Sugarcane Juice:సమ్మర్ ప్రారంభం అయింది. ఈ టైంలో చాలా మంది కూల్ డ్రింక్స్, జ్యూస్ లను తాగడానికి మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే మార్కెట్లలో చెరకు రసం బండ్లు ఎక్కడపడితే అక్కడ కనిపించడం ప్రారంభమైంది. చెరకు రసం మార్కెట్లలో సులభంగా లభించే రుచికరమైన , ఆరోగ్యకరమైన డ్రింక్ అని చెప్పొచ్చు.
చెరకు రసం తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. కానీ ఖాళీ కడుపుతో చెరకు రసం తాగడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయనే విషయాలను గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో వివరంగా తెలుసుకుందాం.
చెరకు రసంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రసంలో సహజ చక్కెర కూడా ఉంటుంది, ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడుతుంది. ఇంకో మంచి విషయం ఏమిటంటే అందులో కొలెస్ట్రాల్, కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం ఖాళీ కడుపుతో చెరకు రసం తాగడం వల్ల శరీరానికి అనేక సానుకూల ప్రయోజనాలు లభిస్తాయి.
ఖాళీ కడుపుతో చెరకు రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
చెరకు రసం జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఉదయం పూట చెరకు రసం తాగడం వల్ల మలబద్ధకం, ఆమ్లత్వం, అజీర్ణం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇందులో ఉండే ఫైబర్ కడుపును శుభ్రంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు చెరకు రసం తాగడం అలవాటు చేసుకోవాలి.
తక్షణ శక్తి వనరు:
చెరకులో సహజ చక్కెర ఉంటుంది. దీనిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల అలసట, సోమరితనం తొలగిపోయి తక్షణ శక్తిని అందిస్తుంది. చెరకు రసం మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. తరచుగా అలసటగా అనిపించినప్పుడు చెరకు రసం తాగడం చాలా మంచిది. వీటిలోని పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాకుండా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి.
కాలేయాన్ని శుభ్రం చేస్తుంది:
చెరకు రసం కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఈ రసం శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది కాబట్టి, కామెర్లు వంటి వ్యాధులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. కామెర్లు రాకుండా చేయడంలో కూడా చెరకు రసం చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also Read: ఇంట్లోనే పెరుగుతో.. ఫేషియల్ చేసుకోండిలా !
వీళ్లు చెరకు రసం తాగకూడదు:
చెరకు రసం సాధారణంగా అనేక పోషకాలు కలిగిఉండి ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో ఉయోగపడినప్పటికీ .. కొంతమంది ఈ రసం తాగకుండా ఉండాలి లేదా వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తాగాలి.
ఊబకాయంతో బాధపడేవారు చెరకు రసం తాగడం మానేయాలి.
మధుమేహంతో బాధపడేవారు చెరకు రసం తాగకూడదు లేదా వైద్యుడిని సంప్రదించిన తర్వాతే తాగాలి.
చెరకు వల్ల అలెర్జీ ఉన్నవారు ఈ రసం తాగకూడదు..లేదంటే.. దురద వంటి సమస్యలు వస్తాయి.