E-Paper
Advertisement

దీపావళి వంటకాలు తిని కడుపునొప్పి తీవ్రంగా అనిపిస్తోందా? ఈ సమస్యలుంటే సర్జరీ అవసరం

దీపావళి వంటకాలు తిని కడుపునొప్పి తీవ్రంగా అనిపిస్తోందా? ఈ సమస్యలుంటే సర్జరీ అవసరం
Advertisement

పండుగలు వచ్చాయంటే రకరకాల పిండివంటలు, నూనెలో వేయించిన పదార్థాలు, స్వీట్లు, మసాలా వంటకాలతో విందు చేసుకుంటాం. అయితే ఇలా కడుపునిండా తిన్న తర్వాత కడుపునొప్పి వస్తే చాలామంది గ్యాస్ లేదా అజీర్తి అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఈ నొప్పి ప్రాణాలకు ప్రమాదం కలిగించే సమస్యలకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి రావడం, వాంతులు, జ్వరం, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చని న్యూఢిల్లీ మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోబోటిక్, ల్యాపరోస్కోపిక్ సర్జరీ నిపుణులు డాక్టర్ ఆశిష్ గౌతమ్ సూచించారు.

1. కొవ్వు పదార్థాలు తిన్న తర్వాత గాల్‌స్టోన్స్ సమస్య

పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటాన్ని గాల్‌స్టోన్స్ అంటారు. పిత్తాశయం ఆహారంలోని కొవ్వులను జీర్ణం చేయడానికి అవసరమైన ద్రవాన్ని నిల్వ చేస్తుంది. రాళ్లు ఏర్పడి పిత్త ప్రవాహానికి అడ్డుపడితే తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా కుడివైపు పై పొట్టలో నొప్పి వస్తుంది. ఈ నొప్పి వీపు లేదా కుడి భుజం వరకు వ్యాపించవచ్చు. వాంతులు, వికారం కూడా ఉండవచ్చు. ఇన్ఫెక్షన్ లేదా వాపు పెరిగితే పిత్తాశయాన్ని తొలగించేందుకు శస్త్రచికిత్స అవసరమవుతుంది.

2. ప్యాంక్రియాటైటిస్ సమస్య ఉంటే తీవ్రమైన కడుపునొప్పి

Advertisement

ప్యాంక్రియాస్‌లో (క్లోమ గ్రంథి) వాపు రావడాన్ని ప్యాంక్రియాటైటిస్ అంటారు. పిత్తాశయంలోని రాళ్లు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. పై పొట్ట భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చి వీపు వరకు వ్యాపించవచ్చు. వాంతులు, జ్వరం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో మూత్రపిండాలు, ఊపిరితిత్తులపై కూడా ప్రభావం పడుతుంది. వెంటనే ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలి.

3. అపెండిసైటిస్ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు

అపెండిక్స్‌లో వాపు లేదా ఇన్ఫెక్షన్ రావడాన్ని అపెండిసైటిస్ అంటారు. మొదట నాభి చుట్టూ నొప్పి మొదలై క్రమంగా కుడివైపు కింది పొట్టకు చేరుతుంది.
నడిచినప్పుడు, దగ్గినప్పుడు నొప్పి పెరగవచ్చు. జ్వరం, వాంతులు, ఆకలి తగ్గడం కూడా కనిపిస్తాయి. పరిస్థితిని బట్టి అపెండిక్స్ తొలగించాల్సి ఉంటుంది. అది పగిలితే పొట్టలో ఇన్ఫెక్షన్ వ్యాపించే ప్రమాదం ఉంది.

4. పేగుల్లో అడ్డంకులు ఏర్పడితే తీవ్ర ప్రమాదం

Advertisement

పేగుల్లో ఆహారం, ద్రవాలు ముందుకు వెళ్లకుండా అడ్డంకులు ఏర్పడితే తీవ్రమైన సమస్య వస్తుంది. కడుపునొప్పి, ఉబ్బరం, వాంతులు వస్తాయి. మలవిసర్జన లేదా గ్యాస్ బయటకు వెళ్లడం కూడా కష్టమవుతుంది. పాత శస్త్రచికిత్సలు, హెర్నియా, కణితులు ఇందుకు కారణం కావచ్చు. పరిస్థితి తీవ్రంగా ఉంటే పేగులకు రక్తప్రసరణ తగ్గి వాటి కణజాలం దెబ్బతినవచ్చు. కొందరికి సర్జరీ అవసరమవుతుంది.

Also Read: హోటల్ స్టైల్ పన్నీర్ చిల్లీ.. ఇంట్లోనే తయారు చేయండి.. రెసిపీ ఇదిగో

5. కడుపులో అల్సర్ పగిలినా అత్యవసర చికిత్స అవసరం

కడుపు లేదా పేగుల్లో ఏర్పడిన అల్సర్ పగిలితే తీవ్రమైన నొప్పి వస్తుంది. జీర్ణరసాలు పొట్టలోకి చేరి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర శస్త్రచికిత్స అవసరమవుతుంది.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి

తీవ్రమైన కడుపునొప్పి, పదేపదే వాంతులు, జ్వరం, కళ్లలో పసుపు రంగు, కడుపు గట్టిపడటం, మలవిసర్జన కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. మధుమేహం, అధిక బరువు, గతంలో పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

Also Read: 90 ఏళ్ల వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవిస్తున్న జపాన్ ప్రజలు.. కారణాలివే

దీపావళి భోజనం తర్వాత వచ్చే నొప్పిని నిర్లక్ష్యం చేయకండి

దీపావళి సమయంలో పిండి వంటలు, స్వీట్స్, ఫ్రైడ్ ఫుడ్స్ అతిగా తిన్నప్పుడు కొంత అజీర్తి రావడం సహజమే. కానీ తీవ్రమైన లేదా కడుపునొప్పి తగ్గకపోతే గ్యాస్ సమస్యగా భావించకూడదు. వైద్యులు రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ ద్వారా సమస్యను గుర్తిస్తారు. సకాలంలో చికిత్స తీసుకుంటే ప్రమాదకరమైన సమస్యలు నివారించవచ్చు.

Related News

కొత్త డేటింగ్ ట్రెండ్.. ప్రేమలో అనుబంధం తగ్గితే బ్రేకప్ చేయకుండా మంకీ బ్రాంచింగ్

దీపావళికి టపాసులు కాలుస్తూ గాయపడ్డారా? కాలిన గాయలకు వెంటనే ఇలా చేయండి

పిల్లలతో కలిసి భోజనం చేయడం వల్ల ఇన్ని ప్రయోజనాలా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి

టైం లేనప్పుడు..ఈ టేస్టీ కిచిడిని ట్రై చేయండి!రుచి అదిరిపోతుంది

రుచికరమైన సేమ్యా పాయసం..ఈ కొలతలతో చేస్తే చల్లారినా గట్టిపడదు

చాణక్య నీతి.. భర్తలు చేసే ఈ 5 తప్పులు వల్లే వైవాహిక జీవితం నాశనం

షుగర్ పేషెంట్లకు దీపావళి డైట్ ప్లాన్.. ఏవి తినాలి? ఏవి తినకూడదు?

Big Stories

Advertisement
×