BigTV English
Advertisement

Pawan – Chiru : అన్నదమ్ముల పరిస్థితి సేమ్ టూ సేమ్ కష్టాలు… అంతా సీజీ దయ

Pawan – Chiru : అన్నదమ్ముల పరిస్థితి సేమ్ టూ సేమ్ కష్టాలు… అంతా సీజీ దయ

Pawan – Chiru : మెగా కంపౌండ్ నుంచి ఈ మధ్య భారీ సినిమాలేం రాలేవు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద చతికిల పడిపోయింది. అంతే కాక, ఫేక్ కలెక్షన్లు అంటూ అప్రతిష్టను కూడా మూటగట్టుకుంది. దీని తర్వాత మెగా కంపౌండ్ నుంచి యే ఒక్క సినిమా కూడా రాలేదు.


మెగా ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్న సినిమాలు ఒకటి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ. మరొకటి పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు. ఈ రెండు సినిమాల కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ రెండు సినిమాలు వాయిదా పడుతూనే ఉన్నాయి.

విశ్వంభర పరిస్థితి ఇది…


జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఈ విశ్వంభర మూవీ ఉంటుందని డైరెక్టర్ చెప్పడంతో, సినిమాపై హోప్స్ పెట్టుకున్నారు. నిజానికి ఈ మూవీ 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, అదే టైంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ వచ్చింది. కొడుకు మూవీ కోసం అంటూ విశ్వంభర ను వాయిదా వేశారు. ఆ టైంలో… సినిమాలో సీజీ వర్క్ ను ఛేంజ్ చేయాలని అనుకున్నారు. అలా స్టార్ట్ అయినా… వర్క్ ఇంకా అవ్వలేదు.

విశ్వంభర తాజా అప్డేట్…

విశ్వంభరకు సంబంధించి ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటంటే…
ఈ సినిమా సీజీ వర్క్ మరో రెండు మూడు రోజుల్లో పూర్తి అవుతుందట. రెండు మూడు రోజుల్లో పూర్తి అయితే, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయొచ్చు. కానీ, చిరంజీవి దానికి ఒప్పుకోవడం లేదట. సీజీ వర్క్ పూర్తి అయిన తర్వాత మళ్లీ ఏమైనా ఛేంజెస్ ఉంటే చేయాలని.. ఎలాంటి పెండింగ్ వర్క్ లేదని ఫిక్స్ అయ్యాకే రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఇవ్వాలని అన్నారట.

ఇప్పుడు రిలీజ్ డేట్ ఇచ్చి.. తర్వాత సీజీ వర్క్ నచ్చకపోతే.. మళ్లీ రిటర్న్ చేసి, లేట్ అవ్వడం, మళ్లీ వాయిదా వేయడం లాంటి పరిస్థితులు ఉండొద్దు అని చిరు అన్నారట.

హరి హర వీరమల్లు పరిస్థితి ఇది…

ఎప్పుడో 2020లో స్టార్ట్ చేసిన హరి హర వీరమల్లు మూవీకి రిలీజ్ యోగం 2025లో దొరికింది. ఇటీవలే షూటింగ్ అయిపోయింది. ఇక్కడ కూడా సీజీ వర్కే పెండింగ్‌లో ఉండిపోయింది. దీని వల్లే వాయిదా పడుతూ వస్తుంది. జూన్ 12న ఫైనల్ రిలీజ్ డేట్ అని చెప్పారు. కానీ, ఇప్పుడు ఆ డేట్ నుంచి కూడా వీరమల్లు తప్పుకుంటుందని సమాచారం.

సీజీ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. సీజీ వర్క్ పూర్తి అయితే మూవీ ఫైనల్ ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది. అప్పుడే ట్రైలర్ కట్ ఉంటుంది. ఆ ట్రైలర్ పైనే బిజినెస్ ఆధారపడి ఉంది. అందుకే సీజీ వర్క్ పూర్తి అయ్యే వరకు సినిమాను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారట.

ఇలా… అన్నదమ్ముల ఇద్దరి సినిమాలు సీజీ వర్క్ వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ సీజీ వర్క్ పరిస్థితి ఏంటో తెలీదు కానీ, మెగా ఫ్యాన్స్ ఎదురుచూపులు మాత్రం తగ్గడం లేదు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×