E-Paper
Advertisement

ఒక్క పెగ్గే కదా అని చిల్ అవుతున్నారా? లోపల మీ అవయవాలు ఏమవుతున్నాయో తెలుసా?

ఒక్క పెగ్గే కదా అని చిల్ అవుతున్నారా? లోపల మీ అవయవాలు ఏమవుతున్నాయో తెలుసా?
Advertisement

Alcohol Health Risks: మద్యపానం అనగానే చాలామంది ఎక్కువ మోతాదులో తాగేవారి గురించే ఆలోచిస్తారు. రోజూ కాస్తో కూస్తో లేదా ఎప్పుడో ఒకసారి పరిమితంగా తాగితే ఏమీ కాదు అని భ్రమపడుతుంటారు. కానీ, ఇటీవలి అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల అభిప్రాయాల ప్రకారం.. చాలా తక్కువ మోతాదులో మద్యం సేవించడం కూడా శరీరానికి హాని కలిగిస్తుందని తెలుస్తోంది.

క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది..

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. మద్యం అలవాటు వల్ల రకరకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. రోజుకు ఒక గ్లాసు లేదా అంతకంటే తక్కువ పరిమాణంలో తీసుకున్నా నోరు, గొంతు, కాలేయం, రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్యంలోని టాక్సిన్లు కణాల DNAను దెబ్బతీసి, క్యాన్సర్ కణాల పెరుగుదలకు దోహదపడతాయి.

గుండె ఆరోగ్యంపై ప్రభావం..

Advertisement

గతంలో కొద్దిగా వైన్ తాగితే గుండెకు మంచిదని ప్రచారం జరిగేది. అయితే, ఆధునిక పరిశోధనలు ఈ వాదనను తోసిపుచ్చాయి. రోజూ పరిమితంగా తాగినా కూడా రక్తపోటు పెరగడం, గుండె కొట్టుకునే వేగంలో తేడాలు రావడం, స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి గుండెను కాపాడుకోవడానికి మద్యానికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

Also Read: అబ్బో.. Wi-Fi పాస్‌వర్డ్ లేకుండా కనెక్ట్ అవ్వడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయా?

మానసిక సమతుల్యతకు దెబ్బే..

Advertisement

ఆల్కహాల్ తీసుకుంటే బాగా నిద్ర పడుతుందని కొందరు భావిస్తారు, కానీ అది నిజం కాదు. మద్యం వల్ల లభించే నిద్ర నాణ్యమైనది కాదు. ఇది గాఢ నిద్రను పాడుచేసి, మరుసటి రోజు అలసటగా అనిపించేలా చేస్తుంది. అంతేకాకుండా.. మెదడులోని రసాయనాల సమతుల్యతను దెబ్బతీసి ఆందోళన, ఒత్తిడిని మరింత హెచ్చరిస్తుంది.

శరీర అవయవాలపై భారం..

మద్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాలేయం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. పరిమితంగా తాగినప్పటికీ కాలేయంలో కొవ్వు చేరడం, రోగనిరోధక శక్తి తగ్గడం, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎలాంటి మోతాదులోనైనా సరే ఆల్కహాల్‌కు దూరంగా ఉండటమే ఏకైక మార్గం.

Also Read: 7000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. వివో V70 FE 5G పై ఊహించని ప్రైస్ డ్రాప్!

Related News

ఇల్లు చిన్నదైనా పండుగ కళ రావాల్సిందే.. 1BHKలో దీపావళి డెకరేషన్ కోసం సింపుల్ టిప్స్

రోజూ వాకింగ్ చేస్తున్నారా? మీ నడకలో ఈ ఒక్క అలవాటు మార్చుకోవాలి

మేకప్ తొలగించడానికి ఖరీదైన రిమూవర్లు అవసరం లేదు.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి

వంగినప్పుడు లేదా కొంచెం బరువు ఎత్తగానే వెన్నునొప్పి వస్తోందా? దీనికి కారణాలు ఇవే

హైదరాబాద్ స్టైల్ దమ్ కా కీమా..ఇలా చేస్తే రుచి అద్భుతం!

నాన్ వెజ్ లవర్స్ కోసం..స్పెషల్ చికెన్ కారం పొడి రెసిపీ

సాధారణ మటన్ కర్రీ కాదండోయ్.. ఈ స్పెషల్ తలావా గోష్త్ టేస్ట్ వేరే లెవల్ అంతే!

సాయంత్రం పూట వేడి వేడి టీతో..ఈ చిట్టి మురుకులు సూపర్ కాంబినేషన్!

Big Stories

Advertisement
×