Fish Benefits: బర్డ్ ఫ్లూ వల్ల ప్రస్తుతం చాలా మంది చికెన్ తినాలంటేనే భయపడుతున్నారు. చికెన్ ధర చాలా వరకు తగ్గినప్పటికీ తినడానికి వెనకాడుతున్నారు. పండగలు, ఫంక్షన్లు, ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వేజ్ తప్పకుండా ఉండాల్సిందే. మరి ప్రస్తుతం చికెన్ తినే పరిస్థితి ఎలాగూ.. లేదు కాబట్టి ఇలాంటి సమయంలోనే చికెన్‌కు బదులుగా చేపలు తినండి.
ఫిష్‌లో చికెన్ కంటే మన శరీరానికి ఎంతో మేలు చేసే అనేక పోషకాలు , విటమిన్లు అధిక మోతాదులో ఉంటాయి. వీటిని తినడం వల్ల కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మరి చేపలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చేపలలో ఒమేగా-3, కొవ్వు ఆమ్లాలు, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు కూడా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. ఫలితంగా ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
చేపలలో భాస్వరం, కాల్షియం, జింక్, ఐరన్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు అత్యధిక పరిమాణంలో లభిస్తాయి. చేపలలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. గుండె జబ్బులు:
గుండె జబ్బుల వల్ల ఏటా చాలా మంది మరణిస్తున్నారు. ఎండాకాలంలో గుండెపై మరింత ఒత్తిడి ఉంటుంది. ఒమేగా 3 అధికంగా ఉండే చేపలు తినడం వల్ల మీ గుండెకు చాలా మేలు జరుగుతుంది. వారానికి రెండుసార్లు చేపలు తింటే మీ రక్తపోటు సమతుల్యంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి తరచుగా చేపలను తినడం అలవాటు చేసుకోండి.
2. చర్మానికి మేలు చేస్తుంది:
చేపలలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి. అంతే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారకుండా నివారిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పకుండా చేపలను తినడం అలవాటు చేసుకోండి.
3. జలుబు , దగ్గుకు ప్రయోజనకరం:
జలుబు, దగ్గు రావడం చాలా సాధారణం. ఇలాంటి సమయంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న చేపలను తినడం వల్ల ఊపిరితిత్తులలో వాయుమార్గ ప్రవాహం పెరుగుతుంది. ఫలితంగా జలుబు , దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి.
Also Read: ఈ నేచురల్ హెయిర్ కలర్‌తో.. క్షణాల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం
4. ఆర్థరైటిస్ :
మోకాళ్లలో కండరాలలో నొప్పులు ,ఆర్థరైటిస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు చేపలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. వారానికి 1 నుండి 2 సార్లు చేపలు అలవాటు చేసుకోండి. నొప్పులతో పాటు శరీరంలో వాపు సమస్యను తొలగించడంలో కూడా చేపలు ఉపయోగపడతాయి.
5. మెదడుకు మేలు :
చేపలు మెదడుకు పదును పెట్టడంలో సహాయపడతాయని మీరు తరచుగా వినే ఉంటారు. చేపలలో ఉండే ప్రోటీన్ కొత్త మెదడు కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. అంతే కాకుండా చేపలలో లభించే కొవ్వు ఆమ్లాలు మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో , జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.