BigTV English

Mangoes and Weight Gain: మామిడి పండ్లను తింటే బరువు పెరుగుతారా..? అసలు విషయమేంటో తెలుసుకోండి..!

Mangoes and Weight Gain: మామిడి పండ్లను తింటే బరువు పెరుగుతారా..? అసలు విషయమేంటో తెలుసుకోండి..!

Can Mangoes Leads to Weight Gain?: ఎండాకాలం వచ్చేసింది. మామిడి పండ్లు సీజన్ కూడా ప్రారంభమైంది. ఈ పండ్లంటే చాలా మందికి ఎంతో ఇష్టం. తియ్య తియ్యని మామిడి పండ్లను తినేందుకు అందరూ ఆసక్తి చూపుతుంటారు. కాని వీటిని తింటే బరువు పెరుగుతామో అన్న భయం చాలామందిలో ఉంటుంది. మరి నిజంగా మామిడి పండ్లను తింటే బరువు పెరుగుతామా? వేడి చేస్తుందా? దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏంచెబుతున్నారో తెలుసుకుందాం.. మామిడి పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, కాపర్, ఫోలేట్ వంటి పోషకాలు అన్ని మామిడి పండ్లలో ఉంటాయి. వీటితో పాటు ఫైబర్లు, ప్రొటీన్లు వంటివి కూడా ఉంటాయి. ఇందులోని ఫైబర్ డయాబెటిస్ ని తగ్గించేందుకు తోడ్పడుతుంది. ఇందులో కేవలం ఒక్క శాతం మాత్రమే ఫాట్ ఉంటుంది. ఇది చాలా పదార్ధాలతో పోలిస్తే తక్కువనే చెప్పాలి.


మరి ఇన్ని పోషకాలు ఉన్నా మామిడి పండ్లు తింటే ఎందుకు బరువు పెరుగుతామని చాలా మంది భావిస్తున్నారు. అంటే వీటి రుచిని పెంచేందుకు  జ్యూస్ లు, మిల్క్ షేక్ ఐస్ క్రీమ్ ల  వంటి రూపంలో తీసుకుంటారు చాలా మంది. వీటిలో కొవ్వు కాలరీలు ఉండే పంచదార పదార్ధాలు ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. కానీ మామిడి పండ్లను తినడం వల్ల సాధారణంగా బరువు పెరగరు. కానీ వాటిని జ్యూస్ ల రూపంలో తీసుకోవడం వల్ల ఒకేసారి ఎక్కువ మోతాదులో శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. అందుకే మామిడి పండ్లను తినడానికే ఆసక్తి చూపండి. జ్యూస్ ల రూపంలో మాత్రం తీసుకోవద్దు.

అలాగే మామిడి పండ్లు శరీరానికి ఎంతో మంచిదైనా సరే రుచిగా ఉంది కదా అని ఎక్కువగా తీసుకోకూడదు. ఒక సాధారణ సైజు మామిడి పండ్లలో దాదాపు 150 కేలరీలు ఉంటాయి. రోజుకి 4,5 మామిడి పండ్లు తినడం వల్ల వాటి నుంచి 600 కేలరీలు శక్తి మన శరీరానికి అదనంగా అందుతుంది. వీటితో పాటు మన రెగ్యులర్ గా తినే ఆహారం కూడా తీసుకుంటాం కాబట్టి కేలరీలు ఎక్కువగా అంది బరువు పెరిగే ప్రమాదం ఉంది. అయితే ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదు కాని రెగ్యులర్ గా మాత్రం రోజుకి ఒకటికంటే ఎక్కువ మామిడి పండ్లు తినకపోవడం మంచిది.


Also Read: Pesticides on Fruits : డేంజర్.. పండ్లపై క్యాన్సర్ ప్రేరేపిత పురుగుల మందులు.. ఎలా తొలగించాలి?

అలాగే ఇతర ఆహార పదార్ధాలతో కలిపి తీసుకోకూడదు. దాని వల్ల శరీరంలో ఒకే సారి చక్కెర స్థాయిలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. డయాబెటిస్ ఉన్న వాళ్లు అస్సలు అలా చేయకూడదు. వీలైనంత వరకు భోజనం లేదా టిఫెన్ చేసిన తర్వాత రెండు గంటలకు తీసుకుంటే మంచిది. దీని వల్ల చక్కెర స్థాయిలు పెరిగినా ఇబ్బంది ఉండదు. మామిడి పండ్లను తినడం వల్ల మీరు తీపి తినలేకపోతున్నారన్న ఫీలింగ్ కూడా తొలగిపోతుంది. చాలా మంది మామిడి పండ్లను తింటే వేడి చేస్తుందని భావిస్తుంటారు. కాని అది అపోహ మాత్రమే.. నిజానికి మనం వేసవి కాలంలో నీళ్లు సరిపడా తాగక వచ్చిన సమస్య అది. సో.. వేడి చేస్తుందని మామిడి కాయలు తినడం మానకండి.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×