Action Thriller OTT : ఓ అపార్ట్మెంట్ బిల్డింగ్ లోకి పోలీసులు వెళ్లారు. కానీ అక్కడ ఒక్క సాధారణ మనిషి కూడా లేడు. మొత్తం క్రిమినల్స్, గ్యాంగ్‌స్టర్లు, కిల్లర్లే. వాళ్లను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులే అక్కడ చిక్కుకుపోతే పరిస్థితి ఎలా ఉంటుంది ? పైకి వెళ్లే ప్రతి ఫ్లోర్‌లో కొత్త శత్రువు… బయటకు రావడానికి దారి లేదు. సాయం చేసే వాళ్లు లేరు. ఇలా మొదటి నుంచి చివరి వరకు ఊపిరి తీసుకోనివ్వని యాక్షన్ తో వచ్చిన ఇండోనేషియన్ మూవీ ‘The Raid Redemption’. మరి ఆ బిల్డింగ్‌లో ఏం జరుగుతుందో కథలో చూద్దాం.
జకార్తాలోని ఓ అపార్ట్మెంట్ బిల్డింగ్ ను క్రిమినల్ గ్యాంగ్ తమ అడ్డాగా మార్చుకుంటుంది. ఆ బిల్డింగ్ లోని ప్రతి ఫ్లోర్ లో ప్రమాదకరమైన నేరస్తులే ఉంటారు. వీళ్లందరికీ పై అంతస్తులో ఉండే క్రైమ్ లార్డ్ తమా నాయకుడు. ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి ఓ ఎలైట్ SWAT టీమ్ ఆపరేషన్ మొదలు పెడుతుంది. ఆ టీమ్ లో రామా కూడా ఉంటాడు. పోలీసులు ప్లాన్ ప్రకారం బిల్డింగ్ లోకి ఎంటర్ అవుతారు. మొదట మిషన్ సక్సెస్ అవుతుందనే అనిపిస్తుంది.
కానీ క్రిమినల్స్ కు పోలీసుల రాక తెలిసిపోవడంతో సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. బిల్డింగ్ లో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా పోలీసులపై తిరగబడతారు. బయటకు వెళ్లే దారి మూసుకుపోతుంది. పైకి వెళ్తే క్రిమినల్స్… కిందకు వస్తే మరో ప్రమాదం. ఇక రామా, అతడి టీమ్ కు ఒకటే టార్గెట్. ఎలాగైనా ప్రాణాలతో బయటపడాలి. అదే సమయంలో అసలు ఆపరేషన్ ను కూడా పూర్తి చేయాలి.
ఈ సినిమాలో కథను మలుపు తిప్పే పెద్ద ట్విస్టుల కంటే… ఆ బిల్డింగ్ లో ప్రతి నిమిషం ఎదురయ్యే ప్రమాదమే హైలైట్. ఒక్క ఫైట్ అయిందంటే వెంటనే ఇంకో ఫైట్. పైగా యాక్షన్ చాలా రియలిస్టిక్ గా ఉండటంతో చూస్తున్నప్పుడు మనం కూడా ఆ బిల్డింగ్ లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇంతకీ ఆ క్రిమినల్స్ పోలీసులను ఏం చేశారు ? పోలీసులు అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడ్డారా లేదా ? క్లైమాక్స్ లో కథ ఎలాంటి మలుపు తిరిగింది ? అన్నది తెలియాలంటే ఈ యాక్షన్ థ్రిల్లర్ ను డోంట్ మిస్.
‘ది రైడ్ రిడెంప్షన్’కు Gareth Evans దర్శకత్వం వహించారు. Iko Uwais రామాగా, Joe Taslim జాకాగా, Donny Alamsyah అండీగా, Yayan Ruhian మ్యాడ్ డాగ్‌గా నటించారు. ఈ సినిమా 2011లో విడుదలైంది. రస్తుతం Lionsgate Playలో తెలుగు డబ్బింగ్ తో అందుబాటులో ఉంది. అంటే ఈ అదిరిపోయే యాక్షన్ డ్రామాను ఓటీటీ మూవీ లవర్స్ తెలుగులోనే చూసి ఎంజాయ్ చేయవచ్చు. కాబట్టి యాక్షన్ ప్రియులు డోంట్ మిస్.