CSK VS MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతారు. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో రెండు మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇందులో ఎవరు ఊహించని విధంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఇక ఇవాళ మధ్యాహ్నం పూట జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై సన్రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals ) గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ఇవాళ… సాయంత్రం పూట చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది.
Also Read: SRH VS RR: వీళ్ళు కాటేరమ్మ కొడుకులు…RRపై 44 పరుగుల తేడాతో విజయం
ఈ మూడవ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో ముంబైని మట్టి కల్పించింది చెన్నై సూపర్ కింగ్స్. వాస్తవానికి ఈ మ్యాచ్లో మొదట ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేసింది. ముంబై మొదట బ్యాటింగ్ చేసి హైదరాబాద్ తరహాలో భారీ స్కోర్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ప్లేయర్లు పెద్దగా రాణించకపోవడంతో నిర్ణిత 20 ఓవర్లలో… తేలిపోయింది ముంబై ఇండియన్స్. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన ముంబై ఇండియన్స్ 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అయితే ఆ లక్ష్యాన్ని అవలీలగా చేదించింది చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్న ప్లేయర్ లందరూ రాణించడంతో ఆ స్వల్ప లక్ష్యాన్ని.. చేదించి మొదటి విక్టరీ నమోదు చేసుకుంది సీఎస్కే. చివరలో మహేంద్రసింగ్ ధోనీకి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికీ… దూకుడు చూపించలేదు. సైలెంట్ గా తన పని తాను చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా… 9 వికెట్లు నష్టపోయిన ముంబై ఇండియన్స్ 155 పరుగులు చేసింది.
Also Read: SRH VS RR: బ్యాటింగ్ చేయనున్న SRH… 300 కొట్టడం పక్కా!
ఇక ఈ ఇన్నింగ్స్ లో… రోహిత్ శర్మ డక్ అవుట్ కాగా రికెల్టన్ 13 పరుగులు చేసి రాణించాడు. ఆ తర్వాత వచ్చిన విల్ జాక్సన్ 13 పరుగులు అలాగే సూర్య కుమార్ యాదవ్ 29 పరుగులు చేసి దుమ్ము లేపారు. అటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 29 పరుగులు చేసి రాణించాడు. ఇందులో ఒక సిక్సర్ తో పాటు రెండు బౌండరీలు కూడా ఉన్నాయి. ఇక ముంబై ఇండియన్స్ లో మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. చివర్లో దీపక్ చాహర్ 15 బంధువుల్లో 28 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో రెండు సిక్సర్లు అలాగే రెండు బౌండరీలు కూడా ఉన్నాయి. అటు చేజింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట తడబడింది. కానీ ఆ జట్టు రచిన్ రవీంద్ర… ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. 45 బంతుల్లోనే 65 పరుగులు చేసి రఫ్పాడించాడు. ఆ తర్వాత ఋతురాజు గైక్వాడ్… 26 బంతుల్లోనే 53 పరుగులు చేసి దుమ్ము లేపారు. ఇలా జట్టు సమీక్షగా ఆడడంతో… చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.