Virat Anushka New Home: బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ – టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి వరల్డ్ వైడ్ ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విరాట్ తో పెళ్లి అనంతరం అనుష్క శర్మ సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇక విరాట్ విషయానికి వస్తే.. అతడు క్రీడలలో ఎంతో సంపాదిస్తున్నాడు. ఢిల్లీలో జన్మించిన విరాట్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నాడు. అయితే కేవలం ఇక్కడ మాత్రమే తనకు సొంత ఇల్లు ఉన్నట్లు గతంలో అనేకసార్లు చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ.
Also Read: Jasprit Bumrah: కమిన్స్ కు బిగ్ షాక్.. బుమ్రాకు మరో అవార్డు !
ఇక ఇప్పుడు కోహ్లీ సొంతింటి కళ సహకారం అయింది. 2023 ఆసియా కప్ కి ముందు విరాట్ కోహ్లీ – అనుష్క కలిసి అలీబాగ్ లో ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారు. విరాట్ కోహ్లీ గతంలోనే సోషల్ మీడియా వేదికగా ఈ ఇంటిని పూర్తిగా వీడియో తీసి షేర్ చేశాడు. ఆ ఇల్లు కట్టిన సంస్థ ప్రతినిధులకు సోషల్ మీడియా వేదికగా కోహ్లీ ధన్యవాదాలు తెలిపారు. తమ ఫ్యామిలీ ఏ విధంగా ఇల్లు ఉండాలని అనుకుందో.. అదేవిధంగా ఇంటి నిర్మాణం జరిగిందని ఆనందం వ్యక్తం చేశాడు.
ఎయిర్ స్పేస్, ఇంటీరియర్ డిజైన్స్ ఇలా ప్రతి ఒక్కటి తాను ఊహించిన విధంగానే ఉన్నాయని తెలిపాడు. హాలిడే హోమ్ అంటే బిజీ షెడ్యూల్ నుంచి రిలాక్స్ కావడానికి వచ్చే ఇల్లు అని.. అందుకే దీనికి తగ్గట్లుగానే ఈ ఇల్లు కట్టించుకున్నట్లు గతంలో తెలిపాడు విరాట్. పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కాలిఫోర్నియన్ కొంకన్ స్టైల్ లో ఈ ఫోర్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించారు. ఈ లగ్జరీ ఇంటి మొత్తాన్ని ఆటోమేట్ చేసేసారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ తో ఈ ఇంట్లోని కర్టైనర్లతో సహా అన్నింటిని కంట్రోల్ చేయవచ్చు.
ఈ ఇంటికి ఎత్తైన పైకప్పులు, ఇంటి చుట్టూ అద్దాల గోడలు ఉన్నాయి. లివింగ్ రూమ్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అయితే ఈ లివింగ్ రూమ్ లో టీవీ ఉండకుండా చూసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఎందుకంటే ఇంటి సభ్యులంతా కలిసి మాట్లాడుకోవడం తనకు ఇష్టమని.. అందుకే ఈ లివింగ్ రూమ్ లో టీవీ ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అందుకే ఈ హాలిడే హోమ్ లో డైనింగ్ కి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పాడు.
అయితే తాజాగా ఈ కొత్త ఇంటి గృహప్రవేశం కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ ఇంటి గృహప్రవేశం కోసం ఏర్పాట్లు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో విరాట్ కోహ్లీ – అనుష్క జంటకి సోషల్ మీడియా వేటికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఇక ఆస్ట్రేలియా తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ ముగిసిన అనంతరం విరాట్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఆస్వాదిస్తున్నాడు.
Also Read: Klaasen Six: క్లాసెన్ కొట్టిన భారీ సిక్స్.. బంతిని ఎత్తుకెళ్లిన అభిమాని.. వీడియో వైరల్!
ఇదే సమయంలో ఆధ్యాత్మిక ప్రాంతాలకు, పలు పర్యాటక ప్రాంతాలకు వెళుతున్నాడు. ఇక కోహ్లీ నూతన ఇంటి గృహప్రవేశం పూర్తయిన తర్వాత.. 12 ఏళ్ల తర్వాత కోహ్లీ మళ్లీ రంజి ట్రోఫీ ఆడ బోతున్నాడు. 2012లో ఢిల్లీ తరఫున రంజి ట్రోపీ ఆడిన కోహ్లీ.. ఇప్పుడు మరోసారి ఢిల్లీ ప్రాపబుల్స్ జట్టులో ఎంపికైనట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అశోక్ వర్మ వెల్లడించారు.
Gruh pravesh preparations started for Virat Kohli and Anushka’s new home in Alibaug. pic.twitter.com/lHTuMKk2X8
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2025