Numerology Money Saving Kids| పిల్లలు అడిగిన ప్రతిదీ కొనివ్వాలని తల్లిదండ్రులు అనుకుంటారు. అయితే, కొంతమంది పిల్లలు చేతికి డబ్బులు రాగానే నచ్చిన వస్తువులు కొనేస్తారు. మరికొందరు మాత్రం తమకు ఇచ్చిన పాకెట్ మనీ కూడా జాగ్రత్తగా దాచుకుంటారు. అవసరమైన వస్తువు కొనాలన్నా బాగా ఆలోచిస్తారు.
చిన్న వయసులోనే డబ్బు విలువను గుర్తించి, పొదుపు చేయడానికి ఇష్టపడతారు. న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని మూలాంకాలు ఉన్న పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ మూడు మూలాంకాల పిల్లలు ఆర్థిక విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తారని న్యూమరాలజీ చెబుతోంది. ఆ మూలాంకాల గురించి ప్రత్యేకతల ఏమిటో తెలుసుకుందాం.
ఏ నెలలోనైనా 4, 13, 22 లేదా 31 తేదీల్లో పుట్టిన పిల్లల మూలాంకం 4 అవుతుంది. న్యూమరాలజీ ప్రకారం.. మూలాంకం 4కు రాహువు అధిపతి. ఈ మూలాంకంలో పుట్టిన పిల్లలు భిన్నంగా ఆలోచిస్తారని, ఆచరణాత్మకంగా వ్యవహరిస్తారు. ఈ పిల్లలు చిన్నప్పటి నుంచే డబ్బు విలువను అర్థం చేసుకుంటారు. చేతికి వచ్చిన పాకెట్ మనీ మొత్తాన్ని వెంటనే ఖర్చు చేయరు. కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకుంటారు. వీళ్లకు ఏదైనా బొమ్మ కొనాలనిపించినా వెంటనే కొనరు. ముందుగా డబ్బు పొదుపు చేసి, అవసరమైనప్పుడు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటారని న్యూమరాలజీ చెబుతోంది.
ఏ నెలలోనైనా 6, 15 లేదా 24 తేదీల్లో పుట్టిన పిల్లల మూలాంకం 6 అవుతుంది. న్యూమరాలజీ ప్రకారం.. ఈ మూలాంకానికి శుక్రుడు అధిపతి.
శుక్రుడిని అందం, విలాసం, సౌకర్యాలు, భౌతిక సుఖాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ మూలాంకం పిల్లలకు అందమైన వస్తువులు, మంచి నాణ్యత కలిగిన వస్తువులు కొనడం ఇష్టం. అయితే, వీరు ప్రతిసారీ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయరు. తమకు నచ్చిన వస్తువులు కొనాలనుకున్నప్పటికీ కొంత మొత్తాన్ని పొదుపు చేస్తారు. అవసరాలు, ఇష్టాలు రెండింటినీ సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని న్యూమరాలజీ చెబుతోంది.
Also Read: చిన్నపిల్లల్లో మధుమేహం.. తల్లిదండ్రులు ఈ లక్షణాలు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
మూలాంకం 8కు శని అధిపతి. న్యూమరాలజీలో శనిగ్రహాన్ని క్రమశిక్షణ, సహనం, కష్టపడే తత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ మూలాంకంలో పుట్టిన పిల్లలు ఓపికగా వ్యవహరిస్తారు. తమకు నచ్చిన వస్తువు వెంటనే కావాలని పట్టుబట్టకుండా, దానికోసం డబ్బు దాచుకుంటారు. పాకెట్ మనీని అవసరానికి మించి ఖర్చు చేయకుండా జాగ్రత్తపడతారు. చిన్న చిన్న మొత్తాలు కూడబెట్టి, తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు. 8, 17 లేదా 26 తేదీల్లో పుట్టిన పిల్లల మూలాంకం 8 అవుతుంది.
Also Read: న్యూమరాలజీ.. ఈ తేదీల్లో జన్మించిన అబ్బాయి అల్లుడిగా దొరికితే అత్తమామలకు అదృష్టం పట్టినట్లే
న్యూమరాలజీ ప్రకారం.. ఈ మూడు మూలాంకాల పిల్లల్లో పొదుపు చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, మూలాంకాల ఆధారంగా ఆర్థిక అలవాట్లను కచ్చితంగా నిర్ధారించలేము. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు డబ్బు విలువ గురించి నేర్పించాలి. పాకెట్ మనీలో కొంత పొదుపు చేయడం, అవసరమైన వస్తువులకే ఖర్చు చేయడం అలవాటు చేయాలి. ఈ విధంగా చిన్నతనం నుంచే పిల్లల్లో ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది.