Curd On Face: తాబ్దాలుగా చర్మ సంరక్షణలో భాగంగా చాలా మంది హోం రెమెడీస్ ఉపయోగిస్తున్నారు. వీటిలో ఒకటి పెరుగు. దీనిని ముఖానికి అప్లై చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం, విటమిన్ బి12, ప్రోటీన్లు చర్మాన్ని పోషించడమే కాకుండా చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. అయితే.. చర్మానికి ప్రయోజనాలతో పాటు హాని కూడా జరుగుతుంది. మరి పెరుగు వాడటం వల్ల చర్మానికి ఎలాంటి నష్టాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖానికి పెరుగు రాయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని లోతుగా శుభ్ర పరుస్తుంది. అంతే కాకుండా మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. తరచుగా ముఖానికి పెరుగు అప్లై చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. తద్వారా మచ్చలు, ఫైన్ లైన్లను తగ్గిస్తాయి.
పెరుగులో శీతలీకరణ లక్షణాలు ఉంటాయి. ఇవి ఎండలో మెరుపు కోల్పోయిన చర్మానికి మేలు చేస్తాయి. దీనితో పాటు.. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా కావాల్సిన తేమను అందిస్తుంది. దీని కారణంగా చర్మం మృదువుగా ఉంటుంది.
Also Read: హెయిర్ స్పా చేయించుకుంటే.. ఇన్ని నష్టాలా ?
ముఖానికి పెరుగు అప్లై చేయడం వల్ల అనేక నష్టాలు కూడా ఉన్నాయి. సున్నితమైన చర్మం ఉన్నవారికి పెరుగు అలెర్జీ కావచ్చు. ఇది దద్దుర్లు, దురద లేదా చికాకును కలిగిస్తుంది. పెరుగును నిమ్మకాయ లేదా ఇతర పదార్థాలతో కలిపి అప్లై చేయడం వల్ల చర్మంపై చికాకు వంటి సమస్యలు వస్తాయి. ఎలాంటివి జరగకుండా ఉండాలంటే.. పెరుగు ముఖానికి మొదటి సారి ఉపయోగించే ముందు దాన్ని మీ చేతిపై పరీక్షించండి. మీ చర్మం సున్నితంగా ఉంటే..పెరుగు వాడకుండా ఉండటం బెటర్.
పెరుగును ఇలా కూడా వాడొచ్చు:
1. పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్:
ఒక టీస్పూన్ పెరుగులో అర టీస్పూన్ పసుపు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఉంచి.. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా మొటిమలను తగ్గిస్తుంది. సహజమైన మెరుపును కూడా తెస్తుంది.
2. పెరుగు, శనగపిండి :
పెరుగు, శనగపిండి మిశ్రమం ట్యాన్ తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఎండ వల్ల రంగు మారిన చర్మానికి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఒక చెంచా శనగపిండిని ఒక చెంచా పెరుగుతో కలిపి పేస్ట్ లా చేసి ముఖం మీద లేదా టాన్ అయిన ప్రాంతాలపై అప్లై చేయండి. అది ఆరిన తర్వాత.. సున్నితంగా రుద్ది ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.