E-Paper
Advertisement

ఫ్రెండ్స్ వేలల్లో.. మనసు మాత్రం ఒంటరిగా!

ఫ్రెండ్స్ వేలల్లో.. మనసు మాత్రం ఒంటరిగా!
Advertisement

Real Friends: ఒకసారి మీ మొబైల్ తీసి కాంటాక్ట్స్ ఓపెన్ చేసి చూడండి.ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల్లో ఉంటాయి.ఇక సోషల్ మీడియాలో అయితే ఏకంగా వేలల్లో ఉంటారు.మరి నిజంగా వారందరితో మీరు మనసు విప్పి మాట్లాడగలరా..?పోనీ పట్టు మని పది మంది అయినా మీ మనసులోని బాధని పంచుకోగలరా…?దాదాపు లేదనే చెప్పాలి.అసలింతకీ మన గోడు వినే ఆ ఒక్క వ్యక్తి మనకెందుకు దొరకడం లేదు?

24 గంటలూ ఫోన్‌లోనే.. కానీ మనసుకు మాత్రం దూరం

చేతిలో 24 గంటలూ ఫోన్ ఉంటుంది.ఇక ఏ మాత్రం ఖాళీ దొరికినా రీల్స్ అన్ని,షార్ట్స్ అని, చాట్స్ అని ఇలా ప్రతి నిమిషం ఎవరితోనో ఒకరితో కనెక్ట్ అయినట్టే కనిపిస్తుంది.ఎవరైనా స్టేటస్ పెట్టారంటే ఆగ మేఘాల మీద చూసేయాలి.ఇక పుట్టిన రోజు వచ్చిందంటే చాలు ఫస్ట్ విషెస్ చెప్పేయాలి.ఇక లైకులు, షేరులు, సబ్ స్కైబ్ లకయితే అసలు కొదువే ఉండదు.కానీ ఆ వ్యక్తే నిజంగా బాగున్నాడా, ఆరోగ్యంగా ఉన్నాడా?అసలేం చేస్తున్నాడని ఫోన్ చేసి తెలుసుకోవడానికి మాత్రం సమయం దొరకదు.

కాంటాక్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్ కాదు

Advertisement

నిజానికి ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఫోన్ కాంటాక్ట్ లిస్టు లో ఉన్న ప్రతీ ఒక్కరు మన నిజమైన ఫ్రెండ్స్ అయిపోరు.వాళ్ళలో మనతో పాటు ఆఫీస్ లో పని చేసే కొలిగ్స్ ఉంటారు.ఇంకొందరు కలిసి చదువుకున్న క్లాస్ మేట్స్ ఉంటారు.మరి కొందరు ఎప్పుడో ఎక్కడో పరిచయమైన వ్యక్తులు ఉంటారు.

మొత్తంగా ఏదైనా ఎవరికైనా అవసరం వచ్చినపుడు వెంబడే కాల్ చేసే వాళ్ళు చాలా మందే ఉంటారు.కానీ ఎలాంటి అవసరం లేకుండా కేవలం బాగున్నావా, తిన్నావా, ఏం చేస్తున్నావ్ అని అడిగే వాళ్ళు ఎంత మంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి.

‘బాగున్నా’ అనే మాట వెనుక చాలా బాధ ఉండొచ్చు

Advertisement

సాధారణంగా ఎవరినైనా ఎలా ఉన్నావ్ అని అడిగితె బాగున్నా అనేవాళ్ళే ఎక్కువ.ఇప్పుడున్న యూత్ లో అధిక భాగం ఇలాంటి వారే.ఇక ఫేస్ బుక్, ఇంస్టా ఓపెన్ చేస్తే అసలు వారిలా ఇంకెవరూ లైఫ్ లీడ్ చేయరేమో అన్నట్టుగా వాళ్ళ పోస్టులు ఉంటాయి.కాని ఆ పోస్టు ల వెనుక ల ఎన్ని కష్టాలు ఉంటాయో వారికి మాత్రమే తెలిసి ఉంటుంది.ఆఫీస్ లో ప్రెజర్ కావచ్చు, జాబ్ ఎప్పుడు పోతుందో అన్న టెన్షన్ కావొచ్చు.లేక లవ్ బ్రేకప్ అయ్యిఉండవచ్చు.ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు.కానీ ఇవన్నీ ఎవరితో చెప్పాలి?

బాధ చెబితే వీక్ అయిపోతామా?

చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే లోన ఉన్న బాధ చెబితే ఏమైనా వీక్ అయిపోతానా అని భయపడిపోతారు.అందుకే ఎవరు ఎలా ఉన్నావ్ అని అడిగినా వెంటనే నాకేంటి నేను చాలా బాగున్నా అనే సమాధానమే వస్తుంది.

కమ్యూనికేషన్ పెరిగింది.. అర్థం చేసుకోవడం తగ్గింది

ఒకప్పుడు ఒకరి వద్ద నుండి విషయం మరొకరి వద్దకు చేరాలంటే రోజులు పట్టేది.కానీ ఇప్పుడు కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్ అయిపోయింది. కానీ ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకోవడం మాత్రం అంతే ఫాస్ట్‌గా జరగడం లేదు.

