BigTV English
Advertisement

Palamuru: ఒక పార్టీ, రెండు ఆఫీసులు – పాలమూరులో గులాబీల గలాట!

Palamuru: ఒక పార్టీ, రెండు ఆఫీసులు – పాలమూరులో గులాబీల గలాట!

జిల్లాలో బీఆర్ఎస్‌కి ఒక్క పార్టీ కార్యాలయం సరిపోవడం లేదట… ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన గులాబీ పార్టీకి అక్కడ రెండు జిల్లా కార్యాలయాలు కనిపిస్తుండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది … ఒకటేమో పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో నిర్మాణం జరిగితే ..మరొకటేమో మొన్నీమధ్య నియోజకవర్గం ఆఫీసు నుంచి జిల్లా పార్టీ కార్యాలయంగా అప్ గ్రేడ్ అయింది. గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగాప్రారంభించిన పార్టీ సొంత భవనానికి అప్‌గ్రేడ్ అయిన పార్టీ కార్యాలయం పోటీ ఇవ్వడం ఇప్పుడు జిల్లా పాలిటిక్స్‌లో ఆసక్తి రేపుతోంది. అఫిషియల్ ఆఫీసు ఏదో అర్థంకాక కేడర్లో గందరగోళం నెలకొంటోంది .. అసలింతకీ ఆ జిల్లా ఏది? ఆ పార్టీ కార్యాలయాల గోలెంటి?


మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ పాలిటిక్స్ విచిత్రంగా తయారయ్యాయి. అక్కడ బీఆర్ఎస్ రాజకీయాలు ప్రజలకు కాదు… అసలు పార్టీ శ్రేణులకే అర్థం కావడం లేదంట. ఎన్నికల ముందు పార్టీ కార్యక్రమాలు అంటే ఎంతో హడావిడి ఉండేది. ఇప్పుడు అసలు పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరు పెద్దగా ఆక్టివ్‌గా లేరని క్యాడర్ లో చర్చ నడుస్తోంది. ఇక జిల్లా కేంద్రంలో అయితే ఆ పాలిటిక్స్ మరింత ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తున్నాయి. పార్టీ సొంత నిధులతో నిర్మితమైన జిల్లా కార్యాలయం ఎన్నికల్లో ఓటమి తర్వాత నిరుపయోగంగా మరిందనుకుంటే… కొత్తగా మరో కార్యాలయం తెర మీదకు వచ్చింది.

మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యాలయం ఎన్నికల తర్వాత ప్రమోషన్ పొందింది. అందుకేనెమో ఇప్పుడు ఏకంగా జిల్లా పార్టీ కార్యాలయం అని స్టికర్ మార్చేసుకుంది. .. వాస్తవానికి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఒకరో ఇద్దరు కూడా కనిపించేవారు కాదు. అదే టైంలో న్యూ టౌన్ లో ఉన్న నియోజకవర్గ కార్యాలయంలోనే కార్యకర్తలు, నాయకుల సందడి కనిపించేది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ నిత్యం ఇదే కార్యాలయానికి రావడం, కార్యక్రమాలు నిర్వహించి హడావుడి చేశారు….అనంతరం ఎంపీ ఎన్నికల్లోను అదే తరహా పార్టీ కార్యక్రమాలు నిర్వహించే వారు..


అంతవరకు అంతా బాగానే ఉన్నా… అకస్మాత్తుగా నియోజకవర్గ పార్టీ కార్యాలయానికి జిల్లా పార్టీ కార్యాలయంగా పేరు మార్చడం గులాబీ క్యాడర్ లో చర్చనీయాంశం అయింది. జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున సొంత భవనం నిర్మంపచేసి…. జిల్లా పార్టీ కార్యాలయం అందులో ఏర్పాటు చేసి ఆ భవనాన్ని స్వయంగా కారు పార్టీ అధినేత కేసీఆరే ప్రారంభించారు… అలాంటి జిల్లా కార్యాలయానికి నియోజకవర్గ ఆఫీసు ఇప్పుడు పోటీగా మారింది. ఇదంతా ఎందుకు జరిగిందో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. పార్టీలో ఆధిపత్య పోరులో భాగంగానే ఇది జరిగిందా? అన్న అనుమానాలు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి

జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన హయాంలో ఇప్పటివరకు ప్రారంభోత్సవం తప్ప జిల్లా పార్టీ కార్యాలయంలో ఒక్క సమావేశం కూడా జరగలేదు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ ఎలాంటి సందడి లేకుండా బోసిపోయింది. జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కేంద్రంగా పార్టీ వ్యవహారాలు కొనసాగాయి. దాంతో జిల్లా పార్టీ ఇన్చార్చ్‌కి పెద్దగా పనుండేది కాదని, పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షించాల్సిన అవసరం కూడా రాలేందంటారు. పార్టీకి సంబంధించి ఏ పనులైన నేరుగా అధిష్టానంతో చర్చించుకొని నాటి ఎమ్మెల్యేలే చేయించుకునేవారట. దాంతో అటు జిల్లా అధ్యక్షుడు, ఇటు పార్టీ జిల్లా కార్యాలయాలకు ప్రాధాన్యత లేకుండా పోయింది

ఎన్నికల తర్వాత సడన్‌గా మరో జిల్లా కార్యాలయం పుట్టుకు రావడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో.. శ్రీనివాస‌గౌడ్ పర్యవేక్షించే నియోజకవర్గ కార్యాలయంలోనే పార్టీ హడావిడి జరుగుతోంది. లక్ష్మారెడ్డి పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండం వల్లే ఇలాంటి పరిణమాలు చోటు చేసుకుంటున్నాయని కేడర్ భావిస్తుంది. జిల్లా కేంద్రంలో తాను హడావిడి చేస్తే మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో తనకు నేరుగా అభిప్రాయ బేధాలు వస్తాయని, లేనిపోని తలనొప్పి ఎందుకని లక్ష్మా రెడ్డి భావిస్తున్నట్లు చెప్తున్నారు.

Also Read: కమలంలో కీలక మార్పులు.. నడ్డా ప్లేస్‌లో అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి?

ఏదేమైనా సడన్‌గా నియోజకవర్గ కార్యాలయం… జిల్లా కార్యాలయంగా మార్పు చెందడంతో క్యాడర్ లో గందరగోళం నెలకొంది. ఇద్దరు మాజీ మంత్రుల మధ్య గ్యాప్ కారణంగానే శ్రీనివాసగౌడ్ నియోజకవర్గం ఆఫీసుకి జిల్లా పార్టీ కార్యాలయం బోర్డు పెట్టించారంటున్నారు. మొత్తానికి ఓటమి తర్వాత కూడా పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతల రాజకీయం ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది.

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Big Stories

×