Beetroot Juice: బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్య సమస్యలు రాకుండా చేయడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బీట్ రూట్ జ్యూస్ తాగితే అద్భుమైన ప్రయోజనాలు లభిస్తాయి. కానీ కొన్ని ఎక్కువగా తాగితే మాత్రం ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్‌రూట్ జ్యూస్ తాగితే కలిగే అనర్థాలు:
కిడ్నీలో రాళ్లు ఏర్పడటం:
బీట్‌రూట్‌లో ఆక్సలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్లను ఏర్పరచడానికి దోహదం చేస్తాయి. ఇప్పటికే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు లేదా రాళ్లు వచ్చే అవకాశం ఉన్నవారు బీట్‌రూట్ జ్యూస్‌ను అతిగా తాగకుండా ఉండాలి. ఆక్సలేట్లు క్యాల్షియంతో కలిసి క్యాల్షియం ఆక్సలేట్ రాళ్లుగా మారతాయి.
జీర్ణ సమస్యలు:
బీట్‌రూట్‌లో ఫ్రక్టాన్స్ అనే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొంత మందిలో జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ముఖ్యంగా.. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ఉన్నవారిలో కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి , విరేచనాలకు కారణం కావచ్చు.
రక్తపోటు అతిగా పడిపోవడం:
బీట్‌రూట్ జ్యూస్ రక్తపోటును తగ్గిస్తుంది. ఇది హైబీపీ ఉన్నవారికి మంచిది. కానీ.. సాధారణ రక్తపోటు ఉన్నవారు లేదా లోబీపీ ఉన్నవారు దీన్ని అతిగా తాగితే రక్తపోటు మరింతగా పడిపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల మైకం, నీరసం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అలెర్జీ :
కొంతమందికి బీట్‌రూట్ పడకపోవచ్చు. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద లేదా గొంతులో గరగర వంటి అలెర్జీ లక్షణాలు కనిపించవచ్చు. అలాంటివారు బీట్‌రూట్ జ్యూస్‌ను తీసుకోవడం మానుకోవాలి.
విషపూరిత లోహాలు చేరడం:
బీట్‌రూట్ నేల నుంచి విషపూరితమైన లోహాలను గ్రహించే లక్షణాన్ని కలిగి ఉంటుంది. పొలాలలో ఉన్న కొన్ని రసాయనాలు లేదా లోహాలు బీట్‌రూట్‌లోకి ప్రవేశించవచ్చు. అతిగా తీసుకుంటే.. ఇవి కాలక్రమేణా శరీరంలో పేరుకుపోయి.. ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.
ఎంత తీసుకోవాలి ?
ఈ ప్రతికూల ప్రభావాలు ఉన్నప్పటికీ.. బీట్‌రూట్ జ్యూస్ చాలా ఆరోగ్యకరమైనది. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే రోజుకు ఒక గ్లాసు లేదా వారానికి కొన్ని రోజులు మాత్రమే తీసుకోవడం మంచిది. ముఖ్యంగా.. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు లేదా ఏదైనా మందులు వాడుతున్నవారు బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడానికి ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. తగిన మోతాదులో తీసుకుంటే.. బీట్‌రూట్ జ్యూస్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.