ఒకప్పుడు ఎవరికైనా సమస్య ఉంటే ఎదురుగా కూర్చుని మాట్లాడేవాళ్లు.ఇప్పుడు ‘ఏమైంది?’ అని ఒక మెసేజ్ పెడతాం. సమాధానం రాకపోతే ‘సరే.. మాట్లాడాలనుకున్నప్పుడు చెబుతాడు’ అని వదిలేస్తాం.కొన్నిసార్లు మనిషికి కావాల్సింది పరిష్కారం కాదు.. తన మాట వినే ఒక వ్యక్తి మాత్రమే.‘నీ సమస్య ఏంటో నాకు పూర్తిగా అర్థం కాకపోయినా.. నేను నీతో ఉన్నాను’ అనే ఒక్క మాట కూడా చాలా పెద్ద ఓదార్పు ని ఇస్తుంది.

సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ పెరుగుతున్నా.. నిజ జీవితంలో దూరం ఎందుకు?

దీనికి మరో కారణం సోషల్ మీడియా కల్చర్.అక్కడ మనకు నచ్చిన విషయాలనే ఎక్కువగా చూపిస్తాం.మన విజయాలు కనిపిస్తాయి..ఫెయిల్యూర్స్  కనిపించవు.అంతా హ్యాపీగానే ఉంటుంది.దీంతో మనకన్నా  ఎదుటివాళ్ళే పర్ఫెక్ట్ గా ఉన్నారనే ఫీలింగ్ వచ్చేస్తుంది.దాంతో వాళ్ళు నా కన్నా కెరీర్ లో ముందుకు వెళ్ళిపోతున్నారు ,నేను ఇంకా వెనకే ఉన్నానన్న ఫీలింగ్  మొదలవుతుంది.ఇదిగో ఈ పోలికే మనిషిని మెల్లిగా ఇతరుల నుండి మాత్రమే కాకుండా తన నుంచి కూడా దూరం చేస్తుంది.

అసలు స్నేహం ఎప్పుడు తెలుస్తుంది?

మన సక్సెస్ చూసి అభినందించేవాళ్లు చాలామంది ఉంటారు.కానీ మన ఫెయిల్యూర్ చూసి మనతో ఉండేవాళ్లు చాలా తక్కువ.మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు కాకుండా.. మన దగ్గర ఏమీ లేనప్పుడు ఫోన్ చేసే వ్యక్తి నిజమైన స్నేహితుడు.మన విజయాల గురించి మాత్రమే కాకుండా.. మన భయాల గురించి కూడా మాట్లాడగలిగే వ్యక్తి నిజమైన మనిషి.అందుకే జీవితంలో ‘ఎంతమంది తెలుసు?’ అనేది ముఖ్యం కాదు.‘ఎంతమందికి మనం నిజంగా తెలుసు?’ అనేదే ముఖ్యం.

also read :వానాకాలంలో పిల్లల లంచ్ బాక్స్‌కి బెస్ట్ ఫుడ్స్ ఇవే!

చివరికి కావాల్సింది 500 కాంటాక్ట్స్ కాదు..

మన ఫోన్‌లో 500 నంబర్లు ఉండొచ్చు. 5 వేల ఫాలోవర్లు ఉండొచ్చు.వేలల్లో లైక్స్ రావొచ్చు.కానీ ఒక అర్థ రాత్రి 12 గంటలకు మనసు బరువెక్కినప్పుడు.. ఎవరికైనా ఫోన్ చేసి మన మనసు విప్పి మాట్లాడగలిగే  ఒక మనిషి ఉంటే చాలు.ఎందుకంటే మనిషికి వందల్లో వేలల్లో కాదు, బాధ ని పంచుకునే ఒక మనిషి చాలు. సో నిజంగా మీ మనసు విప్పి మాట్లాడుకుని, ఉన్న సమస్యని చెప్పుకోగలిగే ఒక్క ఫ్రెండ్ ని సంపాదించుకునే ప్రయత్నం చేయండి.

Tags

Related News

సూపర్ ఫ్రెండ్.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరితో త్వరగా స్నేహం చేస్తారు

మీ మాజీ లవర్ వద్దకు మళ్లీ వెళ్లాలనుకుంటున్నారా? ముందుగా ఈ 8 విషయాలు ఆలోచించండి

చాణక్య నీతి.. పిల్లలు చేసే ఈ తప్పులను తల్లిదండ్రులు అసలు నిర్లక్ష్యం చేయకూడదు

సైనా నెహ్వాల్‌కు ఆర్థరైటిస్.. క్రీడాకారులందరికీ ఈ వ్యాధి ప్రమాదం ఉందా?

ఆన్‌లైన్‌లో ఫ్రీగా చదువుకోవచ్చు.. మరి స్కూల్, కాలేజీ ఫీజులు ఎందుకు పెరుగుతున్నాయి?

పెళ్లయ్యాక డబ్బు విషయంలో గొడవలు రాకుండా ఉండాలంటే…

విషపూరిత పూలతో పవర్‌ఫుల్ ఔషధాలు తయారీ.. మలేరియా, క్యాన్సర్‌కు చికిత్స

Big Stories

Advertisement
×