Chamala Kiran Kumar Reddy: ఢిల్లీ సీఎం అతిశీ నిన్న మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. నిన్న సీఎం అతిశీ మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో ఎన్నికల్లో పోరాడేందుకు రూ.40లక్షల ఖర్చు అవుతోందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏనాడు తప్పు చేయలేదని మీడియా సమావేశంలో చెప్పారు. ఎన్నికల్లో పోరాడేందుకు తనకు రూ.40 లక్షలు అవసరమని.. డబ్బును విరాళంగా అందించడానికి ఆన్‌లైన్ లింక్‌ను కూడా అతిశీ విడుదల చేశారు. తమ పార్టీ పదేళ్లుగా ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పటికీ రూపాయి కూడా అవినీతి లేదని చెప్పుకొచ్చారు.
గత ఎన్నికల్లో మాదిరిగానే ప్రజల మద్దతుతో ఈ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ఆమె అన్నారు. బీజేపీ నేతలు వారి స్నేహితుల నుంచి, ప్రభుత్వ కాంట్రాక్టుల ద్వారా కావాల్సినంత డబ్బును వసూలు చేసి ఉండవచ్చని, దీంతో ఆ పార్టీ నేతలు ఎన్నికల్లో పోటీ చేయడానికి నిధులు సేకరించాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. కాగా, ఆప్ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియా కూడా ఇప్పటికే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాంను ప్రారంభించారు. తన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి ఆర్థిక సాయాన్ని కోరారు. ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read: Hyderabad Kite festival: హైదరాబాద్‌లో పతంగుల జోరు.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కైట్ ఫెస్టివల్
అయితే.. సీఎం అతిశీ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ కవిత సౌత్ గ్రూప్ లిక్కర్ స్కామ్ వల్లనే ఆప్ కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సౌత్ గ్రూప్ గనుక ఆ రోజు ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెట్టుబడి పెట్టకపోయి ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. గతంలో రూ.100 కోట్లు తెలంగాణకు చెందిన సౌత్ గ్రూప్ ద్వారా ఢిల్లీ ఎలక్షన్ల కోసం వెళ్లాయని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ వల్లనే గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. తాము స్వచ్ఛందంగా రాజకీయాలు చేస్తామని.. ఎటువంటి అవినీతికి పాల్పడమని సీఎం అంటున్నారు.. అయితే అదేవిధంగా ఎన్నికలలో పాల్గొనాలని.. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు.