Banana For Hair: అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు కావాలని ఎవరు కోరుకోరు ? రసాయనాలతో తయారు చేసిన ఉత్పత్తులను వాడకుండా, సహజసిద్ధంగా జుట్టును పోషించుకోవాలనుకుంటే.. అరటిపండు హెయిర్ మాస్క్ ఒక అద్భుతమైన ఎంపిక. అరటిపండులో ఉండే పోషకాలు మీ జుట్టు సమస్యలన్నింటికీ పరిష్కారం. అరటి పండుతో ఇంట్లోనే చేసుకునే మాస్క్ వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వివరంగా తెలుసుకుందాం.
అరటిపండులోని పోషకాలు:
అరటిపండు కేవలం రుచికి మాత్రమే కాదు.. జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు:
పొటాషియం: జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టును బలంగా మారుస్తుంది.
విటమిన్లు (A, C, E): ఇవి జుట్టు కుదుళ్లను పోషించి, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
యాంటీఆక్సిడెంట్లు: జుట్టును ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. జుట్టు దెబ్బతినకుండా చూస్తాయి.
సహజ నూనెలు: జుట్టుకు తేమను అందించి, పొడిబారకుండా చేస్తాయి.
సిలికా: జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
అరటిపండు హెయిర్ మాస్క్ వల్ల కలిగే ప్రయోజనాలు:
పొడి, దెబ్బతిన్న జుట్టుకు తేమను అందిస్తుంది : అరటిపండులో ఉండే సహజ నూనెలు, పొటాషియం జుట్టుకు లోతుగా తేమను అందిస్తాయి. ఇది పొడిబారిన, నిర్జీవంగా ఉండే జుట్టుకు ప్రాణం పోసి, మృదువుగా, కాంతివంతంగా మారుస్తుంది.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది : అరటిపండులోని పోషకాలు, ముఖ్యంగా పొటాషియం, జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి, బలంగా పెరిగేలా సహాయపడుతుంది.
చుండ్రు నివారణ : అరటి పండులోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు చుండ్రును కలిగించే బ్యాక్టీరియా, ఫంగస్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఇది స్కాల్ప్‌ను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
మెరుపును పెంచుతుంది : అరటిపండులో ఉండే సిలికా జుట్టుకు సహజమైన మెరుపును అందిస్తుంది. నిర్జీవంగా కనిపించే జుట్టుకు మెరుపును జోడించి, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది.
జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది : అరటిపండులోని విటమిన్లు , పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరిచి, జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తాయి. ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
జుట్టును మృదువుగా చేస్తుంది : అరటిపండు హెయిర్ మాస్క్ జుట్టులోని చిక్కులను తగ్గించి, దువ్వడం ఈజీగా చేస్తుంది. ఇది జుట్టును సిల్కీగా, మృదువుగా మారుస్తుంది.
చిట్లిన చివర్లను తగ్గిస్తుంది: జుట్టుకు తగినంత తేమ అందకపోవడం వల్ల చివర్లు చిట్లుతాయి. అరటిపండు హెయిర్ మాస్క్ జుట్టుకు తేమను అందించి.. ఈ సమస్యను తగ్గిస్తుంది.
Also Read: జుట్టు చివర్లు చిట్లుతున్నాయా ? కారణాలివేనట !
అరటి పండు హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి ?
ఒక అరటి పండును బాగా మెత్తగా గుజ్జులా చేసి (ముఖ్యంగా ఉండలు లేకుండా చూసుకోవాలి, లేకపోతే జుట్టులో ఇరుక్కుపోతాయి), దానికి 1-2 చెంచాల కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె, ఒక చెంచా తేనె కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని తల పైభాగం నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించి, 20-30 నిమిషాలు ఉంచి, ఆపై గోరు వెచ్చని షాంపూ చేసి కడిగేయాలి. ఈ అద్భుతమైన హెయిర్ మాస్క్‌ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించడం వల్ల ఆరోగ్య కరమైన మెరిసే జుట్టును పొందవచ్చు.