BigTV English

HBD Chiyaan Vikram: కోలీవుడ్ స్టార్ విక్రమ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే.. ఆయన ఆస్తుల వివరాలు..

HBD Chiyaan Vikram: కోలీవుడ్ స్టార్ విక్రమ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే.. ఆయన ఆస్తుల వివరాలు..

HBD Chiyaan Vikram: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ (Vikram) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 1966 ఏప్రిల్ 17వ తేదీన పరమకుడి, తమిళనాడులో జన్మించారు. అయితే ఇదే ఊరు నుంచి ముగ్గురు జాతీయ ఉత్తమ నటులు ఉండడం విశేషం. వారు ఎవరో కాదు స్టార్ హీరో కమలహాసన్(Kamal Haasan), ఆయన అన్నయ్య చారు హాసన్ (Charu Haasan) తో పాటు చారు హాసన్ కుమార్తె సుహాసిని (Suhasini). అటు విక్రమ్ తండ్రి వినోద్ రాజు (Vinod Raj)కూడా పలు తమిళ్, కన్నడ చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. వినోద్ రాజుకు నృత్య రంగంలో కూడా మంచి ప్రవేశం ఉంది. ఈయన 2017 డిసెంబరు 31న మరణించారు.


చదువు కంటే ఇతర వ్యాపకాలపైనే వ్యామోహం ఎక్కువ..

ఇక విక్రం విద్యాభ్యాసం విషయానికి వస్తే.. ఆయన చదువుకున్నది యార్కాడ్ లో.. చెన్నైలోని లయోలా డిగ్రీ కళాశాల నుండి బిఏ ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకున్న ఈయన అక్కడే ఎంబీఏ కూడా పూర్తి చేశారు. చదువు కోసం చెన్నైలో ఉన్నప్పుడు బాలీవుడ్ సినిమాలు చూసేవాడు. దాంతో చిన్నప్పటి నుంచి చదువు మీద కంటే ఇతర వ్యాపకాల మీదే ఎక్కువ ధ్యాస ఉండేది. ముఖ్యంగా గిటార్, పియానో, కరాటే ,ఈత వంటివి నేర్చుకొని, అటు కరాటే, ఈత పోటీలలో ప్రథముడిగా నిలిచారు. ఇక అంతే కాదు తరచూ నాటకాలలో నటించే ఈయన వాటిల్లో ఎక్కువగా ఆంగ్లనాటకాలే కావడం గమనార్హం.


తండ్రి బాటలో కొడుకు కూడా..

ఇక చదువు పూర్తి చేసుకొని ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) తెలుగులో దర్శకత్వం వహించిన ‘అక్క పెత్తనం చెల్లెలి కాపురం’ సినిమాలో అవకాశం లభించింది. ఇందులో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) స్నేహితుడిగా నటించారు విక్రమ్. ఇక హీరోగా చేసిన ‘చిరునవ్వుల వరమిస్తావా’ చిత్రం కొన్ని కారణాలవల్ల ఇప్పటికి విడుదల కాలేదు. ఇక తర్వాత దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘బంగారు కుటుంబం’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao)తో కలిసి నటించి, తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తెలుగు కంటే తమిళ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తే ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక విక్రమ్ మాత్రమే కాకుండా విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) కూడా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈయన ఇటీవల పలు చిత్రాలలో హీరోగా నటించి ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్ మాత్రం వెలువడలేదు. కానీ ధృవ్ విక్రమ్ మరోవైపు ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) తో లిప్ లాక్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

విక్రమ్ ఆస్తుల వివరాలు..

ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విక్రమ్.. ఈ ఏడాది 59వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు సుమారుగా 400 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.

Nazriya Nazeem : విడాకుల దిశగా నజ్రియా.. ఆ పోస్టుకు అర్థం అదేనా..?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×