BigTV English

Banana : మచ్చలు ఉన్న అరటి పండు.. తింటే ఏమి జరుగుతుందో తెలుసా..?

Banana : మచ్చలు ఉన్న అరటి పండు.. తింటే ఏమి జరుగుతుందో తెలుసా..?
Banana
Banana

Banana : మన దేశంలో మామిడి తర్వాత అత్యధికంగా పండిచే పంట అరటి. రోజూ అరటి పండు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అరటి పండును ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. అరటి పండ్లు శరీరానికి మంచి బూస్ట్‌ను ఇస్తాయని ఇప్పటికే అనేక అధ్యయనాల్లో తేలింది. అరటి పండ్ల ధర కూడా కాస్త తక్కువగా ఉంటుంది. కాస్త తియ్యగా ఉండే ఈ పండ్లను ఫ్యాన్స్ కూడా ఎక్కువే అని చెప్పాలి.


అంతేకాకుండా ఈ పండ్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. అరటిపండ్లలో ఉండే పీచు పదార్థం, పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ అరటి పండ్లపై మనలో కొందరికి కొన్ని అపోహలు ఉన్నాయి. పచ్చటి అరటి పండు మీద రవ్వంత నల్లటి మచ్చ ఉంటే తినకూడదని భావిస్తున్నారు. ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read : పాదాలలో వాపు.. అయితే మీ కిడ్నీలు డేంజర్‌లో పడ్డట్లే!


అరటి పండ్లలో సహజమైన పోషకాలు ఉంటాయి. ఇక మచ్చల విషయానికి వస్తే.. అరటి పండ్లు ఎంత ఎక్కువగా పండితే అన్ని మచ్చలు పడతాయట. అంతేకానీ దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే దాంట్లో వాస్తవం లేదు.

కేవలం ఎక్కువగా మగ్గడం వల్లనే అరటి పండ్లపై మచ్చలు వస్తాయట. అవి ఎటువంటి హాని కలిగించేవి కావు. అరటి పండ్ల మీద ఏర్పడే నల్లని మచ్చలు టీఎన్ఎఫ్ ఫ్యాక్టరీకి సంకేతమట. అంటే ట్యూమర్ నికోటర్ నికోటిన్ ఫ్యాక్టర్ అని చెబుతారు. ఇవి రక్తంలోని క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇంకా చెప్పాలంటే బాగా మగ్గిన అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయని అంటున్నారు.

Also Read : మీ కంటిలో ఈ లక్షణాలు ఉన్నాయా.. వెంటనే వైద్యుల వద్దకు లగెత్తండి!

అలానే అరటిపండ్లు ఎన్నో రకాల జబ్బులపై పోరాడతాయి. మరీ ముఖ్యంగా జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. పేగులను శుభ్ర పరుస్తాయి. ఇందులో ఉండే పీచు మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బీ6, మెగ్నీషియం, మాంగనీసు, రాగి, బయోటిన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అరటి పండ్లపై అపోహలు పక్కనపెట్టి హాయిగా లాగించండి.

Related News

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Big Stories

×