E-Paper
Advertisement

వానాకాలంలో పిల్లల లంచ్ బాక్స్‌కి బెస్ట్ ఫుడ్స్ ఇవే!

వానాకాలంలో పిల్లల లంచ్ బాక్స్‌కి బెస్ట్ ఫుడ్స్ ఇవే!
Advertisement

Rainy Season Lunch Box Ideas:అసలే వానకాలం.. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బయట వాతావరణం చల్లగా ఉంటుంది.సో ఈ సీజన్లో పెట్టే భోజనం త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.మరియు పిల్లలు పెట్టిన భోజనం నచ్చక బయట చిరుతిళ్లకి అలవాటు అయిపోతారు .కాబట్టి పిల్లలకి ఈ వాన కాలంలో లంచ్ బాక్స్ లో మంచి పోషకాలు ఉండటంతో పాటు ఎక్కువసేపు ఫ్రెష్ గా ఉండే ఆహారం పెట్టడం చాలా ముఖ్యం .

ముఖ్యంగా పిల్లలు ప్రతిరోజు ఒకే రకమైన లంచ్ పెడితే వారికి బోర్ కొట్టేస్తుంది.ప్రతిరోజు రోజుకొక ఫుడ్ ఐటం మారిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వాన కాలంలో పెట్టడానికి అనువుగా ఉండే ఆ ఫుడ్ ఏంటో ఆ రెసిపీలు ఏంటో ఒకసారి చూద్దాం.

 వెజిటేబుల్ దోశ

Advertisement

మామూలుగా చిన్న పిల్లలు కూరగాయలు తినాలంటే బాగా మారం చేస్తారు .సో వాళ్ళకి తెలియకుండా కొన్ని కూరగాయలని ఆ దోశలోనే మిక్స్ చేసి వాళ్ళకి తినిపిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు.

కూరగాయల్లో, క్యారెట్ ,ఉల్లిపాయ ,క్యాప్సికం కొత్తిమీర వంటి వాటిని తీసుకొని సన్నగా తరిగి ఆ దోశ పిండిలో కలిపి దోశలా పోసుకోవచ్చు అయితే ఈ దోశలన్నీ టిఫిన్ బాక్సుల్లో పెట్టేటప్పుడు వేడి చల్లార్చి పెడితే ఉంటుంది.

వెజిటేబుల్ పలావ్

Advertisement

అన్నం ఇష్టంగా తినే పిల్లలకి వెజిటేబుల్ ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పాలి.ఇందులో బియ్యంతో పాటు క్యారెట్, బీన్స్, బఠానీలు, కూరగాయలు అన్నీ కలిపి చేసే వెజిటబుల్ పలావ్ రుచికి రుచి, పోషకాలకి పోషకాలు పిల్లలకి అందుతాయి .

అయితే ఈ వర్షాకాలంలో ఎక్కువ నూనె, మసాలాలు వాడకుండా చేసుకుంటే బాగుంటుంది.

 వెజిటబుల్ శాండ్విచ్

చిన్నపిల్లలకు టిఫిన్ ,దోస లాంటివి రెగ్యులర్ ఐటమ్స్ తిని తిని బోర్ కొట్టి కొత్త ఫుడ్ ని కోరుకుంటారు.అలాంటి సమయంలో ఇలా బ్రెడ్ తో శాండ్విచ్ చేస్తే ఖచ్చితంగా తింటారు అదే రెగ్యులర్గా వాడే మయోనైజ్, సాస్ లు కాకుండా కూరగాయలు ,పనీర్ లేదా బాయిల్డ్ ఎగ్ వంటి పదార్థాలను వాడి చేస్తే ఈ వెజ్ శాండ్విచ్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

 ఉడికించిన శనగలు

ఉడికించిన శనగలు కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అయితే వాటికి కాస్త నిమ్మరసం, కొత్తిమీర ,కొంచెం మసాలా కలిపి ఇచ్చామంటే కొంచెం కూడా వదలకుండా బాక్స్ మొత్తం ఖాళీ చేయడం పక్కా.అయితే పిల్లల వయసును బట్టి ఈ ఆహారం క్వాంటిటీ గట్టిదనం ఉండేలా చూసుకోవాలి .

 పెసరపప్పు చిల్లా

పెసరపప్పుని మెత్తగా నానబెట్టి రుబ్బి అందులో ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర వంటి వాటిని కలిపి చిల్లాల చేసుకోవచ్చు.పిల్లలు తినడానికి సులభంగా చాలా ఈజీగా చిన్న సైజులో ఈ పెసరపప్పుచిల్లా చేస్తే పిల్లలు ఇష్టంగా తినేస్తారు .

 చపాతీ వెజిటేబుల్ రోల్

పిల్లలు అప్పుడప్పుడు చపాతీలని తినకుండా మారాం చేస్తుంటారు. అలాంటి సమయంలో చపాతీలు, క్యారెట్, క్యాప్సికం, బీన్స్ వంటి కూరగాయలని,అలాగే పన్నీర్ లేదా ఉడికించిన గుడ్డు వంటి వాటిని చపాతీలో దట్టించి రోల్ చేసి పిల్లలకు ఇస్తే ఇష్టంగా తినేస్తారు.

