Night Skin Care: ముఖ సంరక్షణ పగటిపూట మాత్రమే కాదు.. రాత్రిపూట కూడా తాజాగా ఉండటం ముఖ్యం. ఇందుకోసం కలబంద చాలా బాగా ఉపయోగపడుతుంది. కలబంద అనేది చర్మాన్ని చల్లబరచడానికి, మచ్చలను తొలగించడానికి అంతే కాకుండా ముఖం మెరిసేలా చేయడానికి సహాయపడే సహజ ఔషధం. చర్మం మెరుస్తూ కనిపించాలంటే రాత్రి పడుకునే ముందు కలబందతో ఏవేవి కలిపి ముఖానికి అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మృదువైన చర్మానికి కలబంద, రోజ్ వాటర్:
రోజ్ వాటర్ చర్మాన్ని టోన్ చేయడానికి సహాయపడుతుంది. కలబంద జెల్ లో రోజ్ వాటర్ కలిపి అప్లై చేసినప్పుడు.. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. చర్మం యొక్క తేమను నిర్వహిస్తుంది. దీనిని ఉపయోగించడానికి.. ఒక టీస్పూన్ కలబంద జెల్‌లో అర టీస్పూన్ రోజ్ వాటర్ కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై బాగా అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇది చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అంతే కాకుండా టానింగ్ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.
మచ్చలను పోగొట్టడానికి కలబంద, పసుపు:
పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ముఖం మీద ఉన్న మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. మీరు పసుపును కలబందతో కలిపి అప్లై చేయడం వల్ల చర్మం లోపలి నుండి శుభ్రంగా, తాజాగా కనిపిస్తుంది. దీని కోసం.. ఒక టీస్పూన్ కలబంద జెల్‌లో చిటికెడు పసుపు కలపండి. మీరు ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగేయండి. లేదా ముఖానికి అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఇది మొటిమలను తగ్గిస్తుంది. అంతే కాకుండా మచ్చలను కాంతివంతం చేస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.
తేమ కోసం కలబందతో తేనె:
తేనె చర్మాన్ని తేమగా ఉంచి, సహజమైన మెరుపును తెస్తుంది. కలబందతో కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం లోపలి నుండి తేమ అందుతుంది. ఫలితంగా ముఖం తాజాగా ఉంటుంది. దీనిని అప్లై చేయడం చాలా సులభం. దీని కోసం.. ముందుగా ఒక టీస్పూన్ కలబంద జెల్‌లో అర టీస్పూన్ తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి చేతులతో మసాజ్ చేసి, రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం ముఖం కడిగిన తర్వాత.. చర్మం మృదువుగా, తాజాగా ఉంటుంది. అంతే కాకుండా కాంతివంతంగా మారుతుంది.
Also Read: టాప్ సీక్రెట్.. జుట్టు పెరగడానికి ఈ ఒక్క ఆయిల్ వాడితే చాలు
ఇలా హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తక్కువ సమయంలోనే గ్లోయింగ్ స్కిన్ కోసం మీరు కల బందను కూడా ఉపయోగించవచ్చు. ఇవి చర్మాన్ని తెల్లగా మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా మచ్చలు లేకుండా కాంతి వంతంగా మారుస్తాయి. తెల్లటి గ్లోయింగ్ స్కిన్ కావాలని అనుకునే వారు కొన్ని రకాల నైట్ స్కిన్ కేర్ టిప్స్ పాటించడం చాలా ముఖ్యం.