కరివేపాకు నల్లగా మారే వరకు ఉడికించి, చల్లారాక తలకు పట్టించాలి. కొబ్బరి , కరివేపాకుతో చేసిన నూనెను వారానికి 2 నుండి 3 సార్లు రాయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని పోషకాలు జుట్టు రాలకుండా చేస్తాయి. అంతే కాకుండా జుట్టు వేగంగా పెరిగేందుకు ఉపయోగపపడతాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.