Pushpa 2 Vs HHVM: ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయో.. అప్పటి నుంచే అల్లు అర్జున్ (Allu Arjun), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కూటమి తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేయగా.. ఆ సమయంలో తన మేనమామ పవన్ కళ్యాణ్ కు అండగా నిలవకుండా.. వైసీపీ అభ్యర్థి అయిన శిల్పా రవిచంద్ర రెడ్డికి అల్లు అర్జున్ సపోర్ట్ ఇచ్చారు. అంతేకాదు ఆయన తరఫున ప్రచారం కూడా చేశారు. ఇక అప్పటి నుంచే వారిద్దరి మధ్య కోల్డ్ వార్ జరగగా.. ఇటు వారి అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చ సాగుతోంది.
పుష్ప 2 Vs హరిహర వీరమల్లు..
ఆ కారణంగానే.. ‘పుష్ప 2’ సినిమా రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్టు చేసినా.. పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఇద్దరి మధ్య సమస్య సర్దుమనిగిందని.. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు లేవని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది. ముఖ్యంగా పుష్ప 2 మొదటిరోజు కలెక్షన్లను హరిహర వీరమల్లు బీట్ చేస్తారా? అనే ప్రశ్న అందరిలో మొదలైందని చెప్పవచ్చు.
టికెట్టు ధరలు పెంచుతూ జీవో జారీ చేసిన కూటమి ప్రభుత్వం..
అసలు విషయంలోకి వెళ్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం (AM Ratnam) నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్గా నటిస్తోంది. జ్యోతి కృష్ణ (Jyoti Krishna) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 24 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ సినిమాపై ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు సినిమాకి ఆంధ్రాలో టికెట్లు రేట్లు పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. అలా సింగిల్ స్క్రీన్స్ లోయర్ క్లాస్ రూ.100 , అప్పర్ క్లాస్ లో రూ.150 పెంచారు . మల్టీప్లెక్స్ లో ఏకంగా రూ.200 పెంచుతూ జీవో కూడా జారీ చేశారు. ఈ లెక్కను చూసుకుంటే సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ధర రూ.297, మల్టీప్లెక్స్ లో రూ.377 అయింది.
ఓకే తరహాలో టికెట్ ధరలు, థియేటర్స్ కేటాయింపు..
అయితే అటు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాకి కూడా ఏపీలో ఇవే ధరలు కొనసాగాయి. అలాగే పుష్ప 2కి ఏ స్థాయిలో థియేటర్స్ కేటాయించారో.. ఏపీవ్యాప్తంగా హరిహర వీరమల్లుకి కూడా అంతే స్థాయిలో కేటాయింపులు జరుగుతున్నాయి.
పుష్ప 2 డే వన్ కలెక్షన్స్ ను హరిహర వీరమల్లు బ్రేక్ చేస్తాడా?
ఈ క్రమంలోనే ఒక్క ఆంధ్రాలో అల్లు అర్జున్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీట్ చేయగలడా అనే చర్చ ట్రేడ్ వర్గాలలో నడుస్తోంది. హరిహర వీరమల్లు టికెట్ రేట్ల పెంపుతో పాటు ప్రీమియర్ టికెట్ ధర రూ.600 ఫిక్స్ చేశారు. బ్రో సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాతో రాబోతున్నారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ను బ్రేక్ చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో అటు అల్లు అర్జున్ ఇటు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోందని చెప్పవచ్చు. ఇక ఈ వార్ లో నెగ్గేది ఎవరో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
ALSO READ:Pawan Kalyan :వీరమల్లు సినిమాపై డిస్ట్రిబ్యూటర్స్ కంప్లైంట్… నైజాంలో రిలీజ్ అవడం ఇక కష్టమేనా?