Mohammad Shami: టీమిండియా మధ్య చిచ్చులు పెట్టేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన కొంతమంది పెద్దలు కుట్రలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టీమిండియా కష్టాల్లో ఉందని.. ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియాకు మహమ్మద్ షమీని పంపించాలని…. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది. మీ టీం గురించి మొదటగా చూసుకోండి అని టీమ్ ఇండియా ఫ్యాన్స్.. బాసిత్ అలీ కి కౌంటర్ ఇస్తున్నారు.
Also Read: Gautam Gambhir: టీమిండియా ఓటమికి కుట్రలు..గంభీర్ పై ట్రోలింగ్ ?
టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల్లో భాగంగా… ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది టీమిండియా. ఇప్పటికే ఈ టోర్నీలో రెండు టెస్టులు పూర్తి అయ్యాయి. ఇందులో ఒకటి టీమిండియా గెలువగా రెండవ టెస్టులో ఆస్ట్రేలియా… విజయం… సాధించింది. రెండవ టెస్టులో దారుణంగా టీమిండియా ఓడిపోయింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్స్ కు వెళ్లే టీమ్ ఇండియా దారులు మూసుకుపోయాయి.
ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో మూడవ స్థానానికి పడిపోయింది టీమిండియా. ఇందులో ఫైనల్ కు వెళ్లాలంటే కచ్చితంగా మరో మూడు టెస్టుల్లో విజయం సాధించాలి. కాబట్టి ఆస్ట్రేలియాతో జరిగే మరో మూడు టెస్టులు టీం ఇండియాకు చాలా కీలకము. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ , టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ మధ్య గొడవలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ ఇద్దరూ స్టార్ ప్లేయర్లకు బెంగళూరులోని నేషనల్ అకాడమీలో…. గొడవలు జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. మహమ్మద్ షమీ ఫిట్నెస్ విషయంలో…. రోహిత్ శర్మ తప్పుడు ప్రచారం చేస్తున్నారని… నేరుగా… మండిపడ్డారట. తాను ఫిట్నెస్ సాధించానని మహమ్మద్ షమీ చెప్పిన తర్వాతి రోజే… ఆస్ట్రేలియా టూర్ కు మహమ్మద్ షమీ రాబోడని రోహిత్ శర్మ వెల్లడించారు.
దీంతో ఈ వివాదం మళ్లీ… రాజు కోవడం జరిగింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని… న్యూజిలాండ్ సిరీస్ నుంచే ఈ గొడవలు ప్రారంభమయ్యాయి అని సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. సయ్యద్ మస్తాన్ ట్రోఫీ లో మహమ్మద్ షమ్మీ అదరగొడుతుంటే… రోహిత్ శర్మ మాత్రం అతడు ఫిట్నెస్ గా లేడని చెప్పడం కూడా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ క్రికెట్కు సంబంధించిన బాసీత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం టీమిండియా కష్టాల్లో ఉందని… ఇలాంటి సమయంలో వెంటనే ఆస్ట్రేలియా కు మహమ్మద్ షమీ ని పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగో టెస్ట్ కు మహమ్మద్ షమిని పంపిస్తే టీమిండియా కు ఎలాంటి ప్రయోజనం ఉండదని కూడా ఆయన వివరించారు. కాబట్టి ఇప్పుడే ఫ్లైట్ ఎక్కించాలని కూడా కోరారు. అయితే రోహిత్ శర్మ అలాగే మహమ్మద్ షామీ మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు బయటకు వచ్చిన తర్వాత బాసిత్ అలీ… ఇలా వ్యవహరిస్తున్నాడని టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.