BigTV English

Allu Arjun : తెలుగు ఆడియన్స్‌ ఏం పాపం చేశారు… సినిమా పండుగ లేకుండా చేశావ్ కదా భాయ్…

Allu Arjun : తెలుగు ఆడియన్స్‌ ఏం పాపం చేశారు… సినిమా పండుగ లేకుండా చేశావ్ కదా భాయ్…

Allu Arjun : ప్రతి ప్రేక్షకుడికి ఇష్టమైన థియేటర్ అంటూ ఒకటి ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉండే చాలా మందికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న థియేటర్స్ లో సినిమా చూడటం అనేది ఒక ఎంజాయ్మెంట్ ఇస్తుంది. ఎన్ని థియేటర్స్లో సినిమాలు చూసినా కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సినిమాలు చూడటం అనేది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా చాలా సినిమాలు రీ రిలీజ్ అయినప్పుడు కూడా ఎక్కువమంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి వెళ్తూ ఉంటారు. మహేష్ బాబుకి సొంత థియేటర్స్ ఉన్నా కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ థియేటర్స్ లో సినిమా చూడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. సంధ్య సుదర్శన్ థియేటర్స్ కి ఒక ప్రత్యేకమైన స్థాయి, స్థానం ఉన్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ పుష్ప సందర్భంగా రేవతి అని ఒక మహిళ మరణించడంతో ఇక ఆ థియేటర్ పైన ఎన్నో ఆంక్షలు మొదలయ్యాయి.


థియేటర్ పై ఆంక్షలు

రీసెంట్ గా రీ రిలీజ్ సినిమాలకు ఏ స్థాయిలో ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం. ఆ వీడియోలు విచ్చలవిడిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఆ వీడియోలు చూసిన చాలామంది ఖచ్చితంగా ఒక సినిమా అయినా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న థియేటర్స్ లో చూడాలి అని అనుకుంటారు. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆర్య 2 సినిమాను విడుదల చేశారు. ఇప్పుడు లేనివిధంగా సంధ్యా థియేటర్ వద్ద పోలీస్ యాజమాన్యం చాలామంది ఉన్నారట. అంతేకాకుండా బ్యాగులు చెక్ చేయటం. స్కూటీ చెక్ చేయడం కూడా చేస్తున్నారు. ఇది చాలామంది ప్రేక్షకులకు నిరాశల అనిపిస్తుంది. ఎన్నో అంచనాలతో సినిమా చూసి ఎంజాయ్ చేద్దాం అని వచ్చిన ప్రేక్షకులంతా ఈ పరిణామాలతో కొద్దిపాటి విసుగు చెందుతున్నారు. ఖచ్చితంగా ఖచ్చితంగా యాజమాన్యం ప్రభుత్వం ఇలా భద్రత పరిణామాలు దృష్ట్యా చెకింగ్ చేయవచ్చు.


అల్లు అర్జున్ పై మళ్లీ ట్రోలింగ్

అయితే కొంతమంది ఈ పరిణామాలు అన్నిటిని అర్థం చేసుకుంటున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం అల్లు అర్జున్ అలా చేయడం వలనే, ప్రశాంతంగా సినిమా కూడా చూడలేకపోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. అలానే కొన్నిసార్లు పాటలు మొదలైనప్పుడు స్టేజ్ ముందుకు వెళ్లి డాన్స్ చేయటం అనేది కొంతమంది అభిమానులకు అప్పట్లో అలవాటుగా ఉండేది. కానీ ఇప్పుడు థియేటర్లో పాట మొదలవు గాని థియేటర్ యాజమాన్యం స్టేజ్ ముందుకు ఎవరు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఒకరకంగా మంచివే అయినా కూడా అభిమానులకు కొద్దిపాటి ఆనందాన్ని దూరం చేస్తున్నాయి అని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం ఆర్య 2 సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది. రీ రిలీజ్ అయిన ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో వేచి చూడాలి.

Also Read : Mahesh Babu : బోను నుంచి సింహం విడుదల… జక్కన్నకే మస్కా కొట్టిన మహేష్ బాబు

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×