E-Paper
Advertisement

ప్రెజర్ కుక్కర్లలో ఏది ఎక్కువ కాలం మన్నుతుంది? కొనే ముందు ఈ క్లారిటీ తెచ్చుకోండి!

ప్రెజర్ కుక్కర్లలో ఏది ఎక్కువ కాలం మన్నుతుంది? కొనే ముందు ఈ క్లారిటీ తెచ్చుకోండి!
Advertisement

Aluminium Vs Steel Cooker: వంట త్వరగా అవ్వాలనో.. గ్యాస్ ఆదా చేయాలనో.. ఇలా అనేక కారణాలతో చాలామంది ఇళ్లల్లో ప్రెజర్ కుక్కర్లు వాడుతుంటారు. ఎందుకంటే.. పప్పు వండాలన్నా, అన్నం చేయాలన్నా కిచెన్‌లో రోజూ ఎక్కువగా వాడే వస్తువు ఇదే. అయితే కొత్త కుక్కర్ కొనాలనుకున్నప్పుడు అల్యూమినియం మంచిదా, స్టెయిన్‌లెస్ స్టీల్ మంచిదా అనే గందరగోళం చాలామందిలో వస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఆరోగ్యానికి, భద్రతకు ఏది బెస్ట్ ఆప్షనో ఇక్కడ చూద్దాం.

అల్యూమినియం కుక్కర్ ప్రత్యేకతలు:

సాధారణంగా భారతీయులు వంటల కోసం అల్యూమినియం కుక్కర్లను ఎక్కువగా వాడుతుంటారు. దీనికి ప్రధాన కారణం ఇవి బరువు తక్కువగా ఉండటమే కాదు.. ధర కూడా చాలా అందుబాటులో ఉండటం. అలాగే అల్యూమినియం వేడిని త్వరగా గ్రహిస్తుంది కాబట్టి.. దీనిలో వంట చాలా వేగంగా అవుతుంది. బడ్జెట్ తక్కువగా ఉన్నవారికి లేదా అప్పుడప్పుడు వంట చేసేవారికి ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

అల్యూమినియంలో వచ్చే ఇబ్బందులు:

Advertisement

అల్యూమినియం కుక్కర్లతో సమస్య ఏమిటంటే.. రోజువారీ వాడకం వల్ల ఇవి త్వరగా పాడవుతాయి. కొన్నేళ్ల తర్వాత వీటిపై గీతలు పడటం, రంగు మారడం, మెరుపు తగ్గడం లాంటివి జరుగుతాయి. ఇవి చూడటానికి త్వరగా పాతబడిపోయినట్లు కనిపిస్తాయి.

Also Read: హోటల్ రూమ్స్‌లో ‘గ్లాస్ బాత్‌రూమ్స్’ ఎందుకు ఉంటాయో తెలుసా? ప్రైవసీ కంటే ఆ రీజనే ముఖ్యమా?

స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్ ప్రయోజనాలివే:

Advertisement

ప్రస్తుతం స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్లనే ప్రజలు ఎక్కువగా కొంటున్నారు. ఇవి చాలా గట్టిగా, బలంగా ఉండి ఎక్కువ కాలం మన్నుతాయి. ఎంత వాడినా వీటికి తుప్పు పట్టడం, గీతలు పడటం లాంటివి జరగవు. పైగా ఇవి చూసేందుకు కూడా చాలా ప్రీమియం లుక్‌తో మెరుస్తూ ఉంటాయి. శుభ్రం చేయడం కూడా చాలా సులువు.

భద్రతలో ఏది బెస్ట్ అంటే?

కుక్కర్ వాడేటప్పుడు సేఫ్టీ అనేది అందరికీ ముఖ్యమైన విషయం. నాణ్యమైన బ్రాండ్స్ తయారుచేసే రెండు రకాల కుక్కర్లూ సురక్షితమే అయినప్పటికీ.. దీర్ఘకాలికంగా చూస్తే స్టెయిన్‌లెస్ స్టీల్ మరింత నమ్మకమైనది. ఇది ఎలాంటి రసాయన చర్యలకు లోనుకాదు. కాబట్టి రోజూ వండే కుటుంబాలకు ఇది చాలా సేఫ్ ఆప్షన్.

మొత్తానికి ఏది కొనాలంటే?

తక్కువ బడ్జెట్‌లో తేలికైన కుక్కర్ కోసం చూస్తుంటే అల్యూమినియం ఎంచుకోవచ్చు. కానీ ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలా ఏళ్లపాటు ఎలాంటి గొడవ లేకుండా, సురక్షితంగా పని చేయాలనుకుంటే మాత్రం స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్ కొనుగోలు చేయడమే తెలివైన నిర్ణయం. అందుకే ఇప్పుడు చాలామంది తమ వంటగదిలో స్టీల్ కుక్కర్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.

Also Read: iQOO సీక్రెట్ లీక్.. భారత్ కోసం ప్రత్యేక ప్లాన్.. వేరే దేశాల్లో లేని ఫీచర్లతో Z11 లాంచ్!

Related News

హెల్దీ రిలేషన్‌షిప్ అంటే ఇదే.. మీ ప్రేమ, పెళ్లి బంధంలో ఈ 7 లక్షణాలు ఉన్నాయా?

మీ భార్య మీతో ఈ విషయాలు దాచిపెడుతోందా? రిలేషెన్‌ షిప్‌పై పడే ప్రభావం ఇదే

జి మెయిల్, ఇన్‌స్టాగ్రామ్, అమెజాన్.. అన్ని అకౌంట్ పాస్ట్‌వర్డ్స్ మర్చిపోతున్నారా? సమస్యకు పరిష్కారం ఇదిగో

చాణక్య నీతి.. ఈ 4 ప్రదేశాల్లో ఇల్లు కొనకూడదు, నిర్మించకూడదు

ఒక్కో సెలైన్ బాటిల్‌కు రూ.15000 చెల్లిస్తున్న యువత.. డాండియా డాన్స్ పిచ్చి.. ఆరోగ్యకరమేనా?

అస్సలు చేదు రాకుండా..కరకరలాడే కాకరకాయ వేపుడు!

15 నిమిషాల్లోనే..నోట్లో కరిగిపోయే కమ్మని రవ్వ బర్ఫీ చేయండిలా!

రెస్టారెంట్ స్టైల్ చికెన్ వేపుడు..ఇలా చేసారంటే టేస్ట్ అదిరిపోద్ది

Big Stories

Advertisement
×