Principal Steals Midday meal| భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం లభిస్తోంది. కానీ చాలా చోట్ల పిల్లలకు భోజనం సరిగా పెట్టడం లేదని, నీరు లాగా పలుచగా ఉండే పప్పు, లేదా అన్నంలో కారం పొడి మాత్రమే ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లు ఈ అవినీతి నిజమనే తేలింది. అయితే తాజాగా ఒక స్కూల్ ప్రిన్సిపాల్ మరీ అసహ్యకరంగా బడి పిల్లలకు పోషకాహారం కోసం పెట్టే కోడి గుడ్లను దొంగిలించాడు. పైగా ఈ ఘటన కెమెరాలో రికార్డ్ కావడంతో జిల్లా విద్యాధికారి సీరియస్ అయ్యారు.
వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో బిహార్ రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ పాఠశాలకు చెందిన వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక స్కూల్ ప్రిన్సిపాల్.. స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకం కింద ఇచ్చే కోడిగుడ్లను దొంగతనం చేస్తూ కనిపించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో జిల్లా యంత్రాంగం సీరియస్ అయింది. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ని పిలిచి వివరణ కోరింది.
Also Read: ఒక కప్పు టీ ధర రూ.లక్ష.. అంతా బంగారమే!
బిహార్ లోని హాజిపూర్ జిల్లా లాల్ గంజ్ బ్లాక్ చెందిన మధ్య విధ్యాలయ రిఖర్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన వీడియోలో మధ్యాహ్న భోజనం కోసం మినీ ట్రక్కులో ఓ డ్రైవర్ సామాగ్రి తీసుకువచ్చాడు. అక్కడికి స్కూల్ ప్రిన్సిపాల్ వచ్చి డ్రైవర్ చేతికి ఒక బ్యాగు ఇచ్చాడు. ఆ డ్రైవర్ ఆ సంచిలో కోడి గుడ్లు వేసి ఇవ్వగా.. ప్రిన్సిపాల్ దాన్ని దాచిపెట్టుకుని వెళుతున్నట్లు కనిపించారు. ఈ వీడియో గురించి మీడియా విచారణ చేయగా.. ఆ కోడి గుడ్లు ప్రిన్సిపాల్ తన ఇంటికి తీసుకెళ్లినట్లు తేలింది. ఈ వీడియోను ఒక స్కూల్ టీచర్ రహస్యంగా రికార్డ్ చేశారు.
డిసెంబర్ 12న జరిగిన ఈ ఘటన వైరల్ వీడియో చూసి జిల్లా విద్యాధికారి స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్ సహ్నీకి నోటీసులు జారీ చేశారు. ఆయన రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరారు.
స్కూల్ ప్రిన్సిపాల్ ఏమన్నారు?
వైరల్ వీడియోపై ప్రిన్సిపాల్ సురేష్ సహ్ని మాట్లాడుతూ.. తాను ఆ కోడి గుడ్లు ఇంటికి తీసుకెళ్లలేదని.. స్కూల్ వంటవాడికే ఇచ్చానని చెప్పారు. కానీ వంటవాడు మాత్రం తనకు ప్రిన్సిపాల్ సహ్ని కోడి గుడ్లు ఎప్పుడూ ఇవ్వలేదని చెప్పాడు. ఆయన ఆ కోడి గుడ్లు తన ఆఫీసులోనే పెట్టుకున్నట్లు తాను చూశానని.. ఆ తరువాత తనకేమీ తెలియదన్నాడు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు స్కూల్ ప్రిన్సిపాల్ కు మరోసారి ఇలాంటి చర్యలు చేయకూడదని హెచ్చరించారు.
బిహార్ రాష్ట్రంలో పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రభుత్వం వారికి పోషకాహారం కోసం మధ్యాహ్న భోజనంలో ఉడికిన కోడి గుడ్లు సరఫరా చేస్తోంది. పైగా చలి కాలంలో పిల్లలందరికీ కోడి గుడ్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించింది.
बिहार: वैशाली में लालगंज के रिखर माध्यमिक विद्यालय के प्रिंसिपल का एक वीडियो जमकर वायरल हो रहा है, जिसमें हेडमास्टर बच्चों को मिलने वाले मिड डे मील के अंडे चोरी करते नजर आ रहे है. इसका खुलासा तब हुआ जब एक शख्स ने उनका अंडे चुराने का वीडियो बना लिया और वायरल कर दिया.जिसके बाद… pic.twitter.com/lMML9G9YeH
— NDTV India (@ndtvindia) December 18, 2024