BigTV English

Beauty Tips: మీ ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. మెరిసిపోతారు

Beauty Tips: మీ ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. మెరిసిపోతారు

Beauty Tips: రోజులో ఎక్కువ సమయం మనం ఇంటి బయట గడపడం ప్రారంభించినప్పుడు, దాని ప్రత్యక్ష ప్రభావం మన ముఖంపై కనిపిస్తుంది. బయట తిరగడం వల్ల కూడా చర్మంపై దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. దీని కారణంగా మన చర్మం కూడా నిస్తేజంగా కనిపిస్తుంది. చాలా సార్లు ఈ మురికి కారణంగా మనం అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది.


ముఖంపై మురికి పేరుకుపోయినప్పుడు పార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే వదిలించుకోవాలనుకుంటే మాత్రం కొన్ని రకాల టిప్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. హోం రెమెడీస్ ముఖంపై ఉన్న జిడ్డును తొలగించి మెరిసేలా చేస్తాయి. మరి ఎలాంటి హోం రెమెడీస్ మీ ముఖ సౌందర్యానికి ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ముఖంపై ఉన్న మురికి లేదా ధూళిని శుభ్రం చేయడానికి మీరు ఉబ్టాన్ కూడా ఉపయోగించవచ్చు. దీన్ని సిద్ధం చేయడం చాలా సులభం. ఈపేస్ట్‌ను సిద్ధం చేయడానికి, మీరు రోజ్ వాటర్‌లో కొంత శనగ పిండిని కలపాలి. ఇప్పుడు మీరు పసుపు పొడి, పాలు వేసి మిక్స్ చేయాలి. తర్వాత ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. చివరికి, మీరు మీ ముఖాన్ని పూర్తిగా స్క్రబ్ చేయడం ద్వారా శుభ్రం చేసుకోవాలి.


పటికతో శుభ్రమైన ముఖం:
మీ ముఖంపై పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడంలో పటిక కూడా మీకు చాలా సహాయపడుతుంది. మీరు మీ ముఖాన్ని శుభ్రం చేయడానికి పటికను ఉపయోగించాలనుకుంటే, ముందుగా మీరు పటిక ముక్కను తీసుకొని మెత్తగా, పౌడర్ సిద్ధం చేయాలి. కొద్దిగా రోజ్ వాటర్ తీసుకుని అందులో ఈ పౌడర్ వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మీ ముఖంపై అప్లై చేసి చేతులతో మసాజ్ చేయండి. సుమారు 15 నిమిషాల పాటు స్క్రబ్ చేసిన తర్వాత, మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

మురికిని శుభ్రపరచడంలో చక్కెర సహాయపడుతుంది:
మీ ముఖాన్ని శుభ్రం చేయడానికి మీరు చక్కెరను ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు కొంచెం పంచదార తీసుకుని అందులో రోజ్ వాటర్, అలోవెరా జెల్ కలపాలి. ఇప్పుడు మీరు ఈ జెల్‌ను మీ ముఖానికి అప్లై చేసి 5 నిమిషాలు అలాగే ఉంచాలి. చివరగా, మీరు మీ ముఖాన్ని చల్లటి నీటితో బాగా కడగాలి.

మునగ ఆకు పౌడర్‌లో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, సి, ఇ , అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని ముఖానికి ఉపయోగించడం ద్వారా అనేక లాభాలు ఉంటాయి.

మునగ ఆకు పౌడర్ ఎలా తయారు చేయాలి ?
మీరు మీ చర్మంపై ఉన్న జిడ్డు శాశ్వతంగా తొలగించి, మెరిసేలా చేయాలనుకుంటే ఇంట్లోనే మునగ ఆకు పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఈ పొడిని సిద్ధం చేయడానికి, మీకు మునగ ఆకులు ,జల్లెడ అవసరం. ఈ పొడిని సిద్ధం చేయడానికి ముందుగా మీరు తాజా మునగ ఆకులను తీసుకోవాలి. తర్వాత నీళ్లతో కడిగి బాగా శుభ్రం చేసుకోవాలి. అనంతరం వాటిని పూర్తిగా ఆరబెట్టాలి. తర్వాత ఆకులు బాగా ఆరిపోయాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

Also Read: పసుపు నీటితో.. స్నానం చేస్తే ?

మునగ ఆకు పొడిని ఎలా ఉపయోగించాలి ?
మీరు మీ చర్మం మెరుస్తూ, ముడతలు లేకుండా ఉండాలంటే మీరు మునగ పొడిని కాస్త నీటిలో వేసి మిక్స్ చేయాలి. తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత వాష్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×