Food For Sugar Patients: ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం చాలా ముఖ్యం. బ్రేక్ ఫాస్ట్ చేస్తేనే రోజంతా మనం యాక్టీవ్ గా ఉంటాం. కానీ కొంత మంది దీనిని అంతగా పట్టించుకోరు. సమయానికి తనరు. సమతుల్య, పోషకాహారం మన మొత్తం ఆరోగ్యంతో పాటు శరీర అభివృద్ధికి చాలా అవసరం. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, మీరు తినే ఆహారం పట్ల పూర్తి శ్రద్ధ వహించడం మరింత ముఖ్యం. మరి డయాబెటిక్ పేషెంట్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఏయే ఆహారాలను చేర్చుకోవాలనే విషయాను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్లు:
అల్పాహారంలో గుడ్లు తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. గుడ్లు చాలా పోషకాలను కలిగి ఉంటాయ. ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఉడికించిన గుడ్లు ప్రతి రోజు తినవచ్చు.
నట్స్:
మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే మీ ఆహారంలో బాదం, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్‌ను చేర్చుకోండి. వీటిని స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు. బాదంలో మెగ్నీషియం ఉంటుంది.ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒమేగా-3 వాల్‌నట్స్‌లో ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు మీ ఆహారంలో చియా విత్తనాలు, అవిసె గింజలను కూడా చేర్చుకోవచ్చు.
పెరుగు:
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మన పొట్టకు చాలా మేలు చేస్తాయి. ఇందులో ప్రోటీన్, కాల్షియం ఉన్నాయి. ఇది మన ఎముకలకు మేలు చేస్తుంది. ప్రతిరోజు అల్పాహారంలో పెరుగు తీసుకోండి. వీటిలో నట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా కలిపి తినవచ్చు.
పండ్లు:
పండ్లలో అనేక విటమిన్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శక్తి పుష్కలంగా లభిస్తుంది. మీరు షుగర్ పేషెంట్ అయితే ఆరెంజ్, యాపిల్, బ్లాక్‌బెర్రీస్ వంటి పండ్లను తీసుకోవాలి. ఇవి బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. ఇవి మీ చర్మాన్ని కూడా చాలా మేలు చేస్తాయి.
Also Read: కంటి చూపును మెరుగుపరిచే చిట్కాలు
ఓట్స్:
ఓట్స్‌లో ఫైబర్ ఉంటుంది. ఓట్స్ తినడం వల్ల మీ పొట్ట ఎక్కువ సేపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది చాలా ఆరోగ్యకరమైనది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. అందుకే తరుచుగా మీు బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తినడం అలవాటు చేసుకోండి.