Warm Water: మనలో చాలా మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాం. అందులో ముఖ్యంగా ప్రతి రోజు ఉండే ఒళ్లు నొప్పులు. కాళ్లలో, చేతుల్లో, వెన్నులో, కొన్ని సార్లు మెడ దగ్గర కూడా నొప్పులతో బాధపడుతుంటాము. ఇవి వయసుతో సంబంధం లేకుండా చిన్న వారికి, పెద్దవారికి అని తేడా లేకుండా, మగవారికి, ఆడ వారికీ వస్తూనే ఉంటాయి. కొంత మందికి ఇది అలసట వల్ల వస్తుంది. కానీ మనం ఒక చిన్న జాగ్రత్త తీసుకుంటే ఈ నొప్పులను తగ్గించుకోవచ్చు. అది ఏమిటంటే రోజూ గోరు వెచ్చని నీరు తాగే అలవాటు ఉంటే చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
గోరు వెచ్చని నీరుకి ఒళ్లు నొప్పులకు సంబంధం ఏమిటి?
గోరు వెచ్చని నీరు తాగడం అంటే చాలా చిన్న విషయం అనిపించవచ్చు. కానీ ఇది శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది. మనం తాగే నీరు చాలా చల్లగా ఉన్నా కడుపులో సమస్యలు వస్తాయి. కానీ నీరు గోరు వెచ్చగా ఉంటే శరీరానికి సులభంగా జీర్ణం అవుతుంది. ముఖ్యంగా రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా జరిగితే శరీరంలోని కండరాలకు, ఎముకలకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలు ఎలాంటి కష్టం లేకుండా అందుతాయి. దాంతో సహజంగానే నొప్పులు తగ్గిపోతాయి.
గోరు వెచ్చని నీరు- విషపదార్థాలు
ఇంకా గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయే విషపదార్థాలు బయటకు వస్తాయి. మనం తినే ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోతే శరీరంలో టాక్సిన్స్ (విషపదార్థాలు) పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఇవి రక్తంలో చేరి ఒళ్లు నొప్పులు, అలసట, బరువు పెరగడం లాంటి సమస్యలకు కారణం అవుతాయి. కానీ గోరు వెచ్చని నీరు ఆ టాక్సిన్స్‌ను బయటకు పంపడంతో, శరీరం చాలా తేలికగా అనిపిస్తుంది.
Also Read: CSK: శ్రీనివాసన్ చేతిలోకి మళ్ళీ CSK… వచ్చే సీజన్ లో మ్యాచ్ ఫిక్సింగ్ గ్యారంటీ అంటూ ట్రోలింగ్?
వైద్యుల సలహా ఏమిటి?
గోరు వెచ్చని నీరు తాగితే శరీరంలోని గట్టిపడిన కండరాలు నెమ్మదిగా వదులుతాయి, ఒత్తిడి తగ్గుతుంది, కండరాలు రిలాక్స్ అవుతాయి. చాలా సేపు పని చేసినా, వ్యాయామం చేసినా కండరాలు గట్టి పడిపోతూ ఉంటాయి. అప్పుడు గోరు వెచ్చని నీరు తాగితే శరీరం లోపలి నుంచి వేడి పడి కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ కారణంగానే డాక్టర్లు కూడా వెన్నునొప్పి, జాయింట్ నొప్పులు ఉన్నవారికి చల్లని నీరు కాకుండా ఎప్పుడూ గోరు వెచ్చని నీరే తాగమని సూచిస్తుంటారు.
మెటబాలిజం అంటే ఏమిటి?
మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, గోరు వెచ్చని నీరు శరీరంలోని మెటబాలిజాన్ని పెంచుతుంది. అంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. దాంతో శరీరానికి శక్తి లభిస్తుంది. శక్తి తగ్గిపోతేనే ఎక్కువగా నొప్పులు వస్తాయి. కాబట్టి ఈ నీరు మన శరీరానికి ఒక సహజమైన ఔషధంలా పనిచేస్తుంది. గోరు వెచ్చని నీరు క్రమం తప్పకుండా తాగితే జాయింట్లలో ఉన్న నీరు (Joint fluid) సరిగా ఉండేలా చేస్తుంది. అదే శరీర కదలికలకు చాలా అవసరం. దాంతో మోకాళ్ల నొప్పులు, చేతుల నొప్పులు కూడా తగ్గుతాయి.
గోరు వెచ్చని నీరు ఎప్పుడు తాగాలి?
ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు తాగడం శరీరానికి మంచిది. ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత రెండు గంటలకి గోరు వెచ్చని నీరు తాగితే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. రాత్రిపూట పడుకునే ముందు కూడా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు తాగితే ఒళ్లు రిలాక్స్ అవుతుంది.
బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది
ఇది కేవలం ఒళ్లు నొప్పులు తగ్గించడమే కాకుండా, బరువు తగ్గటానికి, జీర్ణ సమస్యలు పోవటానికి, చర్మం కాంతివంతంగా మారటానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే నొప్పుల కోసం పెద్దగా మందులు వెతకకండి. చిన్న చిన్న సహజమైన మార్గాలను అలవాటు చేసుకుంటే చాలు. రోజూ గోరు వెచ్చని నీరు తాగే అలవాటు పెంచుకోండి. మీరు ఇలా అలవాటు చేసుకుంటే నెమ్మదిగా, ఒకొక్కటిగా, కొంతకాలం తర్వాత మీ శరీర నొప్పులు తగ్గిపోతాయి.