E-Paper
Advertisement

ఒక్కో సెలైన్ బాటిల్‌కు రూ.15000 చెల్లిస్తున్న యువత.. డాండియా డాన్స్ పిచ్చి.. ఆరోగ్యకరమేనా?

ఒక్కో సెలైన్ బాటిల్‌కు రూ.15000 చెల్లిస్తున్న యువత.. డాండియా డాన్స్ పిచ్చి..  ఆరోగ్యకరమేనా?
Advertisement

Gen Z Dandiya IV Drip| నవరాత్రి వచ్చిందంటే చాలు.. దేశంలో గర్బా డాన్స్ సందడి మొదలవుతుంది. తొమ్మిది రోజుల పాటు రాత్రివేళల్లో ఉత్సాహంగా డ్యాన్స్ చేయడానికి యువత ప్రత్యేక ఆసక్తి చూపుతారు. గర్భా డాన్స్‌లో ముఖ్యంగా ఫ్రెండ్స్, లవర్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. అందుకే అందంగా కనిపించేందుకు కొత్త దుస్తులు, ఫేషియల్స్, స్కిన్ కేర్ రొటీన్‌లకు ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా గుజరాత్‌లో అయితే గర్భా నైట్స్ సూపర్‌గా ఉంటాయి. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో ఇటీవల మరో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే సెలైన్ బాటిల్స్ (ఐవి డ్రిప్) ట్రీట్‌మెంట్!

చర్మం మెరుస్తూ కనిపించాలని, అలసట తగ్గి ఉత్సాహంగా ఉండాలని కొందరు యువత ఈ ట్రీట్‌మెంట్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మరి ఈ డ్రిప్స్ నిజంగా ఎంతవరకు ఉపయోగపడతాయి? వీటితో ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? అనేది చూద్దాం.

నవరాత్రికి ముందు IV డ్రిప్స్‌కు పెరుగుతున్న డిమాండ్

Advertisement

అహ్మదాబాద్‌లోని కొన్ని ప్రీమియం ఏస్తటిక్ క్లినిక్‌లలో ఐవి డ్రిప్ ట్రీట్‌మెంట్లపై ఆసక్తి పెరుగుతోంది. సాధారణంగా పండుగకు ముందు ఫేషియల్స్, బ్యూటీ ట్రీట్‌మెంట్లు చేయించుకునేవారు ఇప్పుడు ఈ కొత్త విధానాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఐవి డ్రిప్స్‌లో విటమిన్ సి, బి-కాంప్లెక్స్ విటమిన్లు, జింక్, గ్లూటాథయోన్ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. వీటిని నేరుగా రక్తప్రవాహంలోకి పంపిస్తారు. దీంతో చర్మం మెరుగుపడుతుందని, ఎనర్జీ పెరుగుతుందని కొందరు ఆశిస్తున్నారు.

ఒక్కో సెషన్‌కు రూ.10,000 వరకు ఖర్చు

అహ్మదాబాద్‌లో ఒక్క ఐవి డ్రిప్ సెషన్‌కు సాధారణంగా రూ.4,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చవుతుంది. కొన్ని క్లినిక్‌లు పలు సెషన్లతో కూడిన ప్యాకేజీలను రూ.15,000 వరకు అందిస్తున్నాయి. ఉపయోగించే పదార్థాలు, చికిత్స విధానం, క్లినిక్‌ను బట్టి ధర మారుతుంది. చాలామంది నవరాత్రి సమయంలో అలసట లేకుండా గర్బా ఆడాలని, ఫొటోల్లో తాజాగా కనిపించాలని ఈ ట్రీట్‌మెంట్లను ఎంచుకుంటున్నారు.

యువతతో పాటు ఉద్యోగుల్లో కూడా ఆసక్తి

Advertisement

నగరానికి 24 ఏళ్ల డిజిటల్ స్ట్రాటజిస్ట్ రియా షా తన మొదటి ఐవి డ్రిప్ సెషన్‌ను బుక్ చేసుకున్నారు. పనిఒత్తిడి, రాత్రివేళల్లో గర్బా ప్రాక్టీస్ వల్ల తన చర్మం అలసిపోయినట్లు కనిపించిందని ఆమె తెలిపారు. స్నేహితుల సూచన మేరకు ఈ ట్రీట్‌మెంట్‌ను ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు.
మరోవైపు, బోడక్‌దేవ్‌కు చెందిన 38 ఏళ్ల ఆర్థిక సలహాదారు అమిత్ పటేల్ కూడా ఎనర్జీ డ్రిప్ తీసుకున్నారు. రాత్రి గర్ డాన్స్ చేసి అలసటతో ఉదయం ఉద్యోగానికి వెళ్లడం కష్టంగా ఉంటుందని ఆయన వివరించారు.

Also Read: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా? బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 5 ఫుడ్స్ తినకూడదు

ఐవి డ్రిప్స్ విషయంలో వైద్యులు ఏం చెబుతున్నారు?

వైద్య నిపుణులు ఈ ట్రెండ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. డాక్టర్ కింజల్ మెహతా ప్రకారం.. వైద్య పరీక్షలు చేయకుండా ఐవి డ్రిప్స్ తీసుకోవడం ప్రమాదకరం కావచ్చు. కొన్ని సందర్భాల్లో అలర్జీలు, శరీరంలో ద్రవాలు అధికంగా చేరడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అధిక మోతాదులో కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు రావచ్చు.

Also Read: చాణక్య నీతి.. మీతో తియ్యగా మాట్లాడే ప్రతి ఒక్కరినీ నమ్మకండి

ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తప్పనిసరి

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర, సమతుల ఆహారం, తగినంత నీరు తీసుకోవడం ముఖ్యం. అలసట ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. ఐవి డ్రిప్ తీసుకోవాలనుకునేవారు ముందుగా నిపుణుల సలహా తీసుకోవాలి. కేవలం సోషల్ మీడియా ప్రచారాన్ని చూసి ఈ ట్రీట్‌మెంట్లను ఎంచుకోవద్దు. పండుగను ఉత్సాహంగా ఆస్వాదించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం.

Related News

చాణక్య నీతి.. ఈ 4 ప్రదేశాల్లో ఇల్లు కొనకూడదు, నిర్మించకూడదు

అస్సలు చేదు రాకుండా..కరకరలాడే కాకరకాయ వేపుడు!

15 నిమిషాల్లోనే..నోట్లో కరిగిపోయే కమ్మని రవ్వ బర్ఫీ చేయండిలా!

రెస్టారెంట్ స్టైల్ చికెన్ వేపుడు..ఇలా చేసారంటే టేస్ట్ అదిరిపోద్ది

39 ఏళ్ల వయసులోనూ 22 ఏళ్ల బయోలాజికల్ ఏజ్ సాధించిన మహిళ.. యంగ్ లుక్స్ కోసం ఏం చేసిందంటే

ఒక్కసారి ఇలా షెజ్‌వాన్ చికెన్ నూడుల్స్ చేసి చూడండి.. రుచి మామూలుగా ఉండదు!

పురుషులు ఎప్పటికీ బయటికి చెప్పరు.. రిలేషన్‌షిప్‌లో ఈ 9 విషయాలు కోరుకుంటారు

Big Stories

Advertisement
×