Eyebrows: ముఖం యొక్క అత్యంత అందమైన భాగం కళ్ళు. కను బొమ్మలు కళ్ల యొక్క అందాన్ని పెంచుతాయి. పొడవాటి , మందపాటి కను బొమ్మలు మీ కళ్ళను పెద్దవిగా ,మరింత ఆకర్షణీయంగా మార్చడమే కాకుండా, మీ ముఖానికి భిన్నమైన మెరుపును కూడా ఇస్తాయి.
మీరు కూడా పొడవాటి, మందపాటి కనుబొమ్మలను పొందాలనుకుంటే..మాత్రంకొన్ని చిట్కాలు పాటించడం అవసరం. మరి ఎలాంటి చిట్కాలు కనుబొమ్మలు దట్టంగా పెరిగేలా చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నూనె: ఐబ్రోస్ పొడవుగా మందంగా మార్చడానికి కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి కనురెప్పలకు పోషణనిచ్చి వాటిని బలపరుస్తాయి. ప్రతిరోజు పడుకునే ముందు కొబ్బరి నూనెను కనురెప్పలు, కనుబొమ్మలపై కాటన్ సహాయంతో అప్లై చేయండి.
బాదం నూనె: కనురెప్పలు పొడవుగా, మందంగా మార్చడానికి బాదం నూనె కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ ఇ , ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వెంట్రుకలను బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా వాటి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ కనురెప్పలు, కనుబొమ్మలపై బాదం నూనెను రాయండి. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
అలోవెరా జెల్ : అలోవెరా జెల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వెంట్రుకలను పోషించి వాటిని బలోపేతం చేస్తాయి. అలోవెరా జెల్ కనురెప్పలను తేమగా చేసి పొడిబారకుండా చేస్తుంది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మీ కనురెప్పలు, కనుబొమ్మలపై కలబంద జెల్‌ను అప్లై చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అందమైన నల్లటి ఐబ్రోస్ కావాలనుకునే వారు ఇలా చేయడం వల్ల ఈజీగా రిజల్ట్ ఉంటుంది.
గ్రీన్ టీ : గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి . ప్రతి రాత్రి నిద్రపోయే ముందు.. గ్రీన్ టీని మీ కనురెప్పలు, కనుబొమ్మలపై అప్లై చేయండి.
విటమిన్-ఇ ఆయిల్: విటమిన్ ఇ ఆయిల్ ఐబ్రోస్‌ను బలపరుస్తుంది. అంతే కాకుండా మరియు వాటి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు, విటమిన్ ఇ క్యాప్సూల్‌ని నూనెను మీ కనురెప్పలు , కనుబొమ్మలపై రాయండి.
ఆముదం: కనురెప్పలను పొడవుగా, మందంగా చేయడానికి ఆముదం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ కనురెప్పలు, కనుబొమ్మలపై ఆముదం రాయండి .
Also Read: రైస్ వాటర్‌తో.. మచ్చలేని చర్మం మీ సొంతం
వ్యాజిలిన్ : వ్యాజిలిన్ కనురెప్పలకు తేమను అందించి అవి పొడిబారకుండా చేస్తుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ కనురెప్పలు, కనుబొమ్మలపై
వ్యాజిలిన్ రాయండి. ఇలా అప్లై చేయడం వల్ల ఐబ్రోస్ తక్కువ సమయంలో ఒత్తుగా నల్లగా పెరుగుతాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.