Summer Tips: మే నెల ప్రారంభమైంది. రోజురోజుకూ వేడి ప్రభావం పెరుగుతోంది. ఈ సీజన్‌లో అతి కష్టమైన పని ఏమిటంటే.. మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం. అంతే కాకుండా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కలిగే జీర్ణ సంబంధిత సమస్యలను నివారించడం.
ఈ కాలంలో తీవ్రమైన ఎండ, చెమట కారణంగా కొంతమంది శరీరంలో నీరు, ఖనిజాలు లేకపోవడంతో బాధపడుతుంటారు. దీనివల్ల వారు డీహైడ్రేషన్, అలసట, తలనొప్పి, జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి పరిస్థితిలో కేవలం నీరు మాత్రమే తాగితే సరిపోదు. బదులుగా శరీరాన్ని లోపలి నుండి చల్లబరిచే చర్యలను కూడా తీసుకోవాలి. అంతే కాకుండా హైడ్రేషన్‌ను కాపాడుకునే ఆహారాన్ని మన డైల్‌లో చేర్చుకోవాలి.
మంచి విషయం ఏమిటంటే.. ప్రకృతి మనకు కొన్ని ప్రూట్స్ అందిస్తోంది. వీటిని మీరు వేసవి కాలంలో తినవచ్చు. ఫలితంగా డీహైడ్రేషన్ వంటి సమస్యల నుండి ఈజీగా బయటపడవచ్చు. వీటిని సూపర్ ఫుడ్స్ అని కూడా పిలుస్తారు. మరి డీహైడ్రేషన్ వంటి సమస్యల నుండి బయటపడటానికి మీరు మీ ఆహారంలో చేర్చుకోగల మూడు సూపర్‌ఫుడ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ:
దోసకాయ వేసవిలో ఒక గొప్ప సూపర్ ఫుడ్. ఇది దాదాపు 95% నీటిని కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది. మీరు మీ భోజనంతో పాటు దోసకాయను సలాడ్‌గా కూడా తినవచ్చు. దోసకాయ మీ జీర్ణవ్యవస్థకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాకుండా మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. సలాడ్‌గా కాకుండా.. మీరు దీనిని జ్యూస్ లాగా కూడా తయారు చేసి త్రాగవచ్చు. లేదా కాస్త ఉప్పు చల్లుకుని దోసకాయ ముక్కలను స్నాక్‌గా తినొచ్చు.
పుచ్చకాయ:
వేసవి కాలంలో దాదాపు అందరూ పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. పుచ్చకాయ రుచికరంగా ఉండటమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. పుచ్చకాయలో 90% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. ఇది పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లకు గొప్ప మూలం. పుచ్చకాయ శరీరాన్ని త్వరగా హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా దాని లోని చల్లటి గుణం కారణంగా వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీరు దీనిని నేరుగా కూడా తినవచ్చు లేదా జ్యూస్ లాగా తయారు చేసి తాగొచ్చు.
కొబ్బరి నీళ్లు:
సమ్మర్‌లో కూల్ డ్రింక్స్, సోడాకు బదులుగా కొబ్బరి నీళ్లు మంచి ఎంపిక. దీనిలో ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి. కొబ్బరి నీళ్లు తక్షణ శక్తిని ఇస్తాయి. అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా గ్యాస్ సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి.
Also Read: జుట్టు రాలుతోందా ? అయితే.. ఈ టిప్స్ మీకోసమే
ఈ మూడింటిలోనూ అధిక మొత్తంలో నీరు, అవసరమైన ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఈ సూపర్‌ఫుడ్‌లు వేసవిలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో.. నిర్జలీకరణాన్ని నివారించడంలో, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా శక్తి స్థాయిలను నిర్వహించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.