E-Paper
Advertisement

నోట్లో వేస్తే కరిగిపోయే ఆలూ మలై టిక్కీ..తయారీ విధానం ఇదే!

నోట్లో వేస్తే కరిగిపోయే ఆలూ మలై టిక్కీ..తయారీ విధానం ఇదే!
Advertisement

Aloo malai tikki recipe: సాయంత్రం అయిందంటే చాలు ఏదో ఒక టేస్టీ స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా! బయట స్ట్రీట్ ఫుడ్ తిని బోర్ కొట్టిందా? అయితే.. ఈ సారి ఇంటోనే అద్భుతమైన రెస్టారెంట్ స్టైల్ ‘ఆలూ మలై టిక్కీ’ ట్రై చేయండి. పైకి కరకరలాడుతూ.. లోపల క్రీమీగా వెన్నలా కరిగి పోయే ఈ టేస్టీ స్నాక్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఫిదా చేయడం గ్యారంటీ. దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం.. దీని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండీ!

సాధారణంగా బంగాళదుంపలతో చేసే స్నాక్స్ అందరికీ ఇష్టమే. కానీ.. ఎప్పుడూ చేసే బోరింగ్ ఆలూ చాట్ లేదా ఆలూ బోండా కాకుండా కొంచెం వెరైటీగా, ట్రెండీగా ట్రై చేయాలని చూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ ‘ఆలూ మలై టిక్కీ’ రెసిపీ! రెస్టారెంట్ల లో దొరికే ఈ రిచ్ అండ్ క్రీమీ స్నాక్‌ను మన ఇంట్లోనే .. ఎంతో హైజీనిక్‌గా తయారు చేసుకోవచ్చు. అదెలాగో స్టెప్ బై స్టెప్..

కావలసిన పదార్థాలు:

Advertisement

బంగాళదుంపలు- పావు కిలో

ఫ్రెష్ మీగడ లేదా మలై- 2 టేబుల్ స్పూన్లు

Advertisement

పన్నీర్ తురుము- 50 గ్రాములు

పచ్చిమిర్చి,అల్లం తరుగు- ఒక్కో టీ స్పూన్

జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా- అన్నీ ఒక్కో టీ స్పూన్

కార్న్ ఫ్లోర్ లేదా మైదా- బైండింగ్ కోసం

నూనె లేదా నెయ్యి -కాల్చడానికి సరిపడా

ఉప్పు, కొత్తిమీర- తగినంత

తయారీ విధానం:

1.ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. బంగాళదుంపలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత పొట్టు తీసి ఒక వెడల్పు గిన్నెలోకి తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వాటిని ఎలాంటి గడ్డలు లేకుండా మెత్తగా మాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల టక్కీలు విడిపోకుండా స్మూత్‌గా వస్తాయి.

2. ఇప్పుడు మాష్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమంలో తురిమిన పన్నీర్, ఫ్రెష్ మలై (మీగడ) వేయాలి. ఈ రెండే ఈ రెసిపీకి మెయిన్ హైలైట్! మలై వేయడం వల్ల టిక్కీ లోపలి భాగం చాలా క్రీమీగా వస్తుంది. దీనికి సన్నగా తరిగిన పచ్చి మిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర యాడ్ చేయాలి.

3. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా, చిటికెడు చాట్ మసాలా వేసి బాగా కలపాలి. మిశ్రమం పల్చగా కాకుండా.. గట్టిగా ఉండటం కోసం 2-3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ లేదా బియ్యం పిండిని కలపాలి. పిండి బాగా కలిసేలా చూసుకుని, చేతికి కొద్దిగా నూనె రాసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ ఉండలను కొద్దిగా ప్రెస్ చేసి రౌండ్ లేదా ఓవల్ షేప్‌లో టిక్కీలుగా తయారు చేసుకోవాలి.

Also Read: హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ మసాలా వడ..ఈవెనింగ్ స్నాక్స్‌కి పర్ఫెక్ట్!

4. ఇప్పుడు స్టవ్ మీద నాన్‌ స్టిక్ పాన్ పెట్టి రెండు స్పూన్ల నెయ్యి లేదా నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న ఆలూ మలై టిక్కీలను పాన్‌లో అమర్చాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ..ఉంచి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా కాల్చుకోవాలి. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, షాలో ఫ్రై చేస్తే సరి పోతుంది. నెయ్యిలో కాల్చడం వల్ల వచ్చే వాసన ఇళ్లు మొత్తం గుమ గుమలాడిపోతుంది.

5. అంతే! వేడి వేడిగా కరకరలాడే ఆలూ మలై టిక్కీలు రెడీ అయిపోయినట్లే! వీటిని పుదీనా చట్నీ, టమాటో కెచప్ లేదా చింత పండు చట్నీతో.. సర్వ్ చేస్తే తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది. పైన కొద్దిగా.. చాట్ మసాలా, నిమ్మరసం పిండుకుని తింటే.. ఆ మజాయే వేరు.

మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వీకెండ్ మీ ఇంటికి వచ్చే గెస్ట్‌లు లేదా మీ పిల్లలకు ఈ ట్రెండీ ఆలూ మలై టేస్టీ స్నాక్ చేసి పెట్టి వాళ్ల నుంచి సూపర్ అనిపించుకోండి!

Related News

పర్ఫెక్ట్ కొలతలతో..తియ్యని చక్కెర పొంగలి క్షణాల్లోనే రెడీ చేయండిలా!

తోటకూర వెల్లుల్లి కారం ఇలా చేస్తే..లొట్టలేసుకుంటూ తింటారు!

మీ ఇంటి పెరట్లో ఈ మొక్కలు ఉన్నాయా? అయితే, పాములు, దోమలతో నో టెన్షన్!

స్కూల్‌ వెళ్లడానికి మీ పిల్లాడు భయపడుతున్నాడా? పిల్లలు బుల్లీయింగ్‌‌కు గురవుతున్నట్లు తెలిపే సంకేతాలు ఇవే

చాణక్య నీతి.. మీ జీవితం ఇతరుల చేతిలో కీలుబొమ్మగా మారిందా? ఈ తప్పుడు అలవాట్లే కారణం

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పార్సల్ బాక్స్‌లు పడేయకండి.. ఈ 3 విషయాలు తప్పకుండా చెక్ చేయాలి

కుటుంబ విలువలు, సంప్రదాయాల గురించి పిల్లలకు ఇలా నేర్పండి..

Big Stories

Advertisement
×