Choi Jung woo: ప్రముఖ సౌత్ కొరియన్ నటుడు చోయ్ జంగ్ వూ(Choi Jung woo) అకస్మాత్తుగా మరణించారు. ఈయన తన 68వ ఏటా మరణించడంతో ఒక్కసారిగా ఈయన అభిమానులు షాక్ కు గురి అవుతున్నారు. మరణ వార్తను అధికారకంగా ఏజెన్సీ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ ధ్రువీకరించింది. చోయ్ నేడు (మే 27) న మరణించాడన్న వార్త నిజమేనని అయితే ఆయన మరణానికి కారణం ఇంకా తెలియదని ఏజెన్సీ బ్లెస్ ప్రకటించింది.ఇలా చోయ్ మరణ వార్త బయటకు రావడంతో ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారా? లేక ఇతర సమస్యల కారణంగా మరణించారా అన్న విషయం మాత్రం తెలియడం లేదు. చోయ్ జంగ్ మరణానికి కారణం ఏంటో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈయన మరణ వార్త తెలియడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
చోయ్ జంగ్ విషయానికి వస్తే..
1975లో ది లైఫ్ ఆఫ్ యాన్ యాక్టర్ అనే రంగస్థలం నాటకం ద్వారా తన సినీ కెరియర్ ప్రారంభించారు. ఇక ఈయన సినిమా ఇండస్ట్రీలోకి టెలివిజన్ రంగంలోకి రాకముందే టోంగ్యాంగ్ బ్రాడ్‌కాస్టింగ్‌కు వాయిస్ యాక్టర్‌గా కూడా పనిచేశారు. ఇక చోయ్ నటించిన సినిమాలలో ఆయనకు సిటీ హంటర్ సినిమాలోని తన పాత్ర ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన సినిమాలతో పాటు స్టేజి షోలపై కూడా నటిస్తూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.
గాడ్స్, క్విజ్ సిరీస్, టూ కాప్స్, పబ్లిక్ ఎనిమీ 2, బ్రిలియంట్ లెగసి, ప్రాసిక్యూటర్ ప్రిన్సెస్, మిడాస్, మాస్టర్ సన్స్,టైరెంట్,ది లెజెండ్ ఆఫ్ ది బ్లూ సీ వంటి సినిమాలు వెబ్ సిరీస్ అల్లో కూడా నటించి ఎంతో మంచి ఆదరణ పొందారు.1990లో, చోయ్ సియోల్ థియేటర్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రైజ్ అందుకున్నారు. టుడే నాటకంలో భాగంగా చోయ్ నటించిన పాత్రకు గాను ఆయనకు 36వ డాంగ్-ఎ థియేటర్ అవార్డులలో ఉత్తమ నటుడిగా అవార్డు కూడా లభించింది.ఇలా ఈయన సినిమా రంగంలో మాత్రమే కాకుండా, వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. చోయ్ పలు కెమికల్ కెమికల్ కంపెనీలతోపాటు, హాస్పిటల్స్ కూడా రన్ చేస్తూ వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలోనూ వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకొని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన చోయ్ అకాల మరణం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. మరి ఈయన మరణానికి గల కారణం ఏంటో తెలియాల్సి ఉంది.