Non Veg: మన ఆహారం ఎలా ఉండాలి. నాన్-వెజ్ లేదా వెజ్ వీటిలో ఆరోగ్యానికి ఏది తినడం మంచిది. ఈ విషయాల గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. వేర్వేరు అధ్యయనాలు.. తినే ఆహారం గురించి వివిధ రకాలుగా ఫలితాలను వెల్లడించాయి. కానీ అందులో ఎక్కువ అధ్యయనాలు మాత్రం వెజ్ ఫుడ్స్ మాత్రమే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయని సూచిస్తున్నాయి. అలాగే మరికొన్ని అధ్యయనాలు శరీరానికి అవసరం అయ్యే ఐరన్, ప్రోటీన్ కోసం నాన్ వెజ్ తినాలని వెల్లడిస్తున్నాయి.
శాఖాహారం, మొక్కల ఆధారిత ఆహారం తినడం ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకుల బృందం ఇటీవల ఒక అధ్యయనం ద్వారా తెలిపింది. అంతే కాకుండా చికెన్, మటన్ లేదా ఇతర జంతువుల ఆధారిత ఆహారం అనేక విధాలుగా ఆరోగ్యానికి హానికరం అని వెల్లడించింది. ఇది మాత్రమే కాదు.. ఎక్కువగా చికెన్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించింది.
చికెన్ ఎక్కువగా తింటే.. క్యాన్సర్:
ఇటలీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ పరిశోధకుల బృందం చికెన్ రెగ్యులర్ గా తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని తెలిపింది.
న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ నివేదికలో.. మటన్‌తో పోల్చితే చికెన్ తినడం ప్రయోజనకరంగా పరిగణించబడుతున్నప్పటికీ.. తరచుగా చికెన్ తింటే ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు పేర్కొన్నారు. ఇది కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపారు.
20 సంవత్సరాల కాలంలో ఇటలీలో నివసిస్తున్న 4,869 మంది ఆరోగ్య డేటాను నిపుణుల బృందం విశ్లేషించింది. వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ పౌల్ట్రీ (చికెన్) తినేవారికి జీర్ణశయాంతర క్యాన్సర్ , దాని నుండి అకాల మరణం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు.
జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ ప్రమాదం:
గతంలో చికెన్ తినడం, మటన్ తినడం కంటే ఆరోగ్యకరమైనదని పలు పరిశోధనల్లో రుజువైంది. ఎందుకంటే ఇది గుండె జబ్బులు , కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కానీ తాజా పరిశోధన ప్రకారం మీరు క్రమం తప్పకుండా చికెన్ తింటే ప్రాణాంతక క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందట.
ఈ పరిశోధన సమయంలో.. పాల్గొనేవారు వారి ఆహారపు అలవాట్ల గురించి పూర్తి వివరాలను వెల్లడించారు. ఆరోగ్య స్థితి, వైద్య చరిత్ర, ప్రాంతీయ డేటాబేస్‌లను ఉపయోగించి పరిశోధకులు వివిధ అంశాలను అంచనా వేశారు. పరిశోధకులు పరిశీలించిన అంశాలలో ఒకటి పాల్గొనేవారు ఎలుక మాంసం లేదా చికెన్ ఎంత ఎక్కువగా తింటున్నారు అనేది.
దీని ఆధారంగా.. రెండు గ్రూపులుగా విభజించబడిన వ్యక్తులపై నిర్వహించిన అధ్యయనంలో.. చికెన్ ఎక్కువగా తినేవారికి భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది.
పరిశోధనలు ఏమి చెబుతున్నారు ?
ఈ అధ్యయనం యొక్క ఫలితాలు ఆందోళనకరంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. దీనిని మరింత వివరంగా అర్థం చేసుకోవడానికి ఎక్కువ పరిశోధనలు అవసరం.
ఉదాహరణకు.. మరణాల రేటు పెరుగుదల నేరుగా చికెన్ తినడం వల్ల జరిగిందా లేదా దానిని వండిన, వేయించిన విధానం మొదలైన వాటితో సంబంధం కలిగి ఉందా అనేది ఇంకా నిర్ణయించబడలేదు. అధ్యయనంలో పాల్గొనేవారి శారీరక శ్రమ , బరువు వంటి కొన్ని ఆరోగ్య , జీవనశైలి అంశాలను కూడా మరింత వివరంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.