E-Paper
Advertisement

మైదానంలోకి వ‌చ్చి గంభీర్ రౌడీయిజం చేశాడు…ఓట‌మి భ‌యంతో రెచ్చిపోయాడు

మైదానంలోకి వ‌చ్చి గంభీర్ రౌడీయిజం చేశాడు…ఓట‌మి భ‌యంతో రెచ్చిపోయాడు
Advertisement

Tanveer Ahmed On Gambhir Over IND VS WI :  టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య రాంచీ వేదికగా రెండో టీ20 జరగగా.. ఇందులో శ్రేయస్ అయ్యర్ సేన చిత్తుగా ఓడిపోయింది. 250 పరుగుల టార్గెట్ పెట్టినప్పటికీ కూడా విండీస్ ప్లేయర్లు, ఊచకోత కోసి ఇండియాను ఓడించారు. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తున్న క్రమంలో… హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మైదానంలోకి వచ్చాడు. ఇటీవల ఐసీసీ కొత్తగా తీసుకువచ్చిన రూల్స్ ప్రకారం… డ్రింక్స్ బ్రేక్ సమయంలో నేరుగా మైదానంలోకి గౌతమ్ గంభీర్ వెళ్లాడు. ఈ సందర్భంగా టీమిండియా బౌలర్లకు పలు సూచనలు చేశాడు.

మైదానంలోకి వ‌చ్చి గంభీర్ రౌడీయిజం చేశాడు…ఓట‌మి భ‌యంతో రెచ్చిపోయాడు

మ్యాచ్ మ‌ధ్య‌లో గౌతమ్ గంభీర్ మైదానంలోకి వెళ్లడంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెస్టిండీస్ బ్యాటర్ల పై రౌడీయిజం చేసేందుకు మైదానంలోకి గంభీర్ వెళ్లాడని ఆరోపణలు చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ కు వెస్టిండీస్ క్రికెటర్లు వినకపోవడంతో… మైదానంలోకి వెళ్లి బెదిరించే ప్రయత్నం చేశాడని కూడా వెల్లడించారు. ఒక కోచ్ నేరుగా మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వెళ్లడం ఇదే తొలిసారి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ, భారత సర్కార్ అండదండలు ఉన్న నేపథ్యంలో గంభీర్ ఇలా బరితెగించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదానంలోకి వెళ్లిన గౌతమ్ గంభీర్ పై ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో గౌతమ్ గంభీర్ పై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

గంభీర్ పై వెంట‌నే ఐసీసీ బ్యాన్ విధించాలి

వెస్టిండీస్ చేజింగ్ చేస్తున్న సమయంలో భారత బౌలర్లు తేలిపోయారు. స్పిన్నర్లు అటు ఫాస్ట్ బౌలర్లు ఎవరు బంతులు వేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా కూడా పరుగులు వస్తూనే ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక నేరుగా గౌతమ్ గంభీర్ బరిలోకి దిగాడు. డ్రింక్స్ బ్రేక్ సమయంలో మైదానంలోకి వచ్చి బౌలర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అయితే, ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పై తన్వీర్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐసీసీ తీసుకువచ్చిన రూల్స్ ను వాడుకొని గౌతమ్ గంభీర్ రౌడీయిజం చేసేందుకు ప్రయత్నించాడని బాంబు పేల్చారు. టీమిండియా ఓడిపోతుందని ముందే గ్రహించి వెస్టిండీస్ క్రికెటర్లకు డబ్బులు ఆఫర్ చేసిందని బిసిసిఐపై ఆరోపణలు చేశారు.

Advertisement

అయితే ఫిక్సింగ్ కు వెస్టిండీస్ క్రికెటర్లు ఒప్పుకోకపోవడంతో.. నేరుగా గౌతమ్ గంభీర్ మైదానంలోకి డ్రింక్స్ బ్రేక్ ను వినియోగించుకొని వెళ్లాడని తెలిపారు తన్వీర్ అహ్మద్. ఈ గ్యాప్ లో వెస్టిండీస్ క్రికెట్లను గౌతమ్ గంభీర్ బెదిరించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియాను ఓడిస్తే, మీకు ఐపిఎల్ లో అవకాశాలు ఇవ్వకుండా చేస్తామని బెదిరింపులకు గురి చేసినట్టు ఆరోపించారు. అందుకే మైదానంలోకి వెళ్లి గౌతమ్ గంభీర్ రెచ్చిపోయాడని బాంబు పేల్చారు. దీనిపై వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీమిండియా అటు బీసీసీఐ రెచ్చిపోయి ప్రత్యర్ధులను భయభ్రాంతులకు గురి చేస్తుందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దీంతో గౌతమ్ గంభీర్ పై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

 

 

Related News

సోష‌ల్ మీడియా వార్‌…పాపం, గిల్ చేసిన త‌ప్పుకు శ్రేయ‌స్ సేన బ‌లి

వాడికి బ్యాటింగ్ రాదు, బౌలింగ్ చేత‌కాదు…టీమిండియా ఓట‌మి కార‌ణం శివ‌మ్ దూబేనే

బౌండ‌రీ సైజు 80 మీటర్లు చేయండి..లేక‌పోతే 500ల ప‌రుగులు చేసినా క‌ష్ట‌మే

సంజు శాంస‌న్ సెంచ‌రీ మిస్…వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి

విరాట్ కోహ్లీకి బలుపెక్కువ…బుమ్రా లేదు, వుమ్రా లేదంటూ తక్కువ అంచనా వేశాడు

సంజు జోలికి వస్తే తాట తీస్తా, చేతకాకపోతే తప్పుకో…గంభీర్‌కు డీకే వార్నింగ్

పులి లాంటి ఆస్ట్రేలియా పసికూనలా మారిపోయింది..ఒంటి చేత్తో ఓడిస్తా

Big Stories

Advertisement
×