BigTV English

Egg For Silky Hair: సిల్కీ హెయిర్ కోసం.. సింపుల్ టిప్స్ !

Egg For Silky Hair: సిల్కీ హెయిర్ కోసం.. సింపుల్ టిప్స్ !

Egg For Silky Hair: ఎగ్‌లో అనేక పోషకాలు ఉంటాయి. ప్రొటీన్, బయోటిన్, విటమిన్ ఎ , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను కలిగి ఉండే ఎగ్ జుట్టుకు పర్ఫెక్ట్ నేచురల్ రెమెడీ. ఎగ్ జుట్టుకు అప్లై చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఇందులోని పోషకాలు జుట్టును దృఢంగా, మృదువుగా మారుస్తాయి. అంతే కాకుండా పెరుగు తేమను అందిస్తుంది.


ఎగ్ తో పాటు కొబ్బరి నూనె వేసి మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం ద్వారా డీప్ కండిషనింగ్ అందుతుంది.అంతే కాకుండా ఈ మిశ్రమంలో నిమ్మరసం వాడటంద్వారా చుండ్రును తొలగిపోతుంది.మరి ఈ అన్ని పదార్థాలతో హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకుని వాడుకోవాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ లోని పచ్చసొన జుట్టుకు లోతైన ఆర్ద్రీకరణను అందిస్తుంది.అదనపు నూనెను సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా ఎగ్ జుట్టును ఒత్తుగా మార్చడంతో పాటు చిట్లకుండా చేయడంలో సహాయపడుతుంది. ఎగ్ నుంచి తయారు చేసిన హెయిర్ మాస్క్‌లు జుట్టు పోషణనిచ్చి , జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.


ఎగ్ , పెరుగుతో హెయిర్ మాస్క్: ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి ఒక ఎగ్ తీసుకుని అందులో 4- 5 టేబుల్ స్పూన్త పెరుగు వేసి మిక్స్ చేయాలి. తర్వాత దీనిని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత వాష్ చేయాలి.దీని ప్రభావం మీకు కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. తరుచుగాదీనిని వాడటం వల్ల జుట్టు సిల్కీగా మారుతుంది.

గుడ్డు, తేనె, ఆలివ్ నూనెతో హెయిర్ మాస్క్:
1 గుడ్డు, 1 టేబుల్ స్పూన్ తేనె, 3 గటేబుల్ స్పూన్ల ఆలివ్ నూనెను బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీనిని జుట్టుకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇది జుట్టును మృదువుగా , మెరిసేలా చేస్తుంది.

ఎగ్, అలోవెరా జెల్ తో హెయిర్ మాస్క్: 
2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్‌తో 1 ఎగ్ మిక్స్ చేసి అప్లై చేయండి. అనంతరం దీనిని జుట్టుకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇది డ్రై స్కాల్ప్ ను హైడ్రేట్ చేసి జుట్టుకు చల్లదనాన్ని ఇస్తుంది.

ఎగ్, నిమ్మ రసంతో హెయిర్ మాస్క్:
1 గుడ్డులో 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేయాలి. తర్వాత దీనిని జుట్టుకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇది జుట్టును లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా చుండ్రును కూడా తొలగిస్తుంది.

Also Read: మీ స్కిన్ 10 నిమిషాల్లోనే మెరిసిపోవాలా ? అయితే ఇలా చేయండి

ఎగ్ , మెంతి పొడితో హెయిర్ మాస్క్:
గుడ్డు, మెంతి పొడి కలిపి పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత షాంపైతో వాష్ చేయండి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఎగ్, ఉల్లిపాయ రసంతో హెయిర్ మాస్క్:
3 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసంలో ఒక ఎగ్ వేసి మిక్స్ చేయాలి. తర్వాత దీనిని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇది జుట్టు పరిమాణాన్ని పెంచడంతో పాటు మూలాలను పోషణను అందిస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×