Ashwagandha Milk: అశ్వగంధ కలిపిన పాలు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఆయుర్వేదంలో.. అశ్వగంధను ఒక అద్భుతమైన మూలికగా పరిగణిస్తారు. ఇది శరీరం, మనస్సు రెండింటినీ బలపరుస్తుంది. దీన్ని వేడి పాలతో కలిపి తాగితే.. ప్రయోజనాలు చాలా రెట్లు పెరుగుతాయి. పాలలో అశ్వగంధ కలిపి తాగడం వల్ల మీ అలసట తొలగిపోవడమే కాకుండా శరీరానికి లోతైన పోషణను కూడా అందుతుంది. ఆధునిక జీవనశైలి యొక్క హడావిడిలో, ఒత్తిడితో కూడిన వాతావరణంలో అశ్వగంధ పాలు సహజ టానిక్‌గా పనిచేస్తాయి.
ప్రతి రోజు రాత్రి అశ్వగంధ కలిపిన పాలు తాగడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అశ్వగంధ హార్మోన్ల సమతుల్యతలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అశ్వగంధ పాలు తాగడం వల్ల కలిగే 5 ప్రధాన ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అశ్వగంధను పాలతో కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది:
అశ్వగంధ ఒక అద్భుతమైన అడాప్టోజెన్. ఇది శరీరం ఒత్తిడితో పోరాడటానికి సహాయపడుతుంది. అంతే కాకుండా పాలతో కలిపి అత్వగంధ తీసుకుంటే, శరీరం, మనస్సు విశ్రాంతి పొందుతాయి. అలసట, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు అశ్వగంధ పాలు తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కార్టిసాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అంతే కాకుండా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
నిద్రను గాఢంగా, మెరుగ్గా చేస్తుంది:
అశ్వగంధ పాలు నిద్రలేమి సమస్య ఉన్నవారికి దివ్యౌషధం. దీనిలో ఉండే సహజ సమ్మేళనాలు మనస్సును ప్రశాంతపరుస్తాయి. అంతే కాకుండా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి. ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు దీనిని తాగడం వల్ల నిద్రలేమి సమస్య తొలగిపోతుంది. ఉదయం నిద్రలేచినప్పుడు మీకు తాజాగా అనిపిస్తుంది.
రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది:
అశ్వగంధలో యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పాలతో కలిపి అశ్వగంధను తీసుకుంటే.. ఇది రోగనిరోధక శక్తిని అంతర్గతంగా బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా జలుబు, దగ్గు వంటి చిన్న ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. మారుతున్న వాతావరణంలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది ఒక ప్రభావవంతమైన మార్గం.
కండరాలు, ఎముకలకు బలం:
మీ శరీరం బలంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా అశ్వగంధ పాలు తాగండి. ఇది కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. అంతే కాకుండా శరీరానికి శక్తిని అందిస్తుంది. పాల నుండి లభించే కాల్షియం, అశ్వగంధ నుండి లభించే సహజ ప్రోటీన్ శరీరాన్ని బలంగా, చురుగ్గా చేస్తాయి. ఇది ముఖ్యంగా జిమ్‌కి వెళ్లేవారికి , ఫిట్‌నెస్ ప్రియులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: రాత్రి పూట మొబైల్ చూస్తున్నారా ? ఈ వ్యాధులు రావడం ఖాయం
హార్మోన్ల సమతుల్యత, పునరుత్పత్తి:
అశ్వగంధ పాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. ముఖ్యంగా పురుషులలో, ఇది టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచుతుంది. అంతే కాకుండా మహిళల్లో పీరియడ్స్‌కు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. ఇది సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం యొక్క మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.