BigTV English

OTT Movie : పెళ్ళాన్ని వదిలేసి మేనల్లుడితో అలాంటి పని … ఈ మూవీని చూడాల్సిందే భయ్యా

OTT Movie : పెళ్ళాన్ని వదిలేసి మేనల్లుడితో అలాంటి పని … ఈ మూవీని చూడాల్సిందే భయ్యా

OTT Movie : తిరుచ్చిలోని ఒక సాంప్రదాయ కుటుంబంలో, ఇన్బా తన అక్క గిరిజా, ఆమె కొడుకు నీలన్ అలియాస్ ‘లడ్డు’ పట్ల అపారమైన ప్రేమను చూపిస్తాడు. అక్కకు సంతానం కలిగే వరకు ఎదురైన కష్టాలు ఇన్బాను కలిచివేస్తాయి. ఇప్పుడు లడ్డును తన ప్రాణంగా చూసుకుంటాడు. కానీ ఇన్బా పెళ్లి చేసుకున్న డాక్టర్ రేఖాకి, ఈ బంధం వల్ల ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అవుతుంది. ఇది కుటుంబంలో గందరగోళానికి దారితీస్తుంది. ఇంతకీ  రేఖాతో ఇన్బా కలసి ఉంటాడా ? రేఖా కుటుంబ కలహాలు సృష్టిస్తుందా ? ఈ ఫ్యామిలీ ఎటువంటి సమస్యలు ఎదుర్కుంటుంది ? ఈ సినిమా పేరు ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి లోకి వెళితే


స్టోరీలోకి వెళితే

ఈస్టోరీ తిరుచ్చిలో ప్రారంభమవుతుంది. అక్కడ గిరిజా (స్వసిక), ఆమె భర్త రవి (బాబా భాస్కర్) కి పెళ్ళి జరిగి పదేళ్లయినా, పిల్లలు కలగకపోవడంతో, కుటుంబంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇన్బా (సూరి)తన అక్క పట్ల అపారమైన ప్రేమతో ఆమె కష్టాలను చూసి బాధపడతాడు. చాలా సంవత్సరాల తరువాత గిరిజా గర్భవతి అవుతుంది. ఆ తరువాత నీలన్, అలియాస్ “లడ్డు” కి జన్మనిస్తుంది. ఇన్బా, లడ్డును తన ప్రాణంగా చూసుకుంటాడు. ఈ క్రమంలో ఇన్బా డాక్టర్ రేఖా (ఐశ్వర్య లక్ష్మి) ప్రేమలో పడి వివాహం చేసుకుంటాడు.


అయితే ఇన్బా లడ్డు పట్ల అతిగా ప్రేమను చూపిస్తుండటం, రేఖాకి నచ్చకుండా ఉంటుంది. రేఖా, ఇన్బాతో కొంత సమయం తనతో కూడా గడపాలని కోరుకుంటుంది. కానీ లడ్డు నిరంతరం ఇన్బాతో గడుపుతుంటే, రేఖాకి సమయం ఇవ్వలేకపోతాడు. ఆ తరువాత కుటుంబంలో చాలా గొడవలు జరుగుతాయి. చివరికి రేఖా వల్ల ఈ కుటుంబం విడిపోతుందా ? రేఖా, ఇన్బా మధ్య గొడవలు ఎలా పరిష్కారమవుతాయి? ఇన్బాతో లడ్డు రిలేషన్ ఎలా ఉంటుంది ? ఈ స్టోరీ ఏ విధంగా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ, మరో కేసులో ఇరుక్కునే తింగరోడు … ఈ క్రైమ్ కామెడీకి పొట్ట చెక్కలే

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ తమిళ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘మామన్’ (Maaman). 2025 లో వచ్చిన ఈ సినిమాకి ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వం వహించారు. దీనిని లార్క్ స్టూడియోస్‌లో కె. కుమార్ నిర్మించారు. ఈ సినిమాలో సూరి, రాజ్‌కిరణ్, ఐశ్వర్య లక్ష్మి, స్వాసిక, బాల శరవణన్, బాబా భాస్కర్, విజి చంద్రశేఖర్, నిఖిలా శంకర్, గీతా కైలాసం నటించారు. ఈ స్టోరీ మామ,అతని మేనల్లుడి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ 2025 మే 16న థియేటర్లలో విడుదలై, జూన్ 13 నుండి జీ 5 (ZEE5) లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి కడుపుబ్బా నవ్వించే కామెడీ వరకు… ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మలయాళ సినిమాలు ఇవే

OTT Movie : భర్త ఉండగానే మరో అబ్బాయితో… శోభిత ధూళిపాళని ఇంత వైల్డ్ యాంగిల్ లో ఎప్పుడూ చూసుండరు భయ్యా

OTT Movie : బిల్డింగ్ లో మర్డర్ మిస్టరీ… ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆవులిస్తే పేగులు లెక్కబెడుతుంది… ఇంటెన్స్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : బీచ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలే టార్గెట్… రెండుసార్లు జైలు నుంచి బికినీ కిల్లర్ ఎస్కేప్… పోలీసులు ఇచ్చే షాక్ కు మైండ్ బ్లా

OTT Movie: మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్.. భయంతో వణుకు పుట్టించే హారర్ సీన్లు.. ఒంటరిగా మాత్రం చూడకండి..!

OTT Movie : చస్తేనే మనుషులుగా మారే రాక్షస జీవులు… ఊరిని పట్టి పీడించే వింత శాపం… సీట్ ఎడ్జ్ హర్రర్ థ్రిల్లర్

Big Stories

×