Beautiful Skin: ప్రస్తుత కాలంలో చాలా మంది అమ్మాయిలు.. అనేక చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖంపై మొటిమలు రావడం, మచ్చలు ఏర్పడటం, చిన్న వయసులోనే పెద్దవారిగా కనపిస్తుంటారు. పైగా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. ఖచ్చితంగా బయటకు వెళ్ళాల్సిందే. ఇక బయట దుమ్మూ, ధూళి, ఎండ, ఒత్తిడి కారణంగా చర్మం కమిలిపోవడం, ఫేస్ డల్‌గా, నల్లగా కనపిస్తుంటుంది. కాబట్టి ఐస్ క్యూబ్స్‌తో ప్రతిరోజు ఇలా చేయండి. తక్షణమే ఉపశమనం లభిస్తుంది. ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐస్‌క్యూబ్స్‌తో మసాజ్
ప్రయాణంలో బయటకు వెళ్లొచ్చి అలసటగా కనపిస్తే.. ఐస్ ముక్కలతో మసాజ్ చేయండి. ఫేస్ తాజాగా కనపిస్తుంది. అంతేకాదు ముఖంపై మురికి కూడా తొలగిపోతుంది.
ఐస్‌క్యూబ్స్, రోజ్ వాటర్
పరిశుభ్రమైన నీటిలో రోజ్ వాటర్ కలిపి ఐస్‌క్యూబ్స్ తయారు చేసుకోవాలి. వీటిని ప్రతిరోజు ఉదయం, రాత్రి సమయంలో ముఖంపై 10 నిమిషాలు మసాజ్ చేయండి. ముఖంపై మొటిమలు, మృతకణాలను తొలగించి, కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
కీరదోస, ఐస్‌క్యూబ్స్‌తో మసాజ్
కీరదోస రసంలో.. కొంచెం వాటర్ కలిపి ఐస్‌క్యూబ్స్ లాగా తయారు చేసుకోవాలి. వీటిని ప్రతిరోజు ఉదయం 20 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ముఖంపై మురికి తొలగిపోయి, మిలమిల మెరుస్తుంది.
నిమ్మరసం, ఐస్‌క్యూబ్స్‌తో మసాజ్
నిమ్మరసంలో వాటర్‌ను కలిపి ఐస్‌క్యూబ్స్ లాగా తయారు చేసుకోవాలి. వీటిని ప్రతిరోజు వీలు కుదిరినప్పుడల్లా.. ముఖంపై మసాజ్ చేయండి. నిమ్మలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి.. ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గించి తాజాగా ఉండేలా చేస్తుంది.
అలోవెరాజెల్, ఐస్‌క్యూబ్స్
అలోవెరాజెల్, ఐస్‌క్యూబ్స్ కలిపి మెత్తగా మిక్సీ పట్టండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని.. 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో వాష్ చేసుకోండి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే.. మొటిమలు తగ్గిపోయి చాలా అందంగా కనపిస్తారు.
నల్లటి వలయాలకు కాఫీ కలిపిన ఐస్‌క్యూబ్స్
ముఖంపై నల్లటి వలయాలు ఉన్నట్లైతే.. కాఫీ కలిపిన ఐస్ క్యూబ్స్‌తో మసాజ్ చేయండి. ఇలా ప్రతిరోజు చేస్తే.. వారంలోనే మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి.
దాల్చిన చెక్క, ఐస్‌క్యూబ్స్‌తో మసాజ్
ముందుగా దాల్చిన చెక్కను వాటర్‌లో కలిపి.. ఐస్‌క్యూబ్స్ తయారు చేసుకోండి. వీటిలో యాంటీ బాక్టీరియల్ కణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేసి, కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
కొబ్బరి నీళ్లతో కలిపిన ఐస్‌క్యూబ్స్
కొబ్బరి నీళ్లను ఐస్‌క్యూబ్స్ లాగా తయారు చేసుకుని.. ప్రతిరోజు మసాజ్ చేసుకోండి. డల్‌గా ఉన్న ముఖాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది. నిత్యం తాజాగా ఉండేలా చేస్తుంది.
Also Read: పాలతో రోజూ ఇలా చేస్తే.. అందమైన మెరిసే చర్మం మీ సొంతం
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.