BigTV English

Kidney Disease : పాదాలలో వాపు.. అయితే మీ కిడ్నీలు డేంజర్‌లో పడ్డట్లే!

Kidney Disease : పాదాలలో వాపు.. అయితే మీ కిడ్నీలు డేంజర్‌లో పడ్డట్లే!
Kidney Disease
Kidney Disease

Kidney Disease : మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. గుండె జబ్బులు మరియు మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని చాలా వరకు పెంచుతున్నాయి. చిన్న వయసులోనే పిల్లలు, యువకులు జబ్బులు బారిన పడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే శరీరంలోని వాపు అనేది ఒక సాధారణ సమస్య. ఇది ఏ భాగానైనా రావచ్చు. కానీ ఈ వాపు విషయంలో అజాగ్రత్తగా ఉంటే అనేక తీవ్రమైన వ్యాధులకు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.


ముఖ్యంగా పాదాలలో వాపుతో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. వాటిలో ఒకటి మూత్రపిండాల వ్యాధి కూడా అవొచ్చు. పాదాలు వాపు చాలా హానికరం. దీనివల్ల మూత్రపిండాలు సరిగా పనిచేయవు. శరీరంలో నీటి శాతం ఎక్కువ అవుతుంది. దీనివల్ల కాళల్లో వాపు ఏర్పడుతుంది. ఈ వాపు సాధారణంగా చీలమండలు మరియు కాళ్లలో సంభవిస్తుంది. కానీ కొన్నిసార్లు ఇది తొడలు మరియు పొత్తికడుపులో కూడా సంభవించవచ్చు.

Also Read : మీ కంటిలో ఈ లక్షణాలు ఉన్నాయా.. వెంటనే వైద్యుల వద్దకు లగెత్తండి!


కాళ్లలో వాపు యొక్క లక్షణాలు

  • మూత్రవిసర్జనలో సమస్య రావడం.
  • మూత్రంలో నురుగు అధికంగా రావడం.
  • నిరంతరం అలసటగా ఉండటం.
  • శరీరం బలహీనంగా మారడం.
  • ఊపిరితిత్తులలో నీరు అధికంగా చేరడం.
  • ఎక్కసారిగా ఆకలి,  బరువు కోల్పోవడం.
  • వికారం మరియు వాంతులు అనుభూతి.
  • చేతులు మరియు కాళ్లలో తిమ్మిరి లేదా జలదరింపు .

ఈ టెస్టులు ద్వారా గుర్తించవచ్చు

UACR పరీక్ష 

యూరిన్ అల్బుమిన్ క్రియేటినిన్ రేషియో (UACR) టెస్ట్ చేయించుకోండి. ఈ పరీక్ష మూత్రంలో అల్బుమిన్ (ప్రోటీన్) మొత్తాన్ని కొలుస్తుంది. మూత్రంలో అల్బుమిన్ పరిమాణం ఎక్కువగా ఉంటే అది కిడ్నీ వ్యాధికి సంకేతం.

క్రియేటినిన్ పరీక్ష

ఈ పరీక్ష రక్తంలో క్రియేటినిన్ (రసాయన) మొత్తాన్ని కొలుస్తుంది. రక్తంలో క్రియాటినిన్ పరిమాణం ఎక్కువగా ఉంటే అది కిడ్నీ వ్యాధికి సంకేతం.

Also Read : ముక్కు నుంచి రక్తస్రావం జరిగితే ఏమోతుందో తెలుసా..?

కిడ్నీ వ్యాధి చికిత్స

కిడ్నీ వ్యాధి చికిత్స అనేది వ్యాధి తీవ్రతను బట్టి ఉంటుంది. ప్రారంభ దశలో ఆరోగ్యకరమైన ఆహారం మరియు జీవనశైలిని మార్చడం ద్వారా దీనిని చాలా వరకు తగ్గించవచ్చు. అంతే కాకుండా వైద్యుల పర్యవేక్షణలో ఇచ్చే మందులను తీసుకోవడం ద్వారా కూడా ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. కానీ తీవ్రమైన పరిస్థితుల్లో, డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరం కావచ్చు.

Disclaimer : ఈ కథనాన్ని నిపుణుల సలహా మేరకు రూపొందించాం. దీనిని సమాచారంగా మాత్రమే భావించండి.

Related News

Mobile Phones: పిల్లల ఆరోగ్యంపై.. మొబైల్ ఫోన్ ప్రభావం ఎంతలా ఉంటుందంటే ?

Hair Fall Problem: జుట్టు రాలుతుందా? ఈ విటమిన్ లోపాలే కారణం, జస్ట్ ఇలా చేస్తే నిగనిగలాడే కురులు మీ సొంతం!

Health Benefits: బిర్యాని ఆకుతో బోలెడు ప్రయోజనాలు.. ఒక్కసారి వాడితే మంచి ఫలితాలు

Skin Glow: నేచురల్‌గానే.. ముఖం మెరిసిపోవాలంటే ?

Curd vs Buttermilk:పెరుగు Vs మజ్జిగ.. రెండిట్లో ఏది బెటర్ ?

Mustard infusion: ఆవాల కషాయం అంత మంచిదా? దీని తయారీ చాలా సింపుల్!

Big Stories

×