E-Paper
Advertisement

నెల్లూరు సర్వేపల్లి కట్ట వాసులకు.. ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు!

నెల్లూరు సర్వేపల్లి కట్ట వాసులకు.. ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు!
Advertisement

Nellore House Pattas: నెల్లూరులో సర్వేపల్లి కట్ట ఇళ్ల పట్టాల పంపిణీని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా ఉంటున్న వారికి భద్రత కల్పించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోదీ, పవన్ కల్యాణ్, నేను హామీ ఇచ్చామని ఆ హామీని 28 నెలల పాలనలో నిరూపించామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు సుపరిపాలనకు నాంది పలికామని, సుపరిపాలనలో భాగమే పేదకుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీఅని సీఎం చంద్రబాబు అన్నారు.

శాశ్వత ఇళ్ల పట్టాలు..

ఇది పేదలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది. 701 పట్టాలు మహిళలకు ఇవ్వడం మహిళ సాధికారతలో భాగమని, వచ్చే సంక్రాంతి కల్లా.. నెల్లూరు నగరంలోరి 4,000 పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలిస్తామని మాటిస్తున్నాని చంద్రబాబు అన్నారు. రాష్ట్రమంతా ఒక ఉద్యమంలా పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, విశాఖ, విజయవాడ, మంగళగిరిలో 60 వేల కుటుంబాలకు రూ.52,000 కోట్ల విలువైన ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో ఇచ్చామన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు భద్రత, ఆత్మగౌరవం, ఒక ఆస్తి సమకూరాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని, దాదాపు రూ.30 వేల కోట్లను ఖర్చు పెట్టి రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ కుళాయి కనెక్షన్లు ఇస్తున్నామన్నారు.

ఇంటికీ సోలార్ రూఫ్ టాప్..

Advertisement

స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ పథకం కింద ఇప్పటికే 100 కోట్ల ప్రయాణాలను మహిళలు ఉపయోగించుకోవడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. దీపం-2 పథకం కింద నేరుగా బ్యాంకు ఖాతాకే సబ్సిడీ డబ్బులు జమ చేస్తామని తెలిపారు. విద్యుత్ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ప్రతీ ఇంటికీ సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ప్రజారోగ్యం కాపాడటానికి రాష్ట్రమంతటా సంజీవని కార్యక్రమాన్ని అమలు చేస్తామని, అన్నదాత సుఖీభవ, నేతన్న సేవలో, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ సేవలో వంటివి అందిస్తున్నామని అన్నారు. గీత కార్మికులకు ఎక్సైజ్ షాపులు, వడ్డెరలకు మైనింగ్ లీజులు ఇచ్చాం. బుర్రిపాలెం నుంచి మొన్ననే 3 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేశామని ఇప్పటికే 5.50 లక్షల ఇళ్లు అందించామని తెలిపారు.

Also read: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సంచలనం.. మళ్లీ ఎన్టీఆర్ వ్యూహనికి శ్రీకారం?

Tags

Related News

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం!

ఏపీలోని బీసీలకు భారీ గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన!

విశాఖలో క్షుద్రపూజల కలకలం.. ఫ్రిజ్‌ తెరిచి చూడగా స్థానికుల మైండ్ బ్లాక్.. అందులో ఏముందంటే..?

వైసీపీని గెలిచిపించినా ఇక్కడకు వచ్చాం.. మీలో ఒకడిగా పుట్టలేదు.. మీలో ఒకడ్ని అయ్యా- డిప్యూటీ సీఎం పవన్

రూటు మార్చిన స్మగ్లర్లు.. విశాఖ సిటీలో విదేశీ బంగారం భారీగా సీజ్, కోల్‌కతా టు హైదరాబాద్

వైసీపీ పరువు తీసిన ఓ ఎన్నారై.. వెంకటేశ్‌రెడ్డికి అమెరికాలో 50 నెలలు జైలుశిక్ష, అసలు ఏం జరిగింది?

పాకల బీచ్‌లో విషాదం.. సముద్రంలో గల్లంతై ఇద్దరు యువకులు మృతి!

Big Stories

Advertisement
×