BigTV English

pollution winter : వింటర్ డేంజర్.. చెక్ పెట్టేద్దాం!

pollution winter : వింటర్ డేంజర్.. చెక్ పెట్టేద్దాం!

pollution winter : వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని పీల్చి పిప్పిచేస్తోంది. కాస్త ఎక్కువో.. తక్కువో.. మొత్తం మీద అన్ని దేశాలను పీడిస్తున్న సమస్య ఇది. ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించడంతో స్కూళ్లను కూడా మూసేశారు. ముంబైలోనూ కాలుష్యం బెడద పెరిగింది. వచ్చే వారం దీపావళి పండుగ రానుంది. బాణసంచా కాల్చడంతో కాలుష్యం మరింత పెరగనుంది.


పైపెచ్చు ఇది శీతాకాలం. వింటర్‌లో వాయు కాలుష్యం ఎక్కువగానే ఉంటుంది. ఈ సీజన్‌లోనే అన్ని నగరాలు, పట్టణాల్లో పొల్యూషన్ స్థాయులు పెరుగుతాయి. ఏడాది పొడవునా కాలుష్యం పీడించినా.. వింటర్‌కొచ్చే సరికి ఆ మోతాదు మరింత పెరుగుతుంది.

ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరగడంతో.. అందరూ హీటింగ్ సిస్టమ్స్‌ను వినియోగిస్తారు. ఆయిల్, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడి ఈ పరికరాలు పనిచేస్తాయి. ఒక్కసారిగా హీటర్ల వాడకంతో ఫ్యూయల్స్ వినియోగం పెరుగుతుంది. ఈ ఇంధనాలను మండించడం వల్ల నైట్రోజెన్ ఆక్సైడ్స్, సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి కాలుష్యకారకాలు వాతావరణంలోకి అధిక మోతాదులో చేరతాయి. ఫలితంగా గాలిలో నాణ్యత పడిపోతుంది.


పరిశ్రమలు, వాహనాల వల్ల కూడా ఈ కాలుష్యకారకాలు అధిక మొత్తాల్లో విడుదల అవుతాయి. చలి తీవ్రత పరోక్షంగా కాలుష్యాన్ని పెంచుతుంది. దీనికి శాస్త్రీయ కారణాలున్నాయి. వాతావరణంలోని దిగువ పొర వేసవికాలంలో వేడిగానూ, తేలికగానూ ఉంటుంది. వేడెక్కిన ఆ పొర తేలికగా ఉండటంతో గాలిలో ఊర్థ్వముఖంగా అతి త్వరగా కదులుతుంటుంది. దాంతో పాటే కాలుష్య కారకాలు భూమి నుంచి వేగంగా ఎగువకు వెళ్లిపోతుంటాయి.

శీతాకాలంలో భూమికి సమీపంగా ఉన్న గాలి బరువుగా, చల్లగా ఉంటుంది. వేడి, కాలుష్యకారకాలు అందులో చిక్కుకుపోయి.. ఓ మూతలాగా ఏర్పడుతుంది. అంటే ఆ గాలిపొరకు దిగువనే వేడి, కాలుష్యం పేరుకుపోతుండటంతో గాలిలో నాణ్యత క్షీణిస్తుంటుంది. దీనినే శాస్త్రీయ పరిభాషలో ఇన్‌వర్షన్ అని అంటారు. ఆ వాయు కాలుష్యం అంతా తిరిగి భూమికే చేరుతుంది.

ఇన్‌వర్షన్ ప్రక్రియ ప్రభావం రాత్రివేళల్లో అధికంగా ఉంటుంది. అందుకే రాత్రి సమయాల్లో గాలి నాణ్యత బాగా క్షీణిస్తుంది. ఈ వాయుకాలుష్యం మన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. ప్రధానంగా శ్వాసకోశవ్యవస్థ ఎక్కువగా ప్రభావితమవుతుంది. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.

ఎప్పటికప్పుడు గాలి నాణ్యత గురించి తెలుసుకుంటూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గాలి నాణ్యత వివరాలను రియల్‌టైమ్‌‌లో అందించే యాప్‌లు, వెబ్‌సైట్లకు కొదవ లేదు. వాటి ద్వారా వాతావరణం, వాయుకాలుష్యం గురించి అప్‌డేట్లను ఫాలో అవుతుండాలి. వాటికి అనుగుణంగా బయటి పనులను ప్లాన్ చేసుకోవాలి. కాలుష్యం బెడద ఎక్కువగా ఉండే ఇలాంటి సమయాల్లో ఇది మరీ ముఖ్యం.

Related News

Anjeer: వీళ్లు.. అంజీర్‌లను అస్సలు తినకూడదు తెలుసా ?

Dasara festival 2025: నవరాత్రి పండుగకు స్పెషల్ వంటలు.. ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ప్రత్యేక రెసిపీలు

Heart Attack: వ్యాయామం చేసేటప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా ? హార్ట్ ఎటాక్ కావొచ్చు !

Healthy Hair Tips: ఆరోగ్యమైన జుట్టు కోసం సహజ చిట్కా.. వారంలో రెండు సార్లు చాలు

Glowing Skin Tips: కెమికల్స్ లేకుండా ఇంట్లోనే గ్లోయింగ్ స్కిన్.. ఇలా చేస్తే చందమామలా మెరిసే చర్మం

Yoga For Brain Health: ఈ యోగాసనాలతో.. బ్రెయిన్ డబుల్ షార్ప్ అవుతుందట !

Air Fryer: ఎయిర్ ఫ్రైయర్ వంటలు ఆరోగ్యానికి ఇంత మంచివా? అస్సలు ఊహించి ఉండరు!

Alcohol: విస్కీ, వైన్, బీర్, కల్లు.. వీటిలో ఏది ఎక్కువ డేంజర్!

Big Stories

×