ఇది లంచ్ బాక్స్ లో పెట్టడానికి ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పాలి .

 ఇడ్లీ కూడా బెస్ట్ ఆప్షన్

ఇక చిన్నపిల్లలకి టిఫిన్స్ లో ఒక బెస్ట్ ఆప్షన్ ఏదంటే ఇడ్లీయే గుర్తుకొస్తుంది.ఎందుకంటే వేడి వేడి ఇడ్లీలను పిల్లలు చాలా ఈజీగా మరియు ఇష్టంగా తినేస్తారు.

అయితే రెగ్యులర్గా పల్లీల చట్నీ కాకుండా కాస్త కూరగాయలు కలిపి చట్నీ చేస్తే, టేస్ట్ కి టేస్ట్, పోషకాలకు పోషకాలు లభిస్తాయి.

 ఫ్రూట్స్ కూడా ఇస్తే మంచిదే

ఇక వీటితో పాటు నీతో పాటు ప్రూట్స్ కూడా పిల్లలకి అందిస్తే మంచి ఎనర్జీ వస్తుంది .ముందుగా వాటిని శుభ్రంగా కడిగి కట్ చేసి బాక్స్ లో పెడితే పిల్లలు ఇష్టంగా తినేస్తారు.ప్రతిరోజు కాకపోయినా వారంలో రెండు మూడు సార్లు ఇచ్చినా బాగుంటుంది.

 డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్.. ఎప్పుడూ ఇడ్లీ చపాతి, దోషనే కాకుండా అప్పుడప్పుడు బాదం,ఎండు ద్రాక్ష,జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ అందిస్తే పిల్లలకి మంచి ఎనర్జీ లభించి ఆరోజు ఎంతో ఉత్సాహంగా ఉంటారు.అయితే చిన్న పిల్లలకి రకరకాల డ్రై ప్రూట్స్ ఇవ్వడం కాకుండా వాళ్లకు సరిపడేవి ఇస్తే మంచిది.

పిల్లలకు వాటర్ కూడా చాలా ముఖ్యం

ఇక అన్నిటికన్నా మించి ప్రతిరోజు పిల్లలు వాటర్ తాగడం చాలా ముఖ్యం .కాబట్టి ఒక మంచి వాటర్ బాటిల్ ని పిల్లలకి అందించాలి.

టిఫిన్ బాక్స్‌ను కూడా శుభ్రంగా ఉంచాలి

సో ఇలా వర్షాకాలంలో ఇంట్లో వండుకునేలా ఉన్న ఈ రెసిపీలని ట్రై చేస్తే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు.అయితే అన్నిటికన్నా మించి ఫుడ్ మాత్రమే కాదు ఫుడ్ పెట్టె టిఫిన్ బాక్స్ కూడా చాలా ముఖ్యం.దాన్ని ప్రతి రోజు వేడి నీళ్లతో సబ్బుతో కడిగితే చాలా మంచిది. ఆరబెట్టాక బాక్స్ లో ఆర పెట్టాలి అలా కాకుండా తడిగా ఉన్నప్పుడు ఫుడ్ పెడితే పాడయ్యె అవకాశం ఎక్కువ.

also read :వర్షం పడుతుంటే ఏదైనా వేడిగా తినాలనిపిస్తుందా?.. ఈ స్నాక్స్ ట్రై చేయండి!

మరి ఈ వర్షాకాలంలో ఈ రెసిపీలని ని మీ పిల్లల కోసం ఒకసారి ట్రై చేస్తారు కదూ !

Tags

Related News

‘మమ్మీ స్విగ్గీలో పిజ్జా ఆర్డర్ చేయవా..’ 10 మినిట్ ఫుడ్ డెలివరీతో పిల్లల్లో చెడు అలవాట్లు

తరచూ పనీర్ తింటున్నారా? అయితే ‘అనలాగ్ పనీర్’ గురించి తప్పక తెలుసుకోండి!

క్యాన్సర్ రీలాప్స్ అంటే ఏమిటి? చికిత్స తర్వాత మళ్లీ క్యాన్సర్ రావడానికి అసలు కారణాలివే!

పీరియడ్స్ సమయంలో తలనొప్పి, వాంతులు, వెలుతురు పడకపోవడం? కారణం ఇదే..

బరువు తగ్గాలంటే పస్తులు ఉండాలా? Eating Less వెనుక ఉన్న పెద్ద డేంజర్ ఇదే!

తేనెటీగ లేదా కందిరీగలు గుంపు దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలి? ఈ జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి

ఆఫీస్ లేదా కాలేజీలో పీరియడ్స్ మరకలు అంటుకుంటే ఏం చేయాలి? మీ బ్యాగులొ ఈ కిట్ ఉంటే సమస్యకు చెక్

రాత్రి పడుకునే ముందు ఫోన్‌లో ఈ ఒక్కటి ఆన్ చేయండి.. పొద్దున్నే చాలా ఫ్రెష్‌గా లేస్తారు!

Big Stories

Advertisement